ఇవేం రికార్డులు… దేవర దూకుడికి అడ్డు అదుపు లేదా..?
దేవర రిలీజ్ కి ముందే రకరకాల రికార్డుల సొంతం చేసుకున్నాడు. ఇదేం కొత్త విషయం కాదు, ఓవర్ సీన్ లో మరీ ముఖ్యంగా అమెరికాలో అడ్వాన్స్ బుక్కింగ్స్ లో మిలియన్లు కొల్ల గొట్టాడు. అది కాకుండా లాస్ ఎంజీల్స్ లో పెద్ద షోతో మరోరికార్డు సొంతం కాబోతోంది.
దేవర రిలీజ్ కి ముందే రకరకాల రికార్డుల సొంతం చేసుకున్నాడు. ఇదేం కొత్త విషయం కాదు, ఓవర్ సీన్ లో మరీ ముఖ్యంగా అమెరికాలో అడ్వాన్స్ బుక్కింగ్స్ లో మిలియన్లు కొల్ల గొట్టాడు. అది కాకుండా లాస్ ఎంజీల్స్ లో పెద్ద షోతో మరోరికార్డు సొంతం కాబోతోంది. ఈ గురువారం ఇండియన్ సినిమాల్లో ఏ మూవీకి దక్కని గౌరవం దేవరకు దక్కబోతోంది. మొన్న క్యాన్సిల్ అయిన ఈవెంట్ ని గురువారం పెట్టాలనుకున్నా, సక్సెస్ సెలెబ్రేషన్స్ కే మొగ్గచూపుతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీ ఆర్ …ఎందుకు? రికార్డుల మాయలో పడి, క్యాన్సిల్ అయిన ప్రీరిలీజ్ ఈవెంట్ ని రీ ఎరేంజ్ చేయట్లేదా?
దేవర ఈవెంట్ క్యాన్సిల్ అయినా మరోక ఈవెంట్ పెడతామంది ఫిల్మ్ టీం. కాని ఈలోపే మ్యాన్ ఆఫ్ మాసెస్ లాస్ ఏంజిల్స్ లో ప్రత్యక్షమయ్యాడు. దేవరని యూఎస్ లో ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు. అంతేకాదు ఈనెల 27 వరకు తను అక్కడి నుంచి కదిలే అవకాశమే లేదు. అంటే కనీసం రిలీజ్ కి ఒకరోజు ముందైనా దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ ఉంటుందనే ఆశలు ఆవిరయ్యాయి
అలాని ఈవెంట్ ఉండదని కాదు. కాకపోతే ప్రీరిలీజ్ ఈవెంట్ కాస్త పోస్ట్ రిలీజ్ ఈవెంట్ గా మారబోతోంది. అంటే దేవర విడుదలయ్యాక చేసే సెలబ్రేషనే విజయోత్సవ సభరూపంలో ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఈసారి ఓపెన్ గ్రౌండ్ లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.
ఇక రికార్డుల గురించి మాట్లాడాల్సి వస్తే, దేవర ఉత్తర అమెరికాలో 9 రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ కిముందే అడ్వాన్స్ బుక్కింగ్స్ రూపంలో 2 మిలియన్ల డాలర్లు రాబట్టింది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, కెనెడాల్లో 40 వేల టిక్కట్ల బుక్కింగ్ జరిగిపోయింది. అలా వాటితో మరో 2 మిలియన్ల డాలర్లు వచ్చినట్టే అని తెలుస్తోంది.
ఇది కాకుండా లాజ్ ఏంజిల్స్ లో బియాండ్ ద ఫెస్ట్ పేరుతో జరిగే సినిమాల ఈవెంట్ లో ప్రదర్శితమౌతున్న తొలి భారతీయ సినిమాగా దేవర రికార్డు కన్ఫామ్ అయ్యింది. ఈనెల 26న అంటే గురువారం దేవర షోని ఈజిప్షియన్ థియేటర్స్ లో ప్రీమియర్ గా వేయబోతున్నారు.ఇలాంటి గౌరవం దక్కిన తొలి భారతీయ సినిమా దేవరానే. ఇక దేవరలో హీరోయిన్ జాన్వీ చేసిన తంగం పాత్ర సినిమా ఇంటర్వెల్ తర్వాతే వస్తుందట. సెకండ్ హాఫ్ లోనే ఈ పాత్రని తీసుకొచ్చి, రెండో భాగం కి తన పాత్రే కారణం అయ్యేలా తీశారనే టాక్ కిక్ ఇస్తోంది. సెకండ్ హాఫ్ మొత్తం దేవర వారసుడిగా వర దాడి మీదే కథ నడవబోతోందనే విషయం బయటికి లీకైంది. అది కూడా సినిమాహైప్ ని ఇంకాస్త పెంచుతోంది.