DEVARA: దేవరలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్.. రిలీజ్‌ పోస్టర్‌లో బోలెడు లీక్‌లు..?

తన ట్విట్టర్ అకౌంట్‌లో రిలీజ్‌ పోస్టర్‌ను పోస్ట్ చేశాడు ఎన్టీఆర్‌. ఈ పోస్టర్‌తో.. సినిమా గురించి డైరెక్టర్ కొరటాల చాలా హింట్స్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. దేవరలో ఎన్టీఆర్ డబుల్‌ రోల్ అని ముందు నుంచి టాక్‌ వినిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 16, 2024 | 06:53 PMLast Updated on: Feb 16, 2024 | 6:53 PM

Devara Release Date Announced Here Is The Secret Details Of The Poster

DEVARA: ట్రిపులార్ తర్వాత దేవర అంటూ పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు తారక్. మాములుగానే మాస్‌ మూవీ అంటే పూనకాలు వచ్చినట్లు ఊగిపోయే ఎన్టీఆర్‌కు.. కొరటాలలాంటి డైరెక్టర్‌ దొరికితే.. అది పండుగే ! అందుకే దేవర మూవీ మీద అంచనాలు పీక్స్‌కు చేరాయ్‌. దేవరలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా యాకట్‌ చేస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో దీని మీద భారీ అంచనాలు ఉన్నాయ్.

Jr NTR: ఎన్టీఆర్ లేకుండానే హిందీ మూవీ వార్ 2 షూటింగ్ షురూ..?

ఇప్పటికే మూవీ గ్లింప్స్ రిలీజ్‌ చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చంద్రుడి సగాన్ని రక్తం ధారతో నింపే షాట్ అయితే.. గూస్‌ పంప్స్‌ తెప్పిస్తోంది. ఈ మూవీని మొద‌ట ఏప్రిల్ 5న వాల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయాలని మేకర్స్ అనుకున్నారు. ఐతే సైఫ్ అలీఖాన్‌కు గాయం కావ‌డంతో.. షూటింగ్ లేట్ అయి రిలీజ్‌ డేట్‌ వాయిదా పడింది. ఐతే ఇప్పుడు దసరాకే దేవర వేట మొదలుకాబోతోంది. దీనికి సంబంధించి తన ట్విట్టర్ అకౌంట్‌లో రిలీజ్‌ పోస్టర్‌ను పోస్ట్ చేశాడు ఎన్టీఆర్‌. ఈ పోస్టర్‌తో.. సినిమా గురించి డైరెక్టర్ కొరటాల చాలా హింట్స్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. దేవరలో ఎన్టీఆర్ డబుల్‌ రోల్ అని ముందు నుంచి టాక్‌ వినిపిస్తోంది. ఐతే రిలీజ్ పోస్టర్‌తో అదే నిజం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. దేవర ఇంగ్లీష్‌ టైటిల్‌లో DE ఒక కలర్‌లో ఉంటే.. VARA మరో కలర్‌లో ఉంది. అంటే పాత్రల మధ్య డిఫరెన్స్ చూపించాలనే ఇలా టైటిల్‌ డిజైన్ చేశారా అంటూ ఫ్యాన్స్‌ పోస్టర్‌ను డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. దీనికితోడు దేవర గ్లింప్స్‌లో కనిపించిన ఎన్టీఆర్ లుక్‌కు.. రిలీజ్ పోస్టర్‌లో ఉన్న లుక్‌కు చాలా తేడాలు ఉన్నాయ్. అంటే ఎన్టీఆర్ డ్యుయల్‌ రోల్‌ కన్ఫార్మ్ అన్నమాట.

తండ్రీకొడుకుల్లాగా యాక్ట్ చేస్తున్నారా.. అన్నాదమ్ముల్లాగా యాక్ట్ చేస్తున్నారా అన్నదే ఇప్పుడు తేలాలి అంతే అంటున్నారు ఫ్యాన్స్. ఇక అటు దేవరకు సంబంధించి రకరకాల స్టోరీలు వైరల్ అవుతున్నాయ్. యంగ్ ఎన్టీఆర్ సినిమా మొదట్లో కనిపించి.. ఆ తర్వాత దేవర పాత్రను పరిచయం చేస్తారని.. ఇంటర్వెల్‌కి ముందు దేవర ఎంటర్ అవుతారని.. ఆ తర్వాత అతని స్టోరీ నడుస్తుందనే టాక్ ఉంది. ఐతే మళ్లీ క్లైమాక్స్‌లో మళ్లీ యంగ్‌ ఎన్టీఆర్‌ ఎంటర్ అవుతాడని తెలుస్తోంది. ఈ ప్రచారానికి తగినట్లే.. రిలీజ్ పోస్టర్ కూడా ఉంది. వెనకాల ఊరి జనం.. వారిని కాపాడేందుకు ముందున్న ఎన్టీఆర్‌.. ఇలా ప్రతీ ఫ్యాన్ అంచనా నిజం అయ్యేలా కనిపిస్తోంది. ఏమైనా దేవరకు సంబంధించి అప్డేట్ రావడంతో.. అభిమానులంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు.