జపాన్ లో దేవర పూనకాలు.. ప్రతీ 100 టిక్కెట్లలో 80 జపనీసే.

జపాన్ లో దేవర ఈనెల 28న రిలీజ్ కాబోతోంది. 22న అక్కడ ల్యాండై ఎన్టీఆర్ కూడా ప్రమోషన్ లోఎమోషన్ పెంచబోతున్నాడు. అయితే ఆ సందడి మొదలవ్వకముందే, అక్కడ అడ్వాన్స్ బుక్కింగ్స్ తో పూనకాలు మొదలయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 10, 2025 | 09:10 PMLast Updated on: Mar 10, 2025 | 9:10 PM

Devara Movie Super Hit In Japan

జపాన్ లో దేవర ఈనెల 28న రిలీజ్ కాబోతోంది. 22న అక్కడ ల్యాండై ఎన్టీఆర్ కూడా ప్రమోషన్ లోఎమోషన్ పెంచబోతున్నాడు. అయితే ఆ సందడి మొదలవ్వకముందే, అక్కడ అడ్వాన్స్ బుక్కింగ్స్ తో పూనకాలు మొదలయ్యాయి. జపాన్ లో ఎన్టీఆర్ కి ఎంత ఫ్యాన్స్ ఉన్నా, సినిమా కోసం హీరోలకు కటౌట్లు కట్టే కల్చర్ అక్కడ లేదు. అమెరికాలో అంటే అక్కడ సెటిలైన తెలుగోల్ల సంఖ్య భారీగా పెరగటంతో, అక్కడ తెలుగు సినిమాల వెలుగులే మారిపోయాయి. అక్కడ మన మూవీలు విడుదలైతే ఉండే హాంగామానే మారిపోయింది. కాని జపాన్ లో భారతీయులు, మరీ ముఖ్యంగా తెలుగువాళ్లు మరీ తక్కువ… అయినా టిక్కెట్లు అక్కడ అంతగా బుక్ అవుతున్నాయి. అడ్వాన్స్ బుక్కింగ్ మొదలవ్వగానే జరుగుతున్న బుక్కింగ్స్ లో లెక్కలు షాకిస్తున్నాయి. బుక్ అయిన ప్రతీ 100 టిక్కెట్స్ లో 80 మంది జపనీయులే ఉంటున్నారు. 20 మందే తెలుగు వాళ్లు ఈ టిక్కెట్స్ కొంటున్నారు.. అంతగా అక్కడ ఎన్టీఆర్ కి లోకల్ ఫ్యాన్స్ పెరిగిపోయారా? 

జపాన్ లో దేవర పూనకాలు మొదలయ్యాయి. ఈనెల 28 న రిలీజ్ అయ్యే ఈసినమాకోసం ఇప్పుడే అడ్వాన్స్ బుక్కింగ్స్ మొదలయ్యాయి. విచిత్రం ఏంటంటే బుక్కయ్యే ప్రతి 100 టిక్కెట్స్ లో అక్కడ సెటిలైన ఇండియన్స్ 20 మంది కొంటే, మిగతా 80 టిక్కెట్స్ లోకల్ జపనీస్ కొంటున్నారట. దీన్ని బట్టే తారక్ కి జపాన్ లో కూడా క్రేజ్ మెల్లిగా పెరుగుతోందని తెలుస్తోంది.అంతా త్రిబుల్ ఆర్ మాయే అనుకునే అవకాశం ఉంది. కాని నిజానికి తనకి యమదొంగ టైం పీరియడ్ నుంచే జపాన్ లో ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. యమదొంగ నుంచి త్రిబుల్ ఆర్ వరకు తన ప్రతీ మూవీ యూ ట్యూబ్ పుణ్యమాని అక్కడ కూడా డబ్బింగ్ రూపంలో ఎవేలబుల్ గా ఉంది. అరవింద సమేత వీరరాఘవ అయితే జపనీస్ సబ్ టైటిల్స్ వల్ల, అక్కడి జనాలకు దగ్గరైంది.

సో త్రిబుల్ ఆర్ కంటేముందే ఎన్టీఆర్ కి జపాన్ లో ఫ్యాన్స్ ఉన్నారనటానికి ఇదే నిదర్శనం. అరవింద సమేత వీరరాఘవ సినిమా సెట్ కి కూడా తన జపాన్ ఫ్యాన్స్ వచ్చి సందడి చేయటం, ఫోటోలు దిగటం జరిగింది. అలాంటి తారక్ త్రిబుల్ ఆర్ తో మరింతగా గ్లోబల్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా తన జపాన్ ఫ్యాన్ బేస్ లో ఇంకా చొచ్చుకెళ్లాడు.

కాబట్టే ఇప్పుడు తన దేవర మూవీ జపాన్ లో రిలీజ్ అవుతోందటే, అక్కడి లోకల్స్ ఇంట్రస్ట్ చూపించటంలో ఎలాంటి ఆశ్చర్యంలేదు. పదేళ్లుగా ఇలా తన జపాన్ ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటూ, దూసుకెళుతున్నాడు కాబట్టే తారక్, పనికట్టుకుని అక్కడ ప్రమోషన్ కోసం వెళుతున్నాడు.ఈనెల 22న జపాన్ వెళ్లనున్న తను ఏకంగా 6 రోజుల్లో 8 నగరాల్లో దేవర మూవీని ప్రమోట్ చేయబోతున్నాడు. ప్రస్థుత అడ్వాన్స్ బుక్కింగ్స్ లెక్కలు చూస్తే ఈ పాటికే లక్షా ఇరవై వేల టిక్కెట్లు సేల్ అయ్యాయట. అందులో 20 వేలే ఇండియన్ సెటిలర్స్ కొంటే, మిగతా లక్షా జపాన్ లోకల్స్ కొన్నట్టు లెక్కలతో తేలుతోంది.దేవర ఏమాత్రం అక్కడ వర్కవుట్ అయినా, వార్2, డ్రాగన్ మాత్రమే కాదు, దేవర సీక్వెల్ కి కూడా అక్కడ పూనకాలు రావటం ఖాయం.