1000 కోట్ల కటౌట్ …. టంగ్ స్లిప్ అయిన లివింగ్ లెజెండ్ …

దేవర మూవీ షేర్ వసూళ్ల పరంగా వెయ్యికోట్లను రీచైనా, 510 కోట్ల కలెక్సన్స్ నే లెక్కలోకి తీసుకోవటం వెనక ఓ చిన్న లాజిక్ ఉంది. అక్కడే చిన్న నిరాశ కూడా ఫ్యాన్స్ లో కనిపించింది. దేవర దుమ్ముదులిపే మాస్ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 15, 2024 | 02:58 PMLast Updated on: Nov 15, 2024 | 2:58 PM

Devara Movie Has Reached Thousands Of Crores In Terms Of Share Collections

దేవర మూవీ షేర్ వసూళ్ల పరంగా వెయ్యికోట్లను రీచైనా, 510 కోట్ల కలెక్సన్స్ నే లెక్కలోకి తీసుకోవటం వెనక ఓ చిన్న లాజిక్ ఉంది. అక్కడే చిన్న నిరాశ కూడా ఫ్యాన్స్ లో కనిపించింది. దేవర దుమ్ముదులిపే మాస్ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. మరీ ముఖ్యంగా నార్త్ ఇండియాని ఏలింది.. కాని వెయ్యికోట్ల వసూళ్ళ విషయంలో 60 శాతమే రీచైంది. ఓరకంగా ఓటీటీతో ఫిల్మ్ టీం కమిటైన డీల్ ఒక కారణమైతే, మరొకటి, రెండు భాగాల కథలో, హై ఓల్డేట్ కథని రెండో భాగానికి షిఫ్ట్ చేయటం. ఈ విషయంలోనే టాలీవుడ్ లివింగ్ లెజెండ్ రైటర్ టంగ్ స్లిప్ అయ్యాడు. అలా దేవర 1000 కోట్లను మించే కటౌట్ కాని, 300 కోట్లు మిస్సింగ్ కి కారణం ఏంటో తేల్చాడు.. అక్కడే జస్ట్ టంగ్ స్లిప్పయ్యాడనే కామెంట్స్ పెరిగాయి… అదేంటో చూసేయండి.

దేవర మూవీ థియేటర్స్ లో సునామీ క్రియేట్ చేసింది. ఓటీటీని ఇప్పుడు షేక్ చేస్తోంది. అయితే ఈ సినిమా వసూళ్ల మీద అప్పుడు, ఇప్పడు కామన్ గా ఉంది కన్ ఫ్యూజనే. బేసిగ్గా గ్రాస్ వసూళ్ల పరంగా, ఇండియా, ఓవర్ సీస్ లో ఈ సినిమా ఆల్ మోస్ట్ 800 కోట్ల వసూళ్లు రీచ్ అయ్యిందన్నారు. కాకపోతే గ్రాస్ వసూళ్లని కాకుండా నెట్ వసూల్లనే లెక్కలకు తీసుకోవటం వల్ల 510 కోట్ల వసూళ్లే ఎనౌన్స్ చేశారని ప్రచారం జరిగింది

ఏదేమైనా దేవర విడుదలైన 8 వ వారం ఓటీటీలో రిలీజ్ చేయాలనే కండీషన్ మీదే దేవర 270 కోట్ల వరకు ప్రీ రిలీజ్ సేల్ జరిగింది. కాబట్టే వెయ్యికోట్ల వరదొచ్చే లోపే దేవర ఓటీటీలో దర్శనమిచ్చాడు. ఐతే రెండు భాగాలుగా విడుదల ప్లాన్ చేసిన ఏమూవీ కూడా మొదటి ఎటమ్ట్ లోనే 1000 కోట్లు రాబట్టలేదు. కేజీయఫ్, బాహుబలి, పుష్ప అన్నీ కూడా 400 కోట్ల నుంచి 500 కోట్లురాబట్టిన సినిమాలే

ఆతర్వాతే కేజీయఫ్ 2, బాహబులి 2 మూవీలు 1000 కోట్లను మించేశాయి. ఒక్క కల్కీ మాత్రమే 1200 కోట్లతో ట్రెండ్ సెట్ చేసింది. ఇవన్నీ పక్కన పెడితే, ఎన్టీఆర్ దేవరకి 1000 కోట్లను మించే శక్తి ఉన్నా, ఆ రికార్డు వచ్చేలోపు ఓటీటీలో దేవర రావటం ఒక మైనెస్ అయితే, ఈ సినిమాలో చిన్న మార్పు చేయకపోవటం మరో మైనెస్ అన్నాడు లివింగ్ లెజెండ్ పరుచూరి గోపాల కృష్ణ.

దేవర మూవీలో ఎక్కవ శాతం దేవరనే చూపించారు.. అలా కాకుండా దేవర మొదటి భాగంలో తండ్రి పాత్రని 30శాతమే చూపించి, మిగతా కథంతా దేవర కొడుకు వర పాత్రతోచూపిస్తే బాగుండేదనేది పరచూరి బ్రదర్ అభిప్రాయం. అంతేకాదు జాహ్నవితో రొమాన్స్ డోస్ పెంచి, ఇంకాస్త వర పాత్ర నిడివి పెంచి, దేవర తాలూకు లైఫ్ మీద సీక్రెట్స్ అలానే కొనసాగిస్తే బాగుండన్నాడు

కాని దేవరలో చూపించింది పదిశాతమే అనేది కొరటాల శివ మాట. ఒక దర్శక రచయితగా మొదటి భాగంలో 10 శాతమే దేవర, వర పాత్రలను చూపించాడన్నాడంటే, ఇది కేవలం ఇంట్రడక్షన్ గానే అర్ధం చేసుకోవాలి. సో 90 శాతం అసలు కంటెంట్ దేవర 2 లో ఉందంటే, భూమి బద్దలయ్యే కంటెంట్ అందులో ఉందని తెలుస్తోంది

ఇలాంటి టైంలో పరచూరి గోపాల కృష్ణ, దేవరలో టైటిల్ రోల్ పాత్ర తాలూకు డ్యూరేషన్ తగ్గించి, ఇంకాస్త సస్పెన్స్ పెంచింతే బాగుండేదన్నాడు. బాహుబలిలో అమరేంద్ర బాహుబలి పాత్రని కాసేపే చూపించి మొత్తం శివుడితో కథ నడిపించారు. పార్ట్ 2 లో అమరేంద్ర బాహుబలి పాత్రని చూపించారు. అలా దేవరలో కూడా దేవర పాత్రని మరి అంతచూపించకుండా, వర పాత్రతో సెకండ్ హాఫ్ నడిపిస్తే ఇది 1000 కోట్లని మించేదనే సలహా ఇచ్చాడు. ఏదేమైనా దేవర 2 లో ఇంతకు మించి సర్ ప్రైజ్ లున్నాయి కాబట్టి, రెండు సినిమాల వసూల్లు కలపి 2 వేల కోట్లని దాటే సేఛాన్స్ ఉంది. ఆ విషయంలో దేవర టీం ఫుల్ కాన్పిడెంట్ గా ఉంది.