దేవర తెలంగాణా టికెట్ వెయ్యి, 1 AM షో డిటైల్స్ ఇవే, హైదరాబాద్ థియేటర్ల లెక్క ఇదే…

దేవర సినిమా ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ లో సినిమాపై ఓ రేంజ్ లో హైప్ ఉంది. సినిమాపై జరుగుతున్న ప్రచారం, సినిమాకు విదేశాల్లో వస్తున్న ప్రీ బుకింగ్ వసూళ్లు భారీ బజ్ క్రియేట్ అవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 23, 2024 | 07:40 PMLast Updated on: Sep 23, 2024 | 7:40 PM

Devara Telangana Ticket Thousand 1 Am Show Details Are As Follows

దేవర సినిమా ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ లో సినిమాపై ఓ రేంజ్ లో హైప్ ఉంది. సినిమాపై జరుగుతున్న ప్రచారం, సినిమాకు విదేశాల్లో వస్తున్న ప్రీ బుకింగ్ వసూళ్లు భారీ బజ్ క్రియేట్ అవుతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ… సినిమా బెనిఫిట్ షో ఎక్కడ, టికెట్ ధరలు ఎంత అనే దానిపై జనాల్లో పిచ్చి పీక్స్ కు వెళ్తోంది. ఇక ఆదివారం విడుదల చేసిన ట్రైలర్ కూడా సినిమాపై హైప్ భారీగా పెంచింది అనే చెప్పాలి. ఇక అక్కడి నుంచి ప్రీ బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.

హిందీలో ప్రీ బుకింగ్ మార్కెట్ కి భారీగా రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. మన తెలుగులో అంతకు మించి ఉంటుంది అనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంచితే ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం దేవర సినిమాకు గుడ్ న్యూస్ చెప్పింది. దానితో పాటుగా బ్యాడ్ న్యూస్ కూడా చెప్పింది. దేవర సినిమా బెనిఫిట్ షోస్ కి తెలంగాణా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27న రాత్రి 1.00 గంటలకు 29 థియేటర్లలో బెనిఫిట్ షోస్ ఉంటాయి. అలాగే టికెట్ ధరలు వంద రూపాయలు పెంచుకోవడానికి తెలంగాణా సర్కార్ అనుమతి ఇచ్చింది.

27ఉదయం 4.00 గంటల నుండి తెలంగాణాలోని అన్ని థియేటర్లలో టికెట్ రేట్లను రూ.100 పెంచుతూ 6 ప్రదర్శనలకు అనుమతి ఇచ్చారు. 28 నుండి 06-10-2024 వరకు (9 రోజులు), 5 ప్రదర్శనలకు రూ.25 పెంచడానికి అనుమతి ఇచ్చారు. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మరియు మల్టీప్లెక్స్‌ల కోసం రూ.50 పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. అయితే ఇక్కడ దేవర టీం గొంతెమ్మ కోర్కె కోరింది.

దేవర రిలీజ్ రోజు 27 న ఉదయం 1am షో కి 1000 రూపాయల టికెట్ ధర పెంచాలని అడిగిన దేవర టీం అడిగింది. సినిమా సామాన్యులకు అందకుండా టికెట్ రేట్ పెంచేందుకు తెలంగాణా సర్కార్ నో చెప్పింది. ఇక దేవర 1am ఎక్సట్రా షో థియేటర్ డిటైల్స్ చూస్తే… హైదరాబాద్ లో 21 థియేటర్ లు, ఖమ్మం లో 5 థియేటర్ లు, మిర్యాలగూడ, మహబూబ్నగర్, గద్వాల్ లో ఒక్కో థియేటర్ లో 1AM షోలకి అనుమతి ఇచ్చారు.