గురువారం 11: 50 PM నుంచి 2: 50 PM..బ్రహ్మండం బద్దలయ్యే ముహుర్తం…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేలా బ్రహ్మాండమైన ముహుర్తం కుదిరింది. గురువారం అర్ధరాత్రి 11: 50 కే ముహుర్తం ఫిక్స్... అప్పటి నుంచి రాత్రి 2.50 వరకు వరల్డ్ వైడ్ గా డిజిటల్ వరల్డ్ లో సునామీలు రాబోతున్నాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేలా బ్రహ్మాండమైన ముహుర్తం కుదిరింది. గురువారం అర్ధరాత్రి 11: 50 కే ముహుర్తం ఫిక్స్… అప్పటి నుంచి రాత్రి 2.50 వరకు వరల్డ్ వైడ్ గా డిజిటల్ వరల్డ్ లో సునామీలు రాబోతున్నాయి. దేవర మూవీ టీం కూడా ఇంకా ఈ సినిమా సెన్సేషన్స్ కి, రికార్డుల జోరుకి బ్రేక్ పడలేదని బాంబు పేల్చింది. ఓటీటీ రిలీజ్ తోనే దేవర రెండో సునామీ స్టార్ అయ్యేలా ఉంది. డిజిటల్ దండయాత్రకు దేవర రెడీ అయితే, అంతకుమించి మరో సర్ ప్రైజ్ ని రెడీ చేసింది దేవరటీం. బయట ప్రచారం జరుగుతున్నట్టు దేవర థియేటర్స్ కి రాకముందు ఉన్న కొన్ని సీన్లు, ఎడిటింగ్ లో లేపేసిన చాలా విజువల్స్ ఓటీటీ వర్షన్ లో ఉండబోతున్నాయన్నారు. కాని అది అబద్దం అని తేలింది.. అలాని సర్ ప్రైజ్ లేకుండా దేవర ఓటీటీలోకి రావట్లేదు… ఇంతకి ఏంటా సర్ ప్రైజ…?
దేవర ఈనెల ఈవారం ఓటీటీలో దండెత్తబోతున్నట్టు ఫిల్మ్ టీం తేల్చింది. థియేటర్స్ లో క్రియేట్ చేసిన రికార్డులు సరిపోవని, ఇప్పుడు ఓటీటీలో సునామీ క్రియేట్ చేసేందుకు దేవర దండెత్తుతున్నాడు. అంతా శుక్రవారం రిలీజ్ అంటే ఏదో అనుకున్నారు. కాని దేవర ఓటీటీలో గురువారం అర్ధరాత్రి 11: 50నుంచి అందుబాటులోకి రాబోతోంది. అంటే టెక్నికల్ గా చూస్తే శుక్రవారమే ఈ సినిమా వస్తున్నట్టు… కాని పదినిమిషాలు ముందురోజే ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది.
గురువారం రాత్రి 11: 50 నుంచి 2: 50 వరకు ఈ సినిమా ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. ఐతే ఎడిటింగ్ లో తీసేసిన విజువల్స్ ని ఇందులో యాడ్ చేసి మొత్తం 3 గంటల 35 నిమిషాల నిడివితో ఓటీటీలో దేవర అందుబాటులో ఉండబోతున్నాడని ప్రచారం జరిగింది. కాని అందులో ఎలాంటి వాస్తవం లేదు.
ఎడిటింగ్ లో తీసేసిన విజువల్స్ ని యాడ్ చేయటం నిజం కాదు.. అలానే మూడు గంటల ముప్పై అయిదు నిమిషాల నిడివి లో ఎలాంటి వాస్తవం లేదు. ఈ సినిమా థియేటర్స్ లో ఎంత డ్యూరేషన్ తో వచ్చిందో, అంతే డ్యూరేషన్ తో ఓటీటీలో స్ట్రీమింగ్ లో కి రాబోతోంది. కాకపోతే సినిమా విడుదలైన వారం తర్వాత యాడ్ చేసిన దావూదీ సాంగ్ తో సహా ఈ సినిమా యాజ్ ఇట్ ఈజ్ ఓటీటీలో రాబోతోంది
దేవర విడుదలయ్యేటైంలో తెలంగాణలో నైట్ షోలు, ఏపీలో ఆరు షోలు ఇలా మొత్తంగా ఈ సినిమా రిలీజ్ డే కి ముందే థియేటర్స్ ముందు పెద్ద జాతరే జరిగింది. ఇప్పుడు కూడా రాత్రి పూటే దేవర జాతరని ఓటీటీలో చూడబోతున్నాం… థియేటర్స్ లోమొదటి రోజు కలెక్షన్స్ తాలూకు రికార్డులు ఎంత ముఖ్యమో, ఓటీటీలో మొదటి షోకి ఎంత వ్యూవర్ షిప్ వచ్చిందో అంత ముఖ్యం
అయితే ఓటీటీలో ఎంత మంది దేవరని చూస్తారో, ఎన్ని గంటల వ్యూస్ వస్తాయో.. ఆ వ్యూస్ అవర్స్ కి ఒక్కో నిమిషానికి 10 రూపాయల చొప్పున నిర్మాత, ఓటీటీ సంస్థ పంచుకోబోతున్నాయి. ఇలా చూస్తే ఇవి కూడా ఓరకంగా కలెక్షన్లే… బేసిగ్గా పే పర్ వ్యూ ఒక పద్దతి, లేదంటే ఓటీటీలో ఫ్రీగా సినిమా స్ట్రీమింగ్ అయితే, దానికి వ్యూవర్స్ చూసిన అవర్స్ లెక్క ఒక పద్దతి.. ఆ అవర్స్ లోనే పే చేయబోతోంది ఓటీటీ సంస్థ… ఇది కొత్త మార్కెటింగ్ బిజినెస్ అంటున్నారు. అందుకే ఓటీటీ రైట్స్ ని 270 కి ముందు డీల్ సెట్ చేసినా, తర్వాత 100 కోట్లు బేసిక్ డీల్ కే క్లోజ్ చేయటానికి కారణం, వ్యూస్ అవర్స్ తాలూకు ఎమౌంట్ ని షేర్ చేసుకునేలా డీల్ మారటం… సో ఇక్కడ కూడా నిమిషానికి 10 అంటే, ఎన్ని వందలకోట్లొస్తాయో అన్న అంచనాలు పెరిగిపోతున్నాయి.