జపాన్ లో లేడీ ఫ్యాన్స్… దేవర దరువు మొదలైనట్టే
దేవర మూవీ ఇక్కడ వచ్చి 670 కోట్ల వసూళ్లు రాబట్టి నెలలు గడుస్తోంది. ఓటీటీని అన్ని భాషల్లో షేక్ చేసి కూడా నెలలు గుడుస్తోంది. కట్ చేస్తే మళ్లీ దేవర పూనకాలు మొదలయ్యాయి.

దేవర మూవీ ఇక్కడ వచ్చి 670 కోట్ల వసూళ్లు రాబట్టి నెలలు గడుస్తోంది. ఓటీటీని అన్ని భాషల్లో షేక్ చేసి కూడా నెలలు గుడుస్తోంది. కట్ చేస్తే మళ్లీ దేవర పూనకాలు మొదలయ్యాయి. అది కూడా ఇక్కడ కాదు, జపాన్ లో… నెలరోజులుగా జపాన్ లో దేవర రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతోంది. జపనీస్ భాషలో పోస్టర్లు వచ్చాయి. జపనీస్ వాయిస్ ఓవర్ తో వచ్చిన దేవర ట్రైలర్ పేలింది. వచ్చే వారమే జపాన్ లో దేవర రిలీజ్ కాబోతోంది. ఐతే అందుకు వారం ముందు, జపాన్ లో లేడీ ఫ్యాన్స్ చేసిన హంగామా అక్కడే కాదు, ఇక్కడ కూడా నేషనల్ లెవల్లో వైరలైంది. మొన్నటికి మొన్న కోటి వరకు అడ్వాన్స్ బుక్కింగ్స్ తో దేవర అక్కడ పూనకాలు షురూచేసిందన్నారు. ఇప్పుడు జపాన్ లో కూడా ఎన్టీఆర్ కటౌట్ కి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు జరుగుతున్నాయి…ఇదెక్కడి అభిమానమని, బీటౌన్ బ్యాచ్ కుల్లుకోవటం తప్ప, దీనివెనకున్న తారకమంత్రమేంటో వాళ్లకి అర్ధం కావట్లేదు.
దేవర మూవీ నార్త్ ఇండియాలో 350 కోట్లు, సౌత్ ఇండియాలో 220 కోట్లు, ఓవర్ సీస్ లో 100 కోట్లు ఇలా మొత్తంగా 670 కోట్లు రాబట్టి నెలలు గడుస్తోంది. ఓటీటీలో కూడా దేవరకి వ్యూవర్ షిప్ సినీ సునామీనే క్రియేట్ చేసింది. ఇప్పుడు జపాన్ వంతొచ్చింది. అక్కడ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏరేంజ్ లో ఉందో ఇప్పుడో పోస్ట్ బట్టి తెలుస్తోంది.అక్కడ ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఈనాటిది కాదు…. కాకపోతే జపనీస్ లో మగవాళ్లలో ఎక్కువ మంది తనకి ఫ్యాన్స్ ఉన్నారని ఎన్నో సార్లు ప్రూవ్ అయ్యింది. తన సినిమా షూటింగ్స్ లో తనని కలిసేందుకు చాలా సార్లు రామోజీ ఫిల్మ్ సిటీకి జపాన్ ప్యాన్స్ రావటం కూడా చూశాం. కాని లేడీస్ అది కూడా ఇండియన్ స్టైల్లో దేవర పోస్టర్ కి పూలాభిషేకం, పాలాభిషేకం చేయటం మాత్రం నిజంగా షాకింగ్..
ఒకప్పుడు జపాన్ అంటే తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ అడ్డ.. అక్కడ తన సినిమా లో ఓరేంజ్ లోఆడేవి. తర్వాత బాహుబలి వచ్చి సీన్ మార్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ కి అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే, బాహుబలి రెండు భాగాలు జపాన్ లో, జర్మనీ, రష్యాలోకూడా రిలీజ్ అయ్యాయి కాబట్టి, అక్కడి జనాలకు ప్రభాస్ తెలుసంటే అర్ధముంది..కాని యమదొంగ టైంలోనే జపాన్ లో ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఉండటం విచిత్రం… టెంపర్ షూటింగ్ టైంలో ఎన్టీఆర్ కి జపాన్ ఫ్యాన్స్ కొందరు కలిసేందుకు రామోజీ ఫిల్మ్ సిటీకొచ్చిన ఫోటోలు అప్పట్లో వార్తల్లోకెక్కాయి. తర్వాత అరవింద సమేత వీరరాఘవ సాంగ్స్ కి జపాన్ ఫ్యాన్స్ డాన్స్ చేసిన వీడియోలు అప్పట్లో వైరలయ్యాయి
ఇక త్రిబుల్ ఆర్ నాటు నాటు తో సీనే మారిపోయింది. ఆ మూవీ జపాన్ లో ఏకంగా ఏడాది ఆడింది. అలా మెల్లి మెల్లిగా ఎన్టీఆర్ కి అక్కడ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినట్టుంది. అది లేడీస్ వరకు పాకటం వల్లే, దేవర అక్కడ రిలీజ్ అవుతోందంటే, అక్కడి జనాల్లో సందడి పెరిగింది. వచ్చే వారం 28న దేవర జపనీస్ భాషలో రిలీజ్ కాబోతోంది. ఈ వీకెండ్ నుంచి వచ్చే వీకెండ్ వరకు ఈ మూవీని ప్రమోట్ చేయటానికి జపాన్ లో ప్రత్యక్షం కాబోతున్నాడు తారక్. సో తను అక్కడికి వెళ్లాక సీన్ ఎలా ఉంటుందో కాని, ఒక తెలుగు హీరోకి జపాన్ లో ఈరేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే, అటు అరవోళ్లు , ఇటు బాలీవుడ్ స్టార్లు తట్టుకోలేకపోతున్నారు.