దేవర రిలీజ్ ట్రైలర్ రివ్యూ, వెయ్యి కోట్లు, లెక్కలు రాసుకోండ్రా

మాస్ జాతర అంటే ఎట్లుంటదో, ట్రైలర్ విడుదల చేస్తే పూనకాలు ఎట్లోస్తయ్యో, సినిమా కోసం ఎదురు చూస్తున్న గుండెల్లో ధైర్యం ఎట్ల నిండుతదో... దేవర రిలీజ్ ట్రైలర్ ప్రూవ్ చేసింది. ఊచకోత ఎట్లుంటదో పక్కాగా గిరి గీసినట్టు చూపించిండు కొరటాలోడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 22, 2024 | 02:53 PMLast Updated on: Sep 22, 2024 | 2:54 PM

Devara Release Trailer Review

మాస్ జాతర అంటే ఎట్లుంటదో, ట్రైలర్ విడుదల చేస్తే పూనకాలు ఎట్లోస్తయ్యో, సినిమా కోసం ఎదురు చూస్తున్న గుండెల్లో ధైర్యం ఎట్ల నిండుతదో… దేవర రిలీజ్ ట్రైలర్ ప్రూవ్ చేసింది. ఊచకోత ఎట్లుంటదో పక్కాగా గిరి గీసినట్టు చూపించిండు కొరటాలోడు. మొదటి ట్రైలర్ తో నీరు గారిన ఫ్యాన్స్ కు రక్తం మరిగి ఉరకలు వేయించిండు బుడ్డోడు. ఒక్కో షాట్ ఒక్కో సీన్ తో దీనెమ్మ ఇది కదరా కావాల్సిన ఎమోషన్ అని ప్రూవ్ చేసిండు దేవర. రిలీజ్ ట్రైలర్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నరు ఫ్యాన్స్.

నెగటివ్ ప్రచారం మొత్తానికి చెప్పుతోని కొట్టినట్టు ఉండాలే సమాధానం అని వేడుకున్నారు. ఇప్పుడు ఒక్కో డైలాగ్ తో టాలీవుడ్ ను ఎక్కిండు దేవర. ట్రైలర్ లో ప్రతీ షాట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక్కో డైలాగ్ చాలా బాగా నచ్చింది ఫ్యాన్స్ కి. సముద్రం మీద ఒక దేవర ఉన్నడు, కొండ మీద ఇంకో దేవరను తయారు చేయకు భైరా అనే డైలాగ్ సహా ఒక్కో డైలాగ్ ఫ్యాన్స్ కి పిచ్చి ఎక్కించింది. యాక్షన్ సీన్లు ఎలా ఉంటాయో దేవర రిలీజ్ ట్రైలర్ లో పక్కాగా చూపించారు. విలన్ కు, హీరోకు మధ్య కుస్తీ పోటీ కూడా కాస్త లీక్ ఇచ్చారు.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సముద్రం ఎరుపు ఎక్కిన సీన్స్, సముద్రంలో ఫైట్ సీన్స్, అలాగే సొర చేపతో పోరాడే సీన్స్ అన్నీ ఓ రేంజ్ లో చూపించారు. ఆ టేకింగ్ కూడా ఫ్యాన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఇప్పటికే సినిమాకు బజ్ భారీగా క్రియేట్ అయింది. సినిమా హిట్ అయితే… క్రేజ్ ఇంకా పెరిగిపోతుంది. దేవర రిలీజ్ ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ అయితే వెయ్యి కోట్లు పక్కా అంటూ తొడలు కొడుతున్నారు. లెక్కలు రాసుకోండ్రా అంటూ సవాల్ చేస్తున్నారు. ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయండి అంటూ డిమాండ్ లు మొదలుపెట్టారు. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఈ రిలీజ్ ట్రైలర్ తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.