దేవరని మింగేసేందుకొచ్చి… అడ్రస్ లేకుండాపోయారా..?

పాన్ ఇండియా లెవల్లో ఓ మూవీ మైండ్ బ్లాంక్ చేయాలంటే, కథ కత్తిలా ఉండాలి. హీరోకి లార్జర్ దేన్ లైఫ్ అనిపించేలా ఇమేజ్ ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లా పాన్ ఇండియా కింగ్ అనిపించుకోవాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 18, 2024 | 04:24 PMLast Updated on: Oct 18, 2024 | 4:24 PM

Devara Movie Domination In Dasara Season

పాన్ ఇండియా లెవల్లో ఓ మూవీ మైండ్ బ్లాంక్ చేయాలంటే, కథ కత్తిలా ఉండాలి. హీరోకి లార్జర్ దేన్ లైఫ్ అనిపించేలా ఇమేజ్ ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లా పాన్ ఇండియా కింగ్ అనిపించుకోవాలి. లేదంటే పుష్ప, త్రిబుల్ లాంటి మూవీలతో ప్రూవ్ చేసుకున్న అల్లు అర్జున్, రామ్ చరణ్ లా పాన్ ఇండియా లెవల్లోక్రేజ్ ఉండాలి. మొత్తంగా చెప్పాలంటే తెలుగు హీరో రేంజ్ లో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేయాలి. ఆ కిటుడు తెలియని, సూర్య, అజిత్, విజయ్ ఇలా అరవ తంబీలు ఎన్ని ప్రయోగాలు చేసినా చేతులు కాలుతున్నాయి. అందుకే రీసెంట్ గా సూర్య తన కంగువాకి రెబల్ స్టార్ ప్రభాస్ ని గెస్ట్ గా పిలిచాడు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాలూకు సీన్ లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. మరి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కి అసలైన అథిది ఎవరు? కోలీవుడ్ కి తప్ప తెలుగు స్టార్లకు అవసరం లేని ఈ అతిముఖ్యమైన అతిధి సాయం ఎందుకు? 

దేవర చేపకాదు, కనీసం సొర కాదు, తిమింగలం అని బాక్సాఫీస్ లెక్కలు తేల్చాయి. అలాంటి దేవరనే మింగేస్తామంటూ అరడజన్ కి పైనే బడ్ స్టార్లు, సినిమాలు క్యూ కట్టాయి. కాని సూపర్ స్టార్ వెట్టయాన్ నుంచి కార్తి సత్యం సుందరం వరకు ఏ సినిమా కూడా దేవర రేంజ్ ని టచ్ చేయలేదు. కాబట్టే కలెక్షన్ల వరదలో మార్పులేదు

అంతవరకు బానే ఉంది. కాని దేవర దూకుడుకి తెలుగు సినిమాలైనా స్వాగ్, విశ్వం లాంటి సినిమాలు కూడా కొట్టుకుపోయాయి. మానాన్న సూపర్ హీరో, కూడా సత్యం సుందరం లానే ఎమోషనల్ గా బానే ఉన్నా, దేవర దూకుడుని తట్టుకోలేకపోయింది. మార్టిన్ లాంటి మాస్ మూవీ, జనక ఐతే గనక లాంటి ఎక్స్ పరిమెంటల్ సినిమాకూడా హిట్ మెట్టెక్కడం కాదు, కనీసం గట్టెక్కలేకపోయాయి

మొత్తంగా దేవర సెప్టెబర్ 27నుంచి జర్నీ మొదలు పెట్టి కామెంట్లు, ట్రోలింగ్స్, యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియా ఎటాక్ ఇలా అన్నీంటిని ఎదురుకొంటూ వందలకోట్లు రాబడుతూనే ఉన్నాడు. తనని మింగేందుకొచ్చిన ప్రయోగాలను, తోటి బడా స్టార్ల మూవీలను నలిపేశాడు

కాని ఈ ప్రాసెస్ ఇంకా కొనసాగేలా ఉంది. దేవర రోజుకి కోటికి పైనే తెలుగు రాష్టాల్లో రాబడుతూనే ఉంది. స్టేబుల్ గా దేవర వసూళ్ల వరద కనిపిస్తోంది. అలాంటప్పడు పోటీకి ఏ మీడియం రేంజ్ మూవీ దిగినా మటాషే… అదే జరిగింది.. అదే జరిగేలా ఉంది. అయినా లవ్ రెడ్డి, రివీైండ్, వీక్షనం,లగ్గం లాంటి లోబడ్జెట్ ప్రయోగాుల వస్తున్నాయి. మట్కా లాంటి ప్రయోగంతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడు

నిజం చెప్పాలంటే డిసెంబర్ 6 కి పుష్ప2 రాబోతోంది. అప్పటి వరకు బాక్సాఫీస్ లో దేవర వార్ వన్ సైడే అని తెలుస్తోంది. ఎలాగూ దేవర థియేటర్స్ లో రిలీజైన 8 వారాల తర్వాత కాని ఓటీటీలో రాదు. అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే దేవర ఓటీటీలో వచ్చే ఛాన్స్ ఉంది. అంటే పుష్ప 2కి పోటీ ఉండదు. మార్కెట్ లోఇక దేవర తర్వాత పుష్ప 2 దే అసలైన సందడి… సో అలాచూస్తే, ఇంకా దేవర దూకుడు తగ్గేలా లేదు

ఇంతగా దేవరకి ఇప్పటికీ రెస్పాన్స్ ఉండటానికి రీజన్, నార్త్ ఇండియాలోని మాస్ ఆడియన్స్ కి దేవర బాగా ఎక్కేసింది. అక్కడి ఉప్పు కారం లేని పుల్లటి సినిమాలు చూసిన జనాలకు, ఇది బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఓ మాదిరీ మూవీలకోసం థియేటర్స్ కెళ్లి వందలు, వేలు ఖర్చు చేయటమెందుకునుకునే చాలా మందికి, దేవర మంచి ఆప్షన్ గా మారింది. ఇప్పుడు ఆడియన్స్ లార్జర్ దేన్ లైఫ్ అనిపించే బారీ సినిమాలకోసమే థియేటర్స్ కి క్యూకడుతున్నారు. కాని మీడియం రేంజ్ లేదంటే లోబడ్జెట్ మూవీలకు థియేటర్స్ లో టిక్కెట్లు తెగటం కష్టమైపోతోంది. అందుకే ఇంకా నెలన్నరలో వచ్చే సినిమాలన్నీ దేవర చక్రాల కింద నలగటమే తప్ప మరో మార్గం లేదంటున్నారు. ఏదో అద్భుతం జరిగితే తప్ప దేవర దూకుడుని కొత్త సినిమాలు తట్టుకోవటం కష్టమే అనేస్తున్నారు.