దెబ్బకు 250 కోట్లు… వసూళ్లతో సముద్రం బరువెక్కింది…
దేవర పాన్ ఇండియా హిట్ మూవీల్లో వసూళ్ల పరంగా టాప్ ఫైవ్ లిస్ట్ లో చేరింది. ఇండియాలోనే కాదు యూఎస్ లో కూడా మొదటి రోజు వసూళ్ల పరంగా అక్కడ కూడా టాప్ ఫైవ్ మూవీస్ లో చేరిపోయింది. విచిత్రం ఏంటంటే మొదటి రోజు కంటే సెకండ్ డే టాక్ లో మార్పు వస్తే, వసూళ్లలో మార్పు నెగెటివ్ గా కనిపించాలి.
దేవర పాన్ ఇండియా హిట్ మూవీల్లో వసూళ్ల పరంగా టాప్ ఫైవ్ లిస్ట్ లో చేరింది. ఇండియాలోనే కాదు యూఎస్ లో కూడా మొదటి రోజు వసూళ్ల పరంగా అక్కడ కూడా టాప్ ఫైవ్ మూవీస్ లో చేరిపోయింది. విచిత్రం ఏంటంటే మొదటి రోజు కంటే సెకండ్ డే టాక్ లో మార్పు వస్తే, వసూళ్లలో మార్పు నెగెటివ్ గా కనిపించాలి. విచిత్రంగా వసూళ్ల వరద పెరుగుతోంది. 100 కోట్ల ఓపెనింగ్స్ ఎక్స్ పెక్ట్ చేస్తే 172 కోట్లు వచ్చినట్టు, వీకెండ్ కి 200 కోట్ల వసూళ్లు ఎక్స్ పెక్ట్ చేశారు.. కాని 250 కోట్ల వసూళ్లతో మూడు రోజుల్లో 300 కోట్ల వసూళ్లకు దగ్గరైంది దేవర జర్నీ. ట్రోలింగ్స్, కామెంట్స్, రివ్యూలు కూడా భారీ ఎత్తున నెగెటీవ్ గా వస్తే, ఎంత గొప్ప హీరో సినిమా అయినా మటాషే..కాని ఏటికి ఎదురీదుతున్నాడు దేవర. ఎవరెంత నెగెటీవ్ ప్రచారం పెంచినా, ఆ ప్రచారం తగ్గట్టే వసూళ్ల దరువు పెంచేస్తున్నాడు. ఇలా అయితే టాక్ తో సంబంధం లేకుండానే, 22 రోజుల్లో 1000 కోట్ల క్లబ్ లో చేరేలా ఉన్నాడు దేవర.
దేవర మూడురోజుల వసూళ్ల మతిపోగొడుతున్నాయి. మొదటి రోజు 172 కోట్లను వరల్డ్ వైడ్ గా రాబట్టిన దేవర, శనివారం, ఆదివారం తో పాటు ప్రివ్యూ వసూల్ళని కలుపుకుని 250 కోట్లని రీచ్ అయ్యాయి. పాన్ ఇండియా సినిమాల్లో ఫస్ట్ వీకెండ్ 200 కోట్ల క్లబ్ లోచేరి సినిమాల పరంగా, ఈ ఫీట్ సాధించిన నాలుగో హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు ఎన్టీఆర్..
అంతేకాదు యూఎస్ లో ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా కూడా ఓ రేర్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. రెబల్ స్టార్ కల్కీ మూవీ ఐదున్నర మిలియన్ల ఓపెనింగ్స్ తో యూఎస్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటే, 5.4 మిలియన్ల ఓపెనింగ్స్ తో సెకండ్ ప్లేస్ లోత్రిబుల్ ఆర్, 4.5 మిలియన్లతో థర్ట్ ప్లేస్ లో బాహుబలి, 3.82 మిలియన్లతో నాలుగో స్థానంలో సలార్ ఉన్నాయి. ఇక 3.7 మిలియన్ల ఓపెనింగ్స్ తో ఐదో స్తానంలో దేవర ఉంది
ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ ఐదు సినిమాలు తెలుగు సినిమాలే. అంటే యూఎస్ లో భారీ ఓపెనింగ్స్ కేవలం తెలుగు సినిమాలకే వస్తున్నాయి. ఈ ఐదు టాప్ సినిమాల్లో రెండు ఎన్టీఆర్ వి అయితే, మూడు రెబల్ స్టార్ సినిమాలు. అంటే పాన్ ఇండియా లెవల్లోనే కాదు, యూఎస్ లో కూడా రెబల్ స్టార్ స్థానం తర్వాత ప్లేస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ కే దక్కిందనుకోవాల్సి వస్తోంది
ఇక దేవర ప్రివ్యూ వసూళ్లు, ఓపెనింగ్స్ తోపాటు, శనివారం, ఆదివారం వసూళ్ల లెక్కలు తీస్తే 250 కోట్లు తేలటం నిజంగా వింతే. 400 కోట్ల బడ్జెట్ తో తీస్తే, 250 కోట్లు ఫస్ట్ వీకెండ్ లోనే వచ్చాయి. మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. అంటే 5 రోజుల్లో పెట్టుబడి రాబట్టి, ఆతర్వాత వచ్చే వన్నీ లాభాలే అని తేల్చింది దేవర.
నిజానికి 172 కోట్ల భారీ ఓపెనింగ్స్ వల్ల, మూడు రోజుల్లో 300 కోట్లు వసూల్లని ఎక్స్ పెక్ట్ చేశారు. కేరళా, తమిల నాడులో నెగెటీవ్ ప్రచారం పని చేయటం, బాలీవుడ్ కామెంట్లు, ట్రోలింగ్స్ కి బేసిగ్గానే తెలుగు సినిమా మీద కాస్త అసూయగా ఉన్న బ్యాచ్ దేవరని దూరం పెట్టారనే మాటలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, దేవరకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వసూళ్లు, నార్త్ ఇండియాలో వస్తున్న వసూల్లు, యూఎస్ కలెక్సన్స్ ఇవన్నీ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.
నిజం చెప్పాలంటే దేవర మీద కొంత మిక్స్ డ్ టాక్ కి కొన్ని చిన్న చిన్న కారణాలున్నా, అవన్నీ ఎన్టీఆర్ పెర్ఫామెన్స్, క్లైమాక్స్ పోరులో కొట్టుకుపోవటం, మాస్ కి ఈ సినిమా భాగా కనెక్ట్ అవ్వటం తో కూడా సీన్ మారింది. బీ, సీ సెంటర్స్ లో వసూళ్ల హవా పెరిగింది. మరో రెండునెళ్లవరకు పాన్ ఇండియా దుమ్ముదులిపే సినిమా లేకపోవటంతో, ఈ మూవీకి 1000 కోట్ల వసూళ్లు అసలు పెద్ద టార్టెట్టే కాదు.. దీపావళికి పదిరోజుల ముందే అంటే, అక్టోబర్ 20 కల్లా ఈ సినిమా వెయ్యికోట్ల క్లబ్ లో చేరేలా ఉంది.