దేవర టిక్కెట్టు పోటు… తెలంగాణ అలా ! ఆంధ్రా ఇలా ! ఇది ఫైనల్..

దేవర టిక్కెట్లు రేట్లలో కన్ ఫ్యూజన్ పోయింది. ఏపీ, తెలంగాణలో ఒకేలా ఉన్నాయని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కాని ఇవాల్టితో క్లియర్ కట్ రేట్లు వచ్చేశాయి. అంతేకాదు దేవర రేట్లే కాదు, రోజుకి ఎన్ని షోలనే విషయంలో కూడా ఏపీ, తెలంగాణలో చాలా వ్యత్యాసం ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 24, 2024 | 08:32 PMLast Updated on: Sep 24, 2024 | 8:32 PM

Devara Ticket Rates Final In Andhra And Telangana

దేవర టిక్కెట్లు రేట్లలో కన్ ఫ్యూజన్ పోయింది. ఏపీ, తెలంగాణలో ఒకేలా ఉన్నాయని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కాని ఇవాల్టితో క్లియర్ కట్ రేట్లు వచ్చేశాయి. అంతేకాదు దేవర రేట్లే కాదు, రోజుకి ఎన్ని షోలనే విషయంలో కూడా ఏపీ, తెలంగాణలో చాలా వ్యత్యాసం ఉంది. యూఎస్, ఆస్ట్రేలియాలోనే ఓరకంగా తెలుగు రాష్ట్రాలను మించేలా టిక్కెట్టు రేట్లే కాదు, రోజుకి పడే షోల నెంబర్ ఘనంగా ఉంది. అసలు ఏ మూవీకి కలిసిరానంతగా ఓ పాన్ ఇండియా మూవీకి కలిసొస్తోందంటే అది దేవరకే..

దేవర టిక్కెట్టు రేట్లే కాదు, షో తాలూకు లెక్కలు కూడా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా దేవర 26 తేదీన ప్రివ్యూ రూపంలో ఏకంగా 10 వేల షోలు పడబోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రాలో టిక్కెట్ రేట్లే కాదు, రోజుకి ఎన్ని ఆటలు అన్న విషయంలో కూడా చాలా మార్పులున్నాయి. రోజుకి ఎన్ని షోలన్న లెక్కలు చూస్తే, మొదటి రోజు రాత్రి ఒంటి గంట షో తో కలిపి తెలంగాణలో ఆరు షోలు పడబోతున్నాయి. ఇక రెండోరోజు నుంచి పదో రోజు వరకు రోజుకి ఐదు ఆటలు. అంటే ఉదయం 4 గంటలకు షో పడుతుంది. ఆతర్వాత రోజుకి నాలుగు ఆటలే..

ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో విడుదలైన 10 రోజుల వరకు టిక్కెట్ కి 100 పెంచుకోవచ్చు. అదే మల్టీప్లెక్స్ లో ఈలెక్కలు 50,25 గా ఉన్నాయి. ఏపీకొచ్చేసరికి రోజుకి 7 ఆటలు… ఇక పదిరోజుల వరకు ప్రతీ టిక్కెట్ మీద 135 వరకు ఎక్ట్రా రేటు పెంచొచ్చు. అప్పర్ క్లాస్ టిక్కెట్ 110 ఇక లోయర్ క్లాస్ టిక్కెట్ మీద 60 వరకు ఎక్స్ ట్రా ఛార్జ్ చేస్తారు

అంటే దేవర ఫైనల్ టిక్కెట్ రేట్లు సింగిల్ స్క్రీన్ లో మొదటి రోజు 295 టిక్కెట్ రేటుంటే, రెండో రోజు నుంచి 206 వరకు ఉండే ఛాన్స్ ఉంది. ఇక మల్టీ ప్లెక్స్ లో మొదటి రోజు 413 ఉంటే, రెండో రోజు నుంచి 354 రూపాయల వరకు టిక్కెట్ రేట్లున్నాయి. ఇది తెలంగాణ పరిస్థితి… అదే ఆంద్రా లెక్కలు చూస్తే అక్కడ సింగిల్ స్క్రీన్ టిక్కెట్లు 310 ఉంటే, మల్టీ ప్లెక్ట్స్ మాత్రం 450 ఉంది… ఇంతలా దేవర టిక్కెట్ల రేట్లే కాదు, రోజుకి వేసే షోల లెక్కల్లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో లెక్కలు వేరుగా ఉన్నాయి.