Devara : ‘దేవర’ వీడియో లీక్.. షాక్ లో మూవీ టీమ్
భారీ సినిమాలను లీకుల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే పలు భారీ సినిమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈమధ్య కాలంలో 'గేమ్ ఛేంజర్' (A game changer) చిత్రం ఈ లీకుల సమస్యను బాగా ఎదుర్కొంది.

'Devara' video leaked.. Movie team in shock
భారీ సినిమాలను లీకుల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే పలు భారీ సినిమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈమధ్య కాలంలో ‘గేమ్ ఛేంజర్’ (A game changer) చిత్రం ఈ లీకుల సమస్యను బాగా ఎదుర్కొంది. ఆ సినిమా నుంచి రామ్ చరణ్ (Ram Charan) లుక్ కి సంబంధించిన ఫొటోలతో పాటు ఒక సాంగ్ కూడా లీక్ అయింది. ఇక ఇప్పుడు ‘దేవర’ (Devara) వంతు వచ్చింది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ కాగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ (Saif Ali Khan is the villain) గా నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు, గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ వీడియో క్లిప్ లీక్ అయింది. ఆ క్లిప్ లో సముద్ర తీరంలో ఎన్టీఆర్ (NTR) లుంగీ కట్టుకొని నడిచి వస్తున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ లుక్, వాకింగ్ స్టైల్ చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ట్విట్టర్ లో దేవర హ్యాష్ ట్యాగ్ (Devara Hashtag) ని ట్రెండ్ చేస్తున్నారు.
అయితే ‘దేవర’ నుంచి వీడియో క్లిప్ లీక్ (Leaked video clip) అవ్వడంతో మూవీ టీమ్ షాక్ కి గురైంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ జరుపుతున్నా.. ఇలా వీడియో లీక్ అవ్వడంపై మేకర్స్ ఆందోళన చెందుతున్నారట. అంతేకాదు ఈ విషయంపై దర్శకనిర్మాతలు ఇప్పటికే మూవీ టీమ్ లోని కొందరికి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.
‘దేవర’ వీడియో లీక్..
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్ర ‘దేవర’.
ఈ సినిమా రెండు పార్టులుగా దేవర మూవీ.
తాజాగా దీని చిత్రీకరణ గోవాలో జరుగుతోంది.
NTR సముద్రం ఒడ్డున నలుపు రంగు చొక్కా..
అదే రంగులో ఉన్న పంచ కట్టుకుని నడుస్తూ ఉన్నాడు. #RRR #Devara #YoungTiger #NTR30 pic.twitter.com/oCueRktFqw— Dial News (@dialnewstelugu) March 22, 2024