Devara: దేవ‌ర టార్గెట్‌ 1000 కోట్లు.. హిట్టు పక్కానా..?

ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్‌తో క‌లిసి వెయ్యి కోట్ల ఫీట్‌ను అందుకున్న జూనియ‌ర్‌.. ఈ సారి దేవ‌ర‌తో సోలోగా ఈ టార్గెట్‌ రీచ్ అవ్వాల‌ని ఫిక్స‌యిపోయాడ‌ట‌. మెగాస్టార్ చిరంజీవితో తీసిన ఆచార్య ఫ్లాప్‌తో విమర్శలు ఎదుర్కొన్న కొర‌టాల శివ‌.. దేవ‌ర‌తో బౌన్స్ బ్యాక్‌ అవ్వాల‌న్న క‌సితో ఉన్నాడ‌ట‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 19, 2024 | 01:34 PMLast Updated on: Jan 19, 2024 | 1:34 PM

Devara Movie Will Give Blockbuster To Jr Ntr And Koratala Shiva

Devara: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా దేవర. కొరటాల శివ డైరెక్ష‌న్‌లో టూ పార్ట్స్‌గా వ‌స్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోసారి బాక్సాఫీస్‌పై పంజా విస‌రడానికి యంగ్ టైగ‌ర్ రెడీ అయిపోతున్నాడు. త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ ఏర్ప‌డింది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.

Prabhas: అప్పుడే ఊపేస్తున్న రాజా సాబ్ మేనియా.. రాజా సాబ్.. హిట్టు ప‌క్కా..!

ఇంత‌కు ముందు చూడ‌ని విధంగా ఉన్న ఎన్టీఆర్ లుక్, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో జూనియ‌ర్ న‌ట విశ్వ‌రూపం చూడ‌బోతున్నాడ‌న్న‌ది క‌న్‌ఫామ్ అయిపోయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తంలో ద‌క్కించుకోవ‌డంతో దేవ‌రపై ఎలాంటి ఎక్స్‌పెక్ట్సేష‌న్స్ ఉన్నాయో అర్థ‌మ‌వుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్‌తో క‌లిసి వెయ్యి కోట్ల ఫీట్‌ను అందుకున్న జూనియ‌ర్‌.. ఈ సారి దేవ‌ర‌తో సోలోగా ఈ టార్గెట్‌ రీచ్ అవ్వాల‌ని ఫిక్స‌యిపోయాడ‌ట‌. మెగాస్టార్ చిరంజీవితో తీసిన ఆచార్య ఫ్లాప్‌తో విమర్శలు ఎదుర్కొన్న కొర‌టాల శివ‌.. దేవ‌ర‌తో బౌన్స్ బ్యాక్‌ అవ్వాల‌న్న క‌సితో ఉన్నాడ‌ట‌. తారక్‌తో చేసే కథతో మరోసారి తన పవర్ ఏంటన్నది చూపించాలని రెడీ అవుతున్నాడు. దానికి త‌గ్గ‌ట్లుగా ఈ మూవీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ అప్‌డేట్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. రీసెంట్‌గా రిలీజైన గ్లింప్స్‌తో మూవీ ప‌క్కా బ్లాక్ బ‌స్ట‌ర్ అని ఫ్యాన్స్ ఫిక్స‌యిపోయారు. జెట్ స్పీడ్‌తో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ మీద ఉన్నప్పుడే బిజినెస్ విషయంలో అదరగొట్టేస్తుంది.

ఆల్రెడీ సినిమా డిజిటల్ రైట్స్ రూ.150 కోట్ల పైన డీల్ సెట్ అయినట్టు తెలుస్తుంది. థియేట్రికల్, ఆడియో రైట్స్‌లో కూడా దేవర అదరగొట్టేస్తున్నాడని తెలుస్తుంది. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమిది. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా వ‌స్తున్న దేవరను టూ పార్ట్స్‌గా తెర‌కెక్కిస్తున్నారు. అందులో పార్ట్ 1 ఈ ఏడాది ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. జూనియ‌ర్‌కు జాన్వి కపూర్ జోడీ కడుతుంది. ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కూడా మరో హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఇంత‌కు ముందు చూడ‌ని విధంగా ఉన్న ఎన్టీఆర్ లుక్, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో జూనియ‌ర్ న‌ట విశ్వ‌రూపం చూడ‌బోతున్నాడ‌న్న‌ది క‌న్‌ఫామ్ అయిపోయిందంటున్నారు ఫ్యాన్స్‌.