దీనెమ్మ మైండ్ పోగొట్టిన దేవర ట్రైలర్, ట్రైలరే ఇలా ఉంటే బొమ్మ పడితే పూనకాలే

ఆరేళ్ళ తర్వాత సోలోగా సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా ట్రైలర్ అదిరిపోయింది. ఈ నెల 27న విడుదల అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ను కాసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర యూనిట్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 10, 2024 | 05:29 PMLast Updated on: Sep 10, 2024 | 6:08 PM

Devara Trailor Launch Today At Mumbai

“ధైర్యం తప్పా ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి,” రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ, మా దేవర కథ.” “మనిషికి బ్రతికెంత ధైర్యం చాలు, చంపెంత ధైర్యం కాదు… కాదూ కూడదు అని మళ్ళీ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే, ఆ ధైర్యాన్ని సంపేంత భయాన్ని అవుతా”… దేవరను సంపాలంటే సరైన సమయమే కాదు… సరైన ఆయుధం దొరకాల….“ అంటూ దేవర ట్రైలర్ అభిమానుల్లో సరికొత్త ధైర్యాన్ని నింపింది. ఆరేళ్ళ తర్వాత సోలోగా సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా ట్రైలర్ అదిరిపోయింది.

ఈ నెల 27న విడుదల అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ను కాసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర యూనిట్. అభిమానులకు ఏ రేంజ్ లో థియేటర్ లో పూనకాలు రాబోతున్నాయో ఈ ట్రైలర్ క్లియర్ గా చెప్పింది. ఒక్కో సీను ఒక్కో షాటు మైండ్ పోయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఒక్కో సీన్ టేకింగ్ మతి పోగొట్టాయి. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ లుక్ కూడా అదిరిపోయింది. ఇక ఎన్టీఆర్ నోటి నుంచి రెండేళ్ళ తర్వాత మళ్ళీ డైలాగ్స్ విన్న ఫ్యాన్స్ కు సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. హీరోయిన్ జాన్వీ కపూర్ ని కూడా చాలా అందంగా చూపించారు. సముద్రంలో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఈ ట్రైలర్ లో క్లియర్ గా చెప్పేసాడు దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ లోనే వైలెన్స్ ను భారీగా చూపించిన దర్శకుడు… సినిమాలో ఏ రేంజ్ లో ఊచకోత కోస్తాడో క్లియర్ పిక్చర్ ఇచ్చేసాడు. చివరిగా ట్రైలర్ మాత్రం దుమ్మురేపింది.