రజనీ కాంత్ కు దేవర టెన్షన్…? తేడా వస్తే సముద్రంలో కలిసిపోవడమే
దేవర సినిమా దెబ్బకు ఇప్పుడు చిన్న సినిమాలు విడుదల చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. దాదాపు దేవర మేనియానే కొనసాగుతోంది. మౌత్ టాక్ తో దేవర సినిమా స్పీడ్ పెంచింది.
దేవర సినిమా దెబ్బకు ఇప్పుడు చిన్న సినిమాలు విడుదల చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. దాదాపు దేవర మేనియానే కొనసాగుతోంది. మౌత్ టాక్ తో దేవర సినిమా స్పీడ్ పెంచింది. ఇక దేవర విషయంలో ఎన్టీఆర్… మౌత్ టాక్ తో హ్యాపీగా ఫీల్ అయి… ప్రమోషన్స్ ఇప్పుడు కూడా చేయడం మొదలుపెట్టాడు. దసరా వరకు దేవరకు ఇబ్బందికర వాతావరణం అయితే కనపడటం లేదు. అటు తమిళంలో కూడా పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. ఇక కన్నడలో దసరాకు ఒకటి రెండు సినిమాల విడుదల ఉంది.
బాలీవుడ్ లో కూడా పెద్ద సినిమాలు ఏవీ విడుదల అయ్యే అవకాశం ఇప్పట్లో లేదు. అందుకే దేవర సినిమాను పెద్దగా తీసేసె ప్రయత్నం థియేటర్లు చేయడం లేదు. ఇక దేవర విషయంలో ఒక హీరోకి మాత్రం భయం ఉంది. ఆ హీరో చిన్నా చితకా హీరో కాదు. సూపర్ స్టార్ రజనీ కాంత్. రజనీ కాంత్ హీరోగా వస్తున్న వేట్టాయన్ సినిమా దసరా సందర్భంగా విడుదల కానుంది. మన తెలుగులో కూడా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. రజనీ కాంత్ కు తెలుగు మార్కెట్ బాగుంది. కాని ఇప్పుడు దేవర భయం పట్టుకుంది.
రజనీ కాంత్ సినిమాలను తెలుగులో బాగానే చూస్తారు కాని… ఇప్పుడు ఏ మాత్రం సినిమాకు నెగటివ్ టాక్ వచ్చి… రజనీ సినిమా కంటే దేవర సినిమా బెటర్ అనే టాక్ వస్తే మాత్రం… థియేటర్లు కూడా పెరిగే అవకాశం ఉండదు. కొన్ని థియేటర్లు సినిమా టాక్ ని బట్టి కూడా ఇస్తూ ఉంటారు. ఆ థియేటర్లలో కూడా వేట్టాయన్ సినిమా విడుదల కావాలి అంటే లేదా విడుదల అయిన తర్వాత తీసేయకుండా ఉండాలి అంటే కచ్చితంగా మంచి టాక్ రావాల్సి ఉంది. ఇప్పుడు సూపర్ స్టార్ భయం కూడా అదే అంటున్నాయి సినీ వర్గాలు.
రజనీ కాంత్ అనారోగ్యంతో ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో పెద్దగా పాల్గొనడం లేదు. అసలు ఈ సినిమా విడుదల అవుతుందని మన తెలుగు జనాలకు కూడా పెద్దగా అవగాహన లేదు అనే మాట వాస్తవం. అందుకే ఇప్పుడు దేవర సినిమా హవానే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటు దేవర కూడా వసూళ్ళ విషయంలో దూసుకుపోతుంది. 500 కోట్లు క్రాస్ అయింది. దాదాపు 700 కోట్ల వరకు వెళ్తుంది అని అంచనా వేస్తున్నారు. ఆ వెళ్ళేది ఇప్పుడు వేట్టాయన్ టాక్ మీద ఆధారపడి ఉంది.