ఓం “దేవర” కాపీయే నమః అన్నీ కలిపి మిక్సీలో వేశారా…?

ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర. అసలే ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ను సెకండ్ హీరోని చేసారనే మంటలో ఫ్యాన్స్ ఉన్నారు. రామ్ చరణ్ కు పడిన షాట్స్, ఎన్టీఆర్ కు పడిన షాట్స్ ని పోల్చి చూస్తే ఎవడికి అయినా అదే ఫీల్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 12, 2024 | 01:34 PMLast Updated on: Sep 12, 2024 | 1:34 PM

Devara Movie Copy Scenes

“ఎన్టీఆర్ ఫ్యాన్ గా కాకుండా ఒక సినిమా ప్రేక్షకుడిగా చెప్పండి… దేవర ట్రైలర్ చూసినంత సేపు ఆచార్య ట్రైలర్ చూసిన ఫీల్ రాలేదా…? ఆ ధైర్యం, భయం డైలాగ్ లు జనతా గ్యారేజ్ లో విన్నట్టు లేదూ…? ఆ మోకాలి మీద కూర్చున్న యాక్షన్ సీన్ ఆచార్యలో రామ్ చరణ్ చేసినట్టు లేదా…? చుట్టమల్లె పాట ట్యూన్ శ్రీలంక సాంగ్ నుంచి కాపీ చేయలేదా…?” వింటుంటే ఒళ్ళు మండుతుంది కదా…? చూసిన జనాల పరిస్థితి కూడా అదే. ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర. అసలే ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ను సెకండ్ హీరోని చేసారనే మంటలో ఫ్యాన్స్ ఉన్నారు.

రామ్ చరణ్ కు పడిన షాట్స్, ఎన్టీఆర్ కు పడిన షాట్స్ ని పోల్చి చూస్తే ఎవడికి అయినా అదే ఫీల్. ఇప్పుడు దేవర సినిమా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎన్టీఆర్ లాంటి యాక్టర్ ను వాడుకోవడం వస్తే సినిమా చెయ్యాలి… లేదా అసలు సినిమా మొదలుపెట్టకూడదు. జై లవ కుశ సినిమా గుర్తుండే ఉంటుంది మీకు. సినిమా ఎలా ఉన్నా ఎన్టీఆర్ ను ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు దర్శకుడు బాబీ. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ చేసిన యాక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటిది ఎన్టీఆర్… రెండేళ్ళు ఒక సినిమా మీద పెడితే ఎంత ఫోకస్ పెట్టాలి.

ఫోకస్ పెడితే కాపీ అనే మాట రాదు. అల్లు అర్జున్ తో చేయాల్సిన కథను ఎన్టీఆర్ తో చేసాడు బాగానే ఉంది. అలాంటప్పుడు కమర్షియల్ సినిమాలా ఉండకూడదు. కాని… శ్రీలంక నుంచి మొదలుపెట్టి… బాలీవుడ్ లో కాస్త కలుపుకుని… తమిళ సినిమాలో మ్యూజిక్ ని మిక్స్ చేసి… ఫ్లాప్ సినిమా ఆచార్యలో సీన్స్ ని ఎన్టీఆర్ తో రీ షూట్ చేసి ట్రైలర్ లాంచ్ చేసారు. ట్రైలర్ ఊహించిన రేంజ్ లో లేదు. ముంబై వాళ్లకు కొత్తగా ఉంటదేమో గాని మనకు అలా లేదు. ఫ్యాన్స్ ఎంత సర్ది చెప్పుకున్నా ట్రోలింగ్స్ ఆగడం లేదు ఇప్పుడు.

కొరటాల సినిమా ట్రైలర్ లు ఓ రేంజ్ లో ఉంటాయి.. మరి దేవర ట్రైలర్ ఏ రేంజ్ లో ఉందో కొరటాలే చెప్పాలి. సైఫ్ అలీ ఖాన్ ను తీసుకుంది హిందీ వసూళ్ళ కోసమే… ట్రైలర్ చూస్తుంటే… హీరోకి విలన్ కి మధ్య స్నేహం ఉండేది తర్వాత విడిపోయారు. ఈ రొట్ట కాన్సెప్ట్ చాలా సినిమాల్లో ఉంది. సలార్ లో అదే కదా…? పుష్ప సినిమాలో అదే కదా…? కాంతారా సినిమాలో అదే కదా…? అందుకే ఇప్పుడు దేవర కాపీ అనే మాట వచ్చింది. కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన ఫ్యాన్స్ కి కళ్ళల్లో నుంచి రక్తం కారుతుంది.