అమెరికాలో దేవర క్రేజ్ 15ని’ల్లో థియేటర్ ఫుల్

అమెరికాలో ఇప్పుడు దేవర సినిమాపై భారీ బజ్ క్రియేట్ అవుతోంది. సినిమా విడుదలకు ముందే ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంటుంది. అక్కడ ఇప్పుడు థియేటర్ లు కూడా సరిపోవడం లేదు అంటున్నారు ఫ్యాన్స్. గతంలో ఎన్టీఆర్ నటించిన ఏ సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ రాలేదు అనే చెప్పాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 19, 2024 | 07:48 PMLast Updated on: Sep 19, 2024 | 7:48 PM

Devara Records Break In America

అమెరికాలో ఇప్పుడు దేవర సినిమాపై భారీ బజ్ క్రియేట్ అవుతోంది. సినిమా విడుదలకు ముందే ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంటుంది. అక్కడ ఇప్పుడు థియేటర్ లు కూడా సరిపోవడం లేదు అంటున్నారు ఫ్యాన్స్. గతంలో ఎన్టీఆర్ నటించిన ఏ సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ రాలేదు అనే చెప్పాలి. మల్టీ స్టారర్ సినిమా అయిన ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా ఈ రేంజ్ లో ప్రీ బుకింగ్ మార్కెట్ జరగలేదు అనే మాట వాస్తవం. సినిమా విడుదలకు ఇంకా వారం రోజులు ఉంది. ఈ వారం రోజుల్లో ఇంకెన్ని వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

దేవర ఇప్పటికే ప్రీ బుకింగ్స్ లో 2 మిలియన్ డాలర్లు క్రాస్ చేసే అవకాశం కనపడుతోంది. ఏ సినిమాకు ప్రీ బుకింగ్స్ ఈ రేంజ్ లో జరగలేదు ఇప్పటి వరకు. అటు ఆస్ట్రేలియా, యూరప్ ఖండాల్లో కూడా క్రేజ్ భారీగానే ఉందని చెప్పాలి. ఇక ఇప్పుడు తాజాగా వచ్చిన ఓ ఫోటో ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. అమెరికాలో బాగా ఫేమస్ థియేటర్ గా పేరు తెచ్చుకున్న ఈజిప్షియన్ థియేటర్… అమెరికన్ సినిమా ది క్యూలో ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసిన పావు గంటలో థియేటర్ ఫుల్ అయిపోయింది. ఆ థియేటర్ లో మొత్తం 500 టికెట్ లు ఉన్నాయి.

ఒక్కో టికెట్ ఖరీదు 25 డాలర్లు ఉంటుంది. దీని బట్టే అర్ధం చేసుకోవచ్చు దేవర సినిమాకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో. సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ప్రీ బుకింగ్ ఓపెన్ చేయగా 6 గంటల 30 నిమిషాలకు టికెట్స్ సోల్డ్ అవుట్ అనే నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటికే 1600 థియేటర్లలో సినిమా విడుదలకు ముందే హౌస్ ఫుల్ అయిపోయింది. దీనితో ఈ సినిమా అక్కడ ఏ రేంజ్ లో సంచలనం అవుతుందో చూడాలి. కాగా ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉండగా హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది.