హే దేవర.. ఎన్నెన్ని వింతలు విచిత్రాలు.. మళ్లీ పూనకాలు…
దేవర థియేటర్స్ లో దుమ్ముదులిపి, సునామీ క్రియేట్ చేసి, ఇప్పుడు తీరిగ్గా, ఓటీటీ మీద దండెత్తాడు. ఆల్రెడీ దేవర రిలీజ్ కి ముందు అడ్వాన్స్ టిక్కెట్ల రూపంలో, యూఎస్ లోరికార్డులు క్రియేట్ అయ్యాయి. రిలీజ్ అయ్యాక వసూల్ల వండర్స్ పెరిగాయి.
దేవర థియేటర్స్ లో దుమ్ముదులిపి, సునామీ క్రియేట్ చేసి, ఇప్పుడు తీరిగ్గా, ఓటీటీ మీద దండెత్తాడు. ఆల్రెడీ దేవర రిలీజ్ కి ముందు అడ్వాన్స్ టిక్కెట్ల రూపంలో, యూఎస్ లోరికార్డులు క్రియేట్ అయ్యాయి. రిలీజ్ అయ్యాక వసూల్ల వండర్స్ పెరిగాయి. ఎక్కువ శాతం హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో, అక్కడి సిటీస్ లో దేవర వసూళ్ల రికార్డులు ఒక్కో ఏరియాలో ఒక్కోలా ఉన్నాయి. అచ్చంగా అలానే ఓటీటీ లో దేవర దండెత్తగానే, వ్యూవర్ షిప్ కూడా నార్త్ ఇండియా సైడ్ నుంచి భారీగా ఉండేలా ఉంది. దేవర పాత్రే నార్త్ ఇండియన్స్ కి బాహుబలి రేంజ్ లోకనెక్ట్ అయినట్టుంది. ఒకసారి పాత్రకి కనెక్ట్ అయితే, అందులో ఎక్కువగా మాసే ఉంటే, ఇక ఆ సినిమాకు బాక్సాఫీస్ లోసునామీ కన్ఫామ్.. అదే జరిగింది. ఇప్పుడు ఓటీటీలో క్లాస్ కమ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగా ఫిదా అవుతారో, తేలబోతోంది
దేవర దరువు మొదలైంది. మొన్నటి వరకు బాక్సాఫీస్ ని షేక్ చేసిన దేవర, ఇప్పుడు ఓటీటీ మీద దండయాత్రతో లెక్కలే మార్చేసే పనిలో ఉన్నాడు. మామూలుగా దేవర విడుదలకు ముందు ఈ సినిమా ట్రైలర్ కి యూ ట్యూబ్ లో వచ్చిన వ్యూస్ పరంగా చూస్తే, తెలుగు,తమిళ్, మలయాళం, కన్నడ వ్యూస్ కంటే హిందీ వ్యూసే ఎక్కువొచ్చాయి. హిందీ ట్రైలర్ కి ఆరేంజ్ వ్యూస్ రావటం అంటే, హిందీ హీరోలనే మించేలా తనకి నార్త్ లో ఫాలోయింగ్ ఉందని తేలింది
బేసిగ్గా నార్త్ ఇండియన్స్ పాపులేషన్ ఎక్కువ కాబట్టే, అలా వచ్చిందనే కుళ్లు బ్యాచ్ కామెంట్స్ చేసినా, తర్వాత థియేటర్స్ లో వచ్చిన వసూల్ల పరంగా చూసినా కేవలం నార్త్ ఇండియాలోనే 480 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. యూఎస్ లో పది మిలియన్ల గ్రాస్ వసూళ్లు, 6.5 మిలియన్ల నెట్ వసూళ్ల వరకు రాబట్టింది దేవర మూవీ
ఇప్పుడు ఓటీటీ వంతొచ్చింది. సౌత్ వర్షన్ ఈనెల 8న, హిందీ వర్షన్ 22న రిలీజ్అన్నారు. కాని ఓటీటీలో దేవర దరువు ఊహాతీతంగా మొదలైనట్టే కనిపిస్తోంది. బేసిగ్గా మొదటి రోజు అంటే దేవర ఓటీటీలో స్ట్రీమింగ్ లోకొచ్చిన 24 గంట్లల్లో కంటే, మొదటి 12 గంటల్లో ఎక్కువ వ్యూస్ ని రికార్డుగా పరిగనలోకి తీసుకుంటారు
కాని అర్ధ రాత్రి దేవర వస్తుంటే, అప్పుడెవరు చూస్తారనే డౌట్ రాక తప్పదు.యూఎస్ లో, యూరప్ లో ఎక్కువగా ఇండియన్ సినిమాలకు అర్ధరాత్రే భారీ వ్యూస్ వస్తాయి.. అక్కడ వాళ్లకదే పగలు కాబట్టి… ఐతే ఈ సారి యూఎస్, యూకే కాదు, సౌత్ ఇండియాలో ఛాన్స్ లేదు… మొత్తంగా నార్త్ ఇండియన్ ఆడియన్స్ నుంచే సునామీలా ఓటీటీలో వ్యూవర్ షిప్ పెరిగేలా కనిపిస్తోంది
కారణం అంతగా దేవర నార్త్ ఆడియన్స్ కి బాగ ఎక్కేశాడు. మనకంటే ఎన్టీఆర్ ఇలాంటి పాత్రల్లో కనిపించటం కొత్తేం కాదు..యాజ్ ఇట్ ఈజ్ కాకున్నా, ఇలా సాలిడ్ రోల్స్ లో ఎన్టీఆర్ ఆది, సింహాద్రి నుంచి అరవింద సమేత వీరరాఘవ వరకు చాలా సార్లు ఊహాతీతమైన పాత్రల్లో పవర్ ఫుల్ రోల్స్ లో దుమ్ముదులిపాడు.
కాని ఇలాంటి పాత్రలు నార్త్ ఇండియన్స్ కి కొత్త… పుష్ప పాత్ర కూడా ఇలానే మాస్ కి నచ్చినా, అంతకుమించే మ్యాజిక్ ఏదో దేవరలో కనిపించింది. కాబట్టే ఎవరెంత కళ్లుకున్నా, నెగెటీవ్ ప్రచారం చేసినా, సౌత్ ని మించేలా నార్త్ లో దేవర దుమ్ముదులిపాడు. ఇప్పుడు ఓటీటీలో కూడా నార్త్ ఇండియా నుంచే వ్యూవర్ షిప్ విషయంలో డామినేషన్ కనిపించేలా ఉంది.
శుక్రవారం, పర్ఫెక్ట్ రిపోర్ట్ తో లెక్కలన్నీ తేలబోతున్నాయి. అంతేకాదు దేవర మాస్ మతిపోగొట్టే సరికి, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఛాన్స్ లేకుండాపోయిందన్నారు. కాని థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ కి ఓటీటీలో దేవర అందుబాటులోకి వచ్చింది… లెక్కమారబోతోంది.