DEVARA: కొరటాల శివ చేసిన తప్పుతో దేవర మూవీకి కష్టాలు?
జనవరి చివరికల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వాలి. తర్వాత వార్ 2 షూటింగ్‌తో తారక్ బిజీ అవ్వాలి. కానీ, చివరి దశలో షూటింగ్ నెమ్మదించటంతో లెక్కలు తారుమారవుతున్నాయి. మార్చ్ వరకు దేవర షూటింగ్ కొనసాగేలా ఉంది.

Young Tiger NTR and dynamic director Koratala Siva's combination is the movie Devara.
DEVARA: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు దేవర టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ నుంచి కొరటాల శివ, చిత్ర బృందానికి ట్వీట్లతో ప్రశ్నలు ఎదురౌతున్నాయి. సోషల్ మీడియాలో ఈ హంగామా మొదలైంది. దీనంతటికీ కొరటాల శివే కారణమని తెలుస్తోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కాంబోలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న మూవీ దేవర. జనవరి చివరికల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వాలి. తర్వాత వార్ 2 షూటింగ్‌తో తారక్ బిజీ అవ్వాలి.
SALAAR: ప్రభాస్ డ్యుయల్ రోల్ కన్ఫార్మ్.. ఇంకెన్ని సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశావ్ నీల్ మావా..
కానీ, చివరి దశలో షూటింగ్ నెమ్మదించటంతో లెక్కలు తారుమారవుతున్నాయి. మార్చ్ వరకు దేవర షూటింగ్ కొనసాగేలా ఉంది. దీంతో వార్ 2 షూటింగ్ ఏప్రిల్‌కి వాయిదా పడుతోంది. అంతవరకు ఓకే.. ఇలా తారక్ సినిమాల షూటింగ్ లేట్ అవటమో, వాయిదా పడటమో జరుగుతుంటే కొరటాల శివ అనవసరంగా దేవర గ్లింప్స్ తాలూకు లీకులిచ్చాడనంటున్నారు. దేవర రెండు భాగాలని ఆమధ్య చాలా ఎగ్జైటింగ్‌గా ఎనౌన్స్ చేసిన కొరటాల శివ.. దేవర షూటింగ్ జనవరికల్లా పూర్తవుతుందనే నమ్మకంతో ఇయర్ ఎండ్ లేదంటే జనవరి 1కి గ్లింప్స్‌ని పదిరోజుల గ్యాప్‌లో టీజర్‌ని రివీల్ చేయాలనుకుంటున్నట్టు టంగ్ స్లిప్పయ్యాడట. దీంతో డిసెంబర్ 31 లేదంటే జనవరి 1కి దేవర గ్లింప్స్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. సంక్రాంతికి టీజర్ వస్తుందా అంటూ ప్రశ్నలు షురూ చేశారు.
ఇలా వారం రోజులుగా ఇదే తంతు కొనసాగుతోంది. అయినా కొరటాల శివ అండ్ టీం ఖండించకపోవటంతో.. టీజర్ వస్తుందనే బలంగా నమ్ముతుున్నారు ఫ్యాన్స్. కానీ, షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఏప్రిల్‌లో ఈమూవీ వచ్చేలా లేదు. కాబట్టి ఇప్పుడప్పుడే టీజర్, లేదంటే గ్లింప్స్ వదిలితే లాభంలేదని ఫిక్స్ అయ్యారట. కానీ, ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో కొరటాల శివ అండ్ కోని ప్రశ్నలతో ఊదరగొడుతున్నారు.