మాస్ ఆకలి తీర్చాడు కాబట్టే.. 1000 కోట్లు పండగొస్తోందా..?
దేవర మూవీతో ఫ్యాన్స్ లో మొదలైన పూనకాలు, కామన్ ఆడియన్స్ ని నిదానంగా చేరాయి. ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యారని ఫిల్మ్ టీం కంగారు పడేలోపు, మాస్ లో ఊపు మొదలై వసూల్ల లెక్కే మారింది. దానిక్కారణం, అసలు ఆకలితో కరువులో ఉన్న మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టింది దేవర.
దేవర మూవీతో ఫ్యాన్స్ లో మొదలైన పూనకాలు, కామన్ ఆడియన్స్ ని నిదానంగా చేరాయి. ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యారని ఫిల్మ్ టీం కంగారు పడేలోపు, మాస్ లో ఊపు మొదలై వసూల్ల లెక్కే మారింది. దానిక్కారణం, అసలు ఆకలితో కరువులో ఉన్న మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టింది దేవర. ఎంతసేపు ఓమాదిరీ ప్రయోగాలు, కాదంటే ఫ్యామిలీ డ్రామాలు.. అవి కూడా బాక్సాఫీస్ ని పెద్దగా కుదిపేయలేదు. లాస్ట్ ఇయర్ సలార్, ఈ ఏడాది కల్కీ ఈ రెండీంటి తర్వాత ఏదైన సినిమా వచ్చి మాస్ మతిపోగొట్టిందంటే అది దేవరానే. ఓరకంగా పుష్ప సినిమాకు ఎదురైన సమస్యే ఈ మూవీకి వచ్చింది. మొదట్లో పుష్ప రాగానే ఫ్లాప్ అనేశారు. మాసిపోయిన జుట్టు, బట్టలు తప్ప మ్యాటర్ లేదన్నారు. కాని మనీ ఫ్లో చూసి మాసిపోయింది సినిమాల్లో హీరో బట్టే తప్ప, కంటెంట్ కాదని క్లియర్ చేశాయి కలెక్షన్స్… అచ్చం అలాంటి పరిస్థితే దేవరకి వచ్చింది. మరో రెండు నెల్ల వరకు దేవర వసూళ్లకి డోకా లేదని తేలింది.
ఆకలి మీదున్న వాళ్లకి వెజ్ మీల్స్ దొరికితేనే పండగ, అలాంటిది నాటు కోడి బిర్యాని దొరికినే, ఇక నోట్లో పూనకాలే… అదే జరుగుతోంది. గత కొన్నినెలలుగా జనాలు థియేటర్స్ కి రావట్లేదు. వందలు, వేలు పెట్టి థియేటర్స్ కి జనాలు వచ్చేంత గొప్ప సినిమాలు రాకపోవటమే కారనం. నిజానికి కల్కీ రిలీజ్ కాకముందు వరకు కొన్ని సింగిల్ థియేటర్స్ మూసేశారు కూడా..
కల్కీ వచ్చాకే సింగిల్ స్క్రీన్స్ కే కాదు, మల్టీ స్ట్క్రీన్స్ కి కూడా వసూళ్ల కలొచ్చింది. కట్ చేస్తే ఆతర్వాత మళ్లీ సీన్ రిపీట్. కల్కీ వచ్చి వండర్స్ చేసి వెళ్లింది. ఇప్పుడు ఓటీటీలో దుమ్ముదులుపుతోంది. కాని థియేటర్స్ లో మాత్రం దోమలు ఈగలు తప్ప జనాలు లేని పరిస్థితి… దానిక్కారణం, జనాలకు ఎంటర్ టైన్ మెంట్ తో ఆకలి తీర్చే ఓరేంజ్ మూవీలు రాలేదు. కాని దేవర వచ్చాక ఆ ఆకలికి తగ్గ ఫుల్ మీల్స్ దొరికినట్టైంది.
బేసిగ్గా ఆడియన్స్ లో ఈ రెండు మూడేళ్లలో చాలా మార్పు వచ్చిందన్న విషయం చాలా మంది మర్చిపోతున్నారు. నెల ఆగితే ఓటీటీలో సినిమా వస్తోంది కాబట్టి, మీడియం రేంజ్ మూవీలు, టీవీలో చూస్తే సరిపోయే సినిమాలను, ఎవరూ థియేటర్స్ కి వెళ్లిచూడట్లేదు. టిక్కెట్లు, మధ్యలో స్కాన్స్ , రాను పోను చార్చీలు ఇవన్నీ వందలు కాదు వేలకొద్ది ఖర్చుగా మారుతున్నాయి
అందుకే థియేటర్స్ కి వెళ్లితే, ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద తప్ప చిన్న స్క్రీన్ లో చూడలేం అనేటువంటి మూవీలకే వెలుతున్నారు. లాస్ట్ ఇయర్ సలార్, మొన్న కల్కీ, ఇప్పుడు దేవర.. వీటిని స్మాల్ స్క్రీన్ లో చూస్తే ఆ కిక్కు, ఆమజా రాదు..
అందుకే దేవర లాంటి మూవీ రాగానే బిగ్ స్క్రీన్ లో టిక్కెట్ ఖర్చు కి తగ్గ ఎంటర్ టైన్ మెంట్ కన్ఫామ్ అయ్యే జనాలు క్యూ కడుతున్నారు. కేవలం లార్జర్ దేన్ లైఫ్ అనిపించేలా సినిమా తీస్తే చాలా, ఎంటర్ టైన్ మెంట్ ఉండొద్దా అంటే.. అక్కడే లెక్కలు మారుతున్నాయి. దేవరా పక్కా ఊర మాస్ మూవీ. అందుకే రివ్యూల నుంచే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అక్కడక్కా కాస్త నెగెటీవ్ టాక్ వస్తున్నా, మాసెస్ లో మతిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా నెగెటీవ్ టాక్ కి కారనం, ఈ మూవీ మీద బయట జరుగుతున్న నెగెటీవ్ ప్రచారం..
ఏదేమైతేనేం, ఎగ్జిబిటర్స్ ని, డిస్ట్రిబ్యూటర్లని మొత్తంగా పాన్ ఇండియా లెవల్లో సినిమా హాల్లని దేవర కాపాడుతోంది. కల్కీ తర్వాత దేవరకే ఈ క్రెడిట్ దక్కుతోంది. ఇంత ఆకలి మీదున్నారు కాబట్టే, దేవర లాంటి మాస్ మూవీకి వసూళ్ల వరద రోజు రోజుకి కనీసం 25 శాతం పెరుగుతోంది. కాబట్టి 20 రోజుల వరకు వేయిట్ చేయకుండానే, దేవర దసరా లోపు వెయ్యికోట్ల క్లబ్ లో చేరే అవకాశం కనిపిస్తోంది.