దేవర సంచలనం.. ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డ్..
రిలీజ్‌కు ముందే దేవర ఊచకోత మొదలైంది. ట్రిపులార్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడం.. కొరటాలతో కాంబినేషన్ ఉండడంతో..
రిలీజ్‌కు ముందే దేవర ఊచకోత మొదలైంది. ట్రిపులార్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడం.. కొరటాలతో కాంబినేషన్ ఉండడంతో.. దేవర మీద అంచనాలు ఆకాశానికి చేరిపోయాయ్. రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్‌లు ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించాయ్. దీంతో రిలీజ్ కోసం ఎక్కడలేని క్యూరియాసిటీ కనిపిస్తోంది ప్రేక్షకుల్లో. సెప్టెంబర్ 27 దేవర రాబోతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో.. వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకొని కసిగా కొరటాల ఈ సినిమాను తెరకెక్కించాడు. వాల్డ్‌వైడ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై.. అంచనాలు భారీగా ఉన్నాయ్. ఐతే ఇప్పుడు దేవర.. తొలి ఇండియన్ సినిమాగా అరుదైన రికార్డును నెలకొల్పింది. వాల్డ్‌వైడ్‌గా ఇప్పటికే దేవర టికెట్లను అమ్మకానికి ఉంచారు. ఇవన్నీ హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయ్. ఓవర్సీస్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయ్. సినిమా విడుదలవడానికి ముందే.. ఓవర్సీస్‌లో ప్రీ సేల్ బుకింగ్స్‌తో మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంది. నార్త్ అమెరికా బాక్సాఫీస్ చరిత్రలో అత్యంత వేగంగా ప్రీసేల్ ద్వారా ఒక మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకున్న సినిమాగా రికార్డును నెలకొల్పింది. ట్రైలర్ రిలీజ్‌కు ముందు అరాచకం ఈ స్థాయిలో ఉందంటే.. అది వచ్చాక రికార్డులు బ్రేక్ కావడం ఖాయం అంటూ తారక్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ట్రైలర్ ఏ మాత్రం అంచనాలు పెంచినా.. రికార్డులను అందుకోవడంలో దేవరను ఆపేవారే ఉండరు. ఇక అటు మూవీకి సంబంధించి ప్రమోషన్స్ జరుగుతున్నాయ్. జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి సోలో హీరోగా సినిమా వస్తుండటంతో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.