ముగ్గురూ కలిసి దేవరను ముంచుతారా…? బన్నీ దెబ్బ గట్టిగానే

దేవర సినిమాపై ఒక పక్క ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సమయంలో జరుగుతున్న నెగటివ్ ప్రచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సినిమాను ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సమయంలో ఎన్టీఆర్ కు కొన్ని వర్గాల నుంచి నెగటివ్ ప్రచారం ఇబ్బందులు తప్పేలా లేవు అనే చెప్పాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 12, 2024 | 08:50 PMLast Updated on: Sep 12, 2024 | 8:50 PM

Devara Movie Facing Issue With Pavan And Mega Fans

దేవర సినిమాపై ఒక పక్క ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సమయంలో జరుగుతున్న నెగటివ్ ప్రచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సినిమాను ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సమయంలో ఎన్టీఆర్ కు కొన్ని వర్గాల నుంచి నెగటివ్ ప్రచారం ఇబ్బందులు తప్పేలా లేవు అనే చెప్పాలి. ఒక వైపు మెగా ఫ్యాన్స్ మరో వైపు బాలకృష్ణ ఫ్యాన్స్ ఇలా అన్ని వైపుల నుంచి ఎన్టీఆర్ ను కార్నర్ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. మెగా ఫ్యాన్స్ ఇప్పటికే ఎన్టీఆర్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.

కొరటాల శివ విషయంలో మెగా ఫ్యాన్స్ సీరియస్ గా ఉన్నారు. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడానికి మెగాస్టార్ చిరంజీవి కారణం అని అప్పట్లో ప్రచారం జరిగింది. కొరటాల శివకు మొదటి ఫ్లాప్ చిరంజీవి కారణంగా వచ్చింది అంటూ అప్పుడు జనాలు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వంతు వచ్చింది. ఆచార్య సినిమా సీన్లను కాపీ చేసి దేవర సినిమాలో పెట్టారని మీమ్స్ కూడా వస్తున్నాయి. ఇది అలా ఉంచితే… ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అల్లు అర్జున్ కి ఎన్టీఆర్ కి మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే.

ఆ స్నేహంతో… ఇంటర్వ్యూలు కూడా అల్లు అర్జున్ తో కలిసి చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. దీనితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దేవర సినిమా కాపీ అంటూ వాళ్ళు కూడా నెగటివ్ ప్రచారం మొదలుపెట్టారు. ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ లేదు అంటూ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. వాళ్ళు ఊహించినట్టు అల్లు అర్జున్ తో ఇంటర్వ్యూలు చేస్తే కథ మారినట్టే ఇక. ఎలాగూ బాలయ్య ఫాన్స్ కి ఎన్టీఆర్ దూరం అయ్యారు. ఒకవైపు వాళ్ళు కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.