తెలంగాణాలో “దేవర” టికెట్ రేట్ ఊచకోత, ఏపీ కంటే ఎక్కువే

దేవర” ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సినిమా. భారీ సినిమాలు ఏవీ లేకపోవడంతో ఇప్పుడు దేవరపై టాలీవుడ్ కూడా భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే సినిమాలకు కాస్త జోష్ వస్తుందని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 21, 2024 | 01:28 PMLast Updated on: Sep 21, 2024 | 1:28 PM

Devara Ticket Price Hike In Telangana

దేవర” ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సినిమా. భారీ సినిమాలు ఏవీ లేకపోవడంతో ఇప్పుడు దేవరపై టాలీవుడ్ కూడా భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే సినిమాలకు కాస్త జోష్ వస్తుందని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. అనుకున్నది అనుకున్నట్టు జరగాలని దేవర సినిమా రికార్డులు కొల్లగొట్టాలని భావిస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా భారీగా జనాలు వచ్చే అవకాశం కనపడుతోంది.

గ్రాండ్ గా ఈవెంట్ ను ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. ఇక ఇప్పుడు టికెట్ ధరల విషయంలో తెలంగాణాలో ఎలా ఉంటాయి అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు. ఒక పక్క విదేశాల్లో సినిమాపై హైప్ భారీగా ఉంది. అక్కడ ప్రీ బుకింగ్ మార్కెట్ ఓ రేంజ్ లో జరుగుతోంది. అమెరికాలో సినిమా విడుదలకు ముందే 2 మిలియన్ వసూళ్లు సాధించే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం ఓ రేంజ్ లో రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనపడుతోంది. చిత్ర యూనిట్ కూడా అదే నమ్మకంతో ఉంది ఇప్పుడు.

విదేశాల్లో ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాలేదు. ఏపీలో ఇప్పటికే ధరలు పెంచుతూ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణాలో ఇంకా క్లారిటీ రాలేదు. ప్రీ బుకింగ్ అందుకే వాయిదా పడుతోంది. అయితే తెలంగాణాలో ఉదయం 7 గంటల నుంచే షోస్ మొదలయ్యే అవకాశం ఉంది. మల్టీ ప్లేక్స్ లో సినిమా టికెట్ ధర 413 గా నిర్ణయించే అవకాశం ఉంది. సింగిల్ స్క్రీన్స్ లో 236గా ఉండే అవకాశం ఉందని టాక్. ఇక తెల్లవారుజామున 1 గంటల నుంచి 4 గంటల వరకు వేసే షోస్ కి టికెట్ ధర 590 గా ఉండే అవకాశం కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 325, సింగిల్ స్క్రీన్లలో రూ. 200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.