Devara vs Game Changer: మెగా వర్సెస్ నందమూరి.. దేవరతో గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వార్

గేమ్ చేంజర్ సినిమా సమ్మర్‌లో కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. దీంతో గేమ్ చేంజర్ రిలీజ్‌ డేట్ కోసం కసరత్తులు చేస్తున్నాడు దిల్ రాజు. సెప్టెంబర్‌లో గేమ్ చేంజర్ రిలీజ్ చేద్దామనుకుంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 9, 2024 | 01:28 PMLast Updated on: Feb 09, 2024 | 1:28 PM

Devara Vs Game Changer Both Movies Aim To Release On Dussera

Devara vs Game Changer: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలు దేవర, గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ సినిమాలో పోటాపోటీగా నటించిన ఈ ఇద్దరి మధ్య నెక్స్ట్ బాక్సాఫీస్ వార్ తప్పదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. శంకర్ డైరెక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా సమ్మర్‌లో కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. దీంతో గేమ్ చేంజర్ రిలీజ్‌ డేట్ కోసం కసరత్తులు చేస్తున్నాడు దిల్ రాజు.

Anushka Shetty: లెక్క మారింది.. పవన్ ఔట్.. అనుష్క ఇన్

సెప్టెంబర్‌లో గేమ్ చేంజర్ రిలీజ్ చేద్దామనుకుంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో నెక్స్ట్ గేమ్ చేంజర్ ముందు దసరా డేట్ మాత్రమే ఉంది. దిల్ రాజు కూడా అక్టోబర్ నెలలో దసరాకే గేమ్ చేంజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడట. మరోవైపు.. ఏప్రిల్ 5న రావాల్సిన యంగ్ టైగర్ దేవర మూవీ.. ఎలక్షన్స్ కారణంగా పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో దేవర థియేటర్లోకి ఎప్పుడు వస్తాడో కరెక్ట్‌గా తెలియదు. కానీ దేవర బడ్జెట్ అండ్ హైప్‌కు దసరా లాంటి సీజన్ కావాల్సిందే. దేవర ఆగష్టులో వద్దామనుకుంటే.. పుష్ప2 రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్‌లో ఓజి వస్తోంది. దీంతో దేవర కూడా దసరాకే రావాలి. లేదంటే.. మరింత వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది.

కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి దసరాకే దేవర వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే.. బాక్సాఫీస్ దగ్గర జరిగే మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్ వార్ పీక్స్‌లో ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలోనే మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప అని కొట్టుకున్నారు ఇద్దరి అభిమానులు. అలాంటిది చరణ్, ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే.. మామూలుగా ఉండదు. మరి దేవర, గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.