DEVARA Glimpse: ఎన్టీఆర్ విశ్వరూపం.. సముద్రాన్ని ఎరుపెక్కించిన దేవర
ట్రిపులార్ తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఆ స్టాయి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతో బయటకు వచ్చిన గ్లింప్స్‌తో ఆ కోరిక తీరినట్లుగా తెలుస్తోంది. భయానికే భయం పుట్టించేందుకు నావ ఎక్కి వస్తున్నాడు. స్వారీ చేస్తున్న సింగంలా వచ్చేస్తున్నాడు.
DEVARA Glimpse: దేవర గ్లింప్స్ ఎప్పుడేప్పుడు వస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూశారు. దేవర ప్రపంచం ఎలా ఉండబోతుందోనని గ్లింప్స్ కోసం ఆసక్తిగా వెయిట్ చేశారు. అభిమానుల ఆకలి తీర్చేలా ఫైనల్‌గా దేవర గ్లింప్స్ వచ్చేసింది. భయానికే దేవుడుగా వచ్చేశాడు. అసలైన మృగాల వేట ఎలా ఉంటుందో రుచి చూపించాడు. సముద్రం అలలతో కత్తికి అంటిన రక్తాన్ని కడిగేశాడు. సముద్రం ఎరుపెక్కేలా యాక్షన్‍తో దేవర గ్లింప్స్ పవర్ ఫుల్‍గా కనిపించి సినిమాపై అంచనాలు పెంచేశాడు. ట్రిపులార్ తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఆ స్టాయి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
Salaar 2 : సలార్-2 రిలీజ్‌పై నిజమేనా..?
దీంతో బయటకు వచ్చిన గ్లింప్స్‌తో ఆ కోరిక తీరినట్లుగా తెలుస్తోంది. భయానికే భయం పుట్టించేందుకు నావ ఎక్కి వస్తున్నాడు. స్వారీ చేస్తున్న సింగంలా వచ్చేస్తున్నాడు. దేవర అనే సముద్రం తీరం దాటి.. అది సునామీలా మారి ఎర్రటి రక్తపు అలలపై దూసుకువచ్చాడు. పాన్ ఇండియా ట్రెండ్‌కు తగ్గట్లుగా కొరటాల శివ కసిగా తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సీన్లు, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయి. గ్లింప్స్ అలా రిలీజైందో లేదో అప్పుడే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ట్రైలర్ విషయానికి వస్తే.. గంభీరమైన వాయిస్‌తో సాగే గ్లింప్స్ గూస్ బంమ్స్ తెప్పిస్తుంది. ఎన్టీఆర్ ఊచకోతకు ఒళ్లు గగుర్పొడిచేలా కనిపించింది. సముద్రంలో పడవల్లో సముద్రపు దొంగలు ఓడని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇక రంగంలోకి దిగిన తారక్ వారిని తెగనరికి సముద్రపు ఒడ్డున పడేస్తాడు.
దీంతో సముద్రం మొత్తం రక్తంతో ఎర్రగా మారుతుంది. అ సమయంలో ఈ సముద్రం చేపల కంటే కత్తులు, నేత్తురునే ఎక్కువగా చూసింది.. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. మొత్తానికి బాక్సాఫీస్ ఊచకోత నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని వీడియో చూస్తే అర్థమవుతోంది.