4.9 మిలియన్ డాలర్లు, యూఎస్ లో దేవర లెక్కలతో సలార్ కు చెమటలు…
దీనెమ్మ అమెరికాలో ఇండియన్ సినిమాకు ఇప్పుడు దేవర కొత్త టార్గెట్ ఫిక్స్ చేస్తోంది. రికార్డుల అమ్మ మొగుడు రా దేవర అంటూ ఒక్కో రికార్డ్ ని అగ్ర రాజ్యంలో తొక్కుకుంటూ పోయింది. సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ బుకింగ్ మార్కెట్ తో ఇండియాలో ఉన్న స్టార్ హీరోలు అందరూ షేక్ అయ్యారు.
దీనెమ్మ అమెరికాలో ఇండియన్ సినిమాకు ఇప్పుడు దేవర కొత్త టార్గెట్ ఫిక్స్ చేస్తోంది. రికార్డుల అమ్మ మొగుడు రా దేవర అంటూ ఒక్కో రికార్డ్ ని అగ్ర రాజ్యంలో తొక్కుకుంటూ పోయింది. సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ బుకింగ్ మార్కెట్ తో ఇండియాలో ఉన్న స్టార్ హీరోలు అందరూ షేక్ అయ్యారు. మూడు మిలియన్ల్ దిశగా అడుగులు వేయడంతో అక్కడి జనాలు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఎన్టీఆర్ కు ఉన్న ఇమేజ్ కి ఆ ప్రీ బుకింగ్ మార్కెట్ కి ఏం సంబంధం లేదు. అసలు సినిమాపై ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రీ బుకింగ్స్ స్పష్టంగా చెప్పాయి.
సినిమా విడుదల తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. దారుణంగా సినిమాపై ట్రోలింగ్. సినిమాను మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మొత్తం టార్గెట్ చేసారు. ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్ నుంచి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి కూడా దారుణమైన ట్రోలింగ్. కొరటాల శివ మీదున్న కోపం ఎన్టీఆర్ మీద చూపించారు జనాలు. అయినా సరే దేవర మాత్రం దూసుకుపోయింది. యెర్ర సముద్రంలో కలుపుకుంటూ పోయింది ఒక్కో రికార్డ్. అమెరికాలో అయితే ఏకంగా సలార్ రికార్డులను టార్గెట్ చేసింది దేవర. ఈ విషయం లెక్కలు చూస్తే స్పష్టంగా చెప్పవచ్చు.
అమెరికా లెక్కలు ఒకసారి చూస్తే… గురువారం నుంచి ఆదివారం వరకు చూస్తే… అమెరికాలో దేవర తెలుగు వెర్షన్ వసూళ్లు… సలార్ కంటే ఎక్కువగా ఉన్నాయి. అమెరికా కెనడాలలో సలార్ ను దాటింది దేవర. అన్ని భాషల్లో ఒకసారి చూస్తే… సలార్ 5.61 మిలియన్లు వసూలు చేసింది. దేవర 5.12 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే… దేవర 4.89 మిలియన్ డాలర్ల నుంచి 4.92 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
సలార్ వసూళ్లు చూస్తే… 4.82 మిలియన్ డాలర్లు వసూళ్లు చేసింది. ఇక్కడ ఒక కీలక విషయం ఏంటీ అంటే… సలార్ కు సోమవారం నుంచి ట్రెండ్ ఓ రేంజ్ లో కంటిన్యూ అయింది. క్రిస్మస్ సెలవలు, న్యూ ఇయర్ కూడా కలిసి వచ్చింది. కాని దేవరకు మాత్రం వీకెండ్ ఒక్కటే. ఇక సలార్ ఫుల్ రన్ చూస్తే… 6.9 మిలియన్లు తెలుగు, హిందీ 8.9 మిలియన్లుగా ఉంది. మరి దేవర ఎలా ఉంటుందో చూడాలి.