DEVARA: కొరటాల కోసం రిస్క్‌లో పడ్డ మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్..

ఈ మూవీ హిట్ అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారిన తారక్ మార్కెట్ పెరుగుతంది. రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా హిట్ అయితే, రాజమౌళితో సినిమా తీశాక ఏ హీరోకైనా ఫ్లాప్ పడాల్సిందనే సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 9, 2024 | 06:45 PMLast Updated on: Jan 09, 2024 | 6:45 PM

Devara Movie Will Help To Director Koratala Shiva

DEVARA: దేవర మూవీ గ్లింప్స్ రాగానే ఫ్యాన్స్‌లోనే కాకుండా సినిమా లవర్స్‌లో కూడా పూనకాలు మొదలయ్యాయి. గ్లింప్స్‌లో విజువల్స్ ఆరేంజ్‌లో ఉన్నాయి. అంతవరకు ఓకే. కాని, ఈమూవీ రిజల్ట్ మీదే ఒక విచిత్రమైన వాదన మొదలైంది. ఇది హిట్టైతై ఏంటి..? హిట్ కాకపోతే ఏంటి..? అనే చర్చ షురూ అయ్యింది. ఈ మూవీ హిట్ అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారిన తారక్ మార్కెట్ పెరుగుతంది. రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా హిట్ అయితే, రాజమౌళితో సినిమా తీశాక ఏ హీరోకైనా ఫ్లాప్ పడాల్సిందనే సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది.

GUNTUR KAARAM: గుంటూరు కారం.. నిర్మాతలకు గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ సర్కార్..

త్రిబుల్ఆర్ తర్వాత చరణ్‌కు ఆచార్యతో ఫ్లాప్ పడింది. బాహుబలి తర్వాత ప్రభాస్‌కి హిట్ వచ్చేందుకు సలార్ వరకు వేయిట్ చేయాల్సి వచ్చింది. అలాంటిది త్రిబుల్ ఆర్ తర్వాత తారక్‌కి హిట్ పడితే మాత్రం అదో సెన్సేషనే. కాని ఇదే మూవీ ఫ్లాప్ అయితే ఏంటి పరిస్థితి..? ఆచార్యతో డీలా పడ్డ కొరటాల శివ, దేవరతో తనేంటో ప్రూవ్ చేసుకునేందుకు నిర్మాతతో రూ.300 కోట్లు ఖర్చు చేయించాడు. సో.. హిట్టైతే ఓకే. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ రేంజ్‌లో పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడు. అలా కాకుండా ఈమూవీ సోసోగా ఆడినా కొరటాల శివకి వచ్చే నష్టమేమిలేదు. తనకి పాన్ ఇండియా ఆపర్చునిటీ ఒక్కటి పోయినట్టే కాని, కొత్త నష్టాలేమీ లేదు.

అంతో ఇంటో సుజిత్‌లా దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగుతుంది. కాబట్టి దేవర రిజల్ట్ ఎలా వచ్చినా 90శాతం ఈ దర్శకుడికే లాభం. హిట్టైతే తప్ప మరో కోణంలో తారక్‌కి పెద్దగా లాభం లేదు. కాబట్టి తనకి 10 శాతమే లాభం అంటున్నారు.