యూఎస్ లో దేవర సునామీ, సలార్ రికార్డ్ క్రాస్, ఫ్యాన్స్ టార్గెట్ ఏంటీ…?
ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన ఏ సినిమాకు లేని క్రేజ్ అమెరికాలో దేవరకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా మల్టీ స్టారర్ అయినా సరే ఈ రేంజ్ లో క్రేజ్ అయితే లేదు అనే మాట వాస్తవం. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం హాలీవుడ్ లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది దేవర.
ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన ఏ సినిమాకు లేని క్రేజ్ అమెరికాలో దేవరకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా మల్టీ స్టారర్ అయినా సరే ఈ రేంజ్ లో క్రేజ్ అయితే లేదు అనే మాట వాస్తవం. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం హాలీవుడ్ లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది దేవర. సినిమా విడుదలకు ముందే అమెరికాలో రెండు మిలియన్ వసూళ్ళ దిశగా సినిమా వెళ్తోంది. సినిమాకు గంట గంటకు క్రేజ్ పెరుగుతోంది. ఇక ఆదివారం విడుదల చేసిన ట్రైలర్ కూడా సినిమాపై హైప్ భారీగా పెంచింది. అప్పటి వరకు నెగటివ్ ప్రచారం చేసిన వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు.
అమెరికాలో వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో, యూకేలో ఏ రికార్డులు దేవర బద్దలు కొడుతుందో, ఆస్ట్రేలియాలో ఏ రేంజ్ లో సినిమా సునామీ ఉంటుందో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సోలో సినిమా దేవర. ఈ సినిమా అటు ఇటు అయితే మాత్రం ఫ్యాన్స్ కళ్ళల్లో రక్తం కారుతుంది. అందుకే ఇప్పుడు దేవర టీం చాలా జాగ్రత్తగా ఉంటోంది. ఇదిలా ఉంచితే… అమెరికాలో సినిమా ఇప్పటి వరకు… 17 లక్షల డాలర్లు వసూలు చేయగా… దాదాపుగా 59 వేల టికెట్ లు అమ్ముడు అయ్యాయి.
ఇదంతా ప్రీ బుకింగ్ మార్కెట్ మాత్రమే. మొత్తం 1874 లోకేషన్స్ లో ఇప్పటి వరకు సినిమాకు ప్రీ బుకింగ్స్ భారీగా జరిగాయి. ఇంకా సినిమాకు నాలుగు రోజులు ఉంది. రెండు మిలియన్లకు దగ్గర అయ్యే సూచనలు కనపడుతున్నాయి. సలార్ కు ప్రీ బుకింగ్ మార్కెట్ 18 లక్షల డాలర్లు జరిగింది. కాని దేవర ఊపు చూస్తుంటే మాత్రం రాబోయే నాలుగు రోజుల్లో అది క్రాస్ చేయడం ఖాయంగా కనపడుతోంది. 2 మిలియన్లు వసూలు చేస్తే మాత్రం మొదటి ఇండియన్ సినిమాగా దేవర రికార్డ్ సొంతం చేసుకునే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. అయితే ఫ్యాన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత కనీసం లక్ష టికెట్ లు బుక్ అవుతాయని ఎదురు చూసినా… కాస్త స్లో అయినట్టు కనపడింది.