8.1 మిలియన్ల గంటలు.. OTTలో ఇప్పటికీ రికార్డు తనదేనా..?
దేవర వచ్చి నెలలు గడుస్తోంది. ఓటీటీలో స్ట్రీమింగ్ లో అందుబాటులోకి వచ్చి కూడా వారాలు దాటింది. ఐనా ఇప్పటికీ దేవర జోరు తగ్గలేదు. పుష్ప 2 రిలీజ్ టైంలో దేవర రికార్డులు రీసౌండ్ చేస్తున్నాయి. ఓటీటీలో ఏకంగా 8.1 మిలియన్ అవర్స్ వ్యూవర్ షిప్ తో దుమ్మదులిపేసింది దేవర మూవీ.
దేవర వచ్చి నెలలు గడుస్తోంది. ఓటీటీలో స్ట్రీమింగ్ లో అందుబాటులోకి వచ్చి కూడా వారాలు దాటింది. ఐనా ఇప్పటికీ దేవర జోరు తగ్గలేదు. పుష్ప 2 రిలీజ్ టైంలో దేవర రికార్డులు రీసౌండ్ చేస్తున్నాయి. ఓటీటీలో ఏకంగా 8.1 మిలియన్ అవర్స్ వ్యూవర్ షిప్ తో దుమ్మదులిపేసింది దేవర మూవీ. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 510 కోట్లు రాబట్టిందంటే మొదట్లో ఎవరూ నమ్మలేదు. తర్వాత నార్త్ ఇండియా వసూళ్ళ లెక్కలతో చాలా కామెంట్లకి బ్రేకులు పడ్డాయి. ఓటీటీలో తమిళ తలైవ రజినీ వెట్టయాన్, దళపతివిజయ్ గోట్ నే కాదు, షారుఖ్ పటాన్, జవాన్ రికార్డులని కూడా బ్రేక్ చేసింది దేవర మూవీ. భారతీయుడు, కల్కీ తాలూకు లైఫ్ టైం ఓటీటీ వ్యూవర్ షిప్ ని కేవలం ఒక నెలలోనే దాటేసింది దేవర మూవీ..ఒక వైపు ఓవర్ సీస్ లో దేవరని మించనున్న పుష్ప2 అనగానే, అంతలేదని ప్రివ్యూ వసూల్ల విషయంలో దేవరని పుష్ప2 మించలేదని అడ్వాన్స్ బుక్కింగ్ తో తేలింది. ఇంతలో ఓటీటీ వ్యూవర్ షిప్ సెన్సేషనౌతోంది
దేవర సెప్టెంబర్ 27న రిలీజై, 510 కోట్లు వసూళ్ళు రాబట్టిన మూవీ. షేర్ వసూళ్ల తోపాటు అన్ని రైట్స్ వల్ల వచ్చిన మొత్తం 1000 కోట్లని రీచైంది. తర్వాతే నెల క్రితం ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి వచ్చింది. కట్ చేస్తే ఇప్పడు కేవలం ఒకే నెలలో 8.1 మిలియన్ అవర్స్ వ్యూవర్ షిప్ ని సొంతం చేసుకుంది
అంతే ఎనబై ఒక్క గంటల పాటు ఈ సినిమాను జనం చూడటం, లేదా 30 లక్షల మంది 3 గంటల సినిమాను చూసిఉండటం… ఇది నిజంగా నెలలో దేవరకి క్రియేట్ అయిన రికార్డు.. విచిత్రం ఏంటంటే ఇది కూడా కేవలం సౌత్ వర్షన్ రికార్డే.. ఇంకా హిందీ, పోర్చుగీసు, స్పానీష్, ఇంగ్లీష్ వర్షన్ తాలూకు వ్యూవర్ షప్ కూడా వస్తే సీన్ మారిపోతుంది
నిజానికి దేవర మూవీ వచ్చినప్పుడు జస్ట్ యావరేజ్ టాకే వచ్చింది. భారీగా యాంటీ ఫ్యాన్స్ ఎటాక్, నెగెటీవ్ రివ్యూలే వచ్చాయి. కాని థియేటర్స్ లో భారీగా మాస్ ఆడియన్స్ ని రాబట్టిన మూవీగా510 కోట్ల వసూల్లతో రికార్డు వచ్చింది.
ఓటీటీలో కూడా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వెట్టయాన్ తాలూకు 5. 3మిలియన్ అవర్ల వ్యూవర్ షిప్ నే కాదు, దళపతి విజయ్ గోట్ మూవీ, కమల్ హాసన్ భారతీయుడు 2 తాలూకు 5. 4 మిలియన్ అవర్ల వ్యూవర్ షిప్ ని దాటేసింది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఎకౌంట్లో రెండు సార్లు 1000 కోట్లు పడేలా చేసిన పటాన్, జవాన్ మూవీలు కూడా 8 మిలియన్ గంటల వ్యూవర్ షిప్ నే సొంతం చేసుకన్నాయి.
కాని దేవర మాత్రం మరో లక్ష గంటల వ్యూవర్ షిప్ ని అధికంగా సొంతం చేసుకుంది. ఇదంతా కేవలం 30రోజుల్లోనే జరిగిపోయింది. ఐతే ఈ వారం దేవర ఎకౌంట్ లో రెండు రికార్డులు, రెండు వింతలు యాడ్ అయ్యాయి. ఒకటి పుష్ప2 ప్రిరిలీజ్ బిజినెస్ 1000 కోట్లంటున్నా, భారీ హైప్ వచ్చినా, యూఎస్ లో మాత్రం అడ్వాన్స్ బుక్కింగ్స్ పరంగా ప్రివ్యూకొచ్చిన వసూల్లు చూస్తే, దేవరకంటే కనీంస ఒకటిన్నర మిలియన్లు తక్కువుంది. కట్ చేస్తే ఓటీటీలో అందరినీ దాటేసి, 8.1 మిలియన్ గంటల వ్యూవర్ షిప్ తో మరో రికార్డు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎకౌంట్ లో పడింది.