దేవర వర్సెస్ పఠాన్, వార్ 2 షూట్ లో బిగ్ ట్విస్ట్
టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు... బాలీవుడ్ లో ఒక్క బొమ్మ పడితే ఎన్టీఆర్ అంటే ఏంటో అక్కడి వాళ్లకు క్లియర్ కట్ గా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు… బాలీవుడ్ లో ఒక్క బొమ్మ పడితే ఎన్టీఆర్ అంటే ఏంటో అక్కడి వాళ్లకు క్లియర్ కట్ గా క్లారిటీ వచ్చేస్తుంది. అందుకే ముంబైలో ల్యాండ్ అయిన దేవర… తన యూనిక్ టాలెంట్ ను హిందీ బెల్ట్ లో గ్రాండ్ గా ప్రూవ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా హిందీ బెల్ట్ లో అందరూ చూస్తారనే గ్యారెంటీ లేదు. అందుకే ఎన్టీఆర్ నటన ఏ రేంజ్ లో ఉంటుందో వాళ్లకు క్లారిటీ ఉండదు. కాని ఇప్పుడు డైరెక్ట్ గా చేస్తున్నాడు ఎన్టీఆర్.
వార్ 2 షూట్ కోసం ముంబై వెళ్ళిన ఎన్టీఆర్… యాక్షన్, చేజింగ్ సీన్స్ లో అలాగే హ్రితిక్ రోషన్ తో కలిసి ఒక పాటలో కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ షూట్ కంటిన్యూగా జనవరి వరకు ప్లాన్ చేసాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఇక ఎన్టీఆర్ టాలెంట్ చూసి ఇప్పటికే ముఖర్జీ షాక్ అయ్యాడు. డైలాగ్స్ ను ఎన్టీఆర్ స్టైల్ లో చెప్పడం, అవి పిచ్చ పిచ్చగా నచ్చడంతో ఎన్టీఆర్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు. ఏం డైలాగ్ చెప్పాలో రాసి ఇవ్వడం మాత్రమే చేస్తున్నారట. ఇక ఇప్పుడు వార్ 2 గురించి కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నారు.
వార్ ఫస్ట్ పార్ట్ అంతగా హిట్ కాలేదు. కాని పార్ట్ 2 గ్రాండ్ గా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తున్నారు. షూటింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్లాన్ చేసారు. ఇక ఎన్టీఆర్ ది నెగటివ్ రోల్ అయినా సరే ఏ మాత్రం రేంజ్ తగ్గకుండా ప్లాన్ చేసారు. ఇప్పటి వరకు ఈ సినిమాలో ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ మాత్రమే అనుకున్నారు. కాని బాలీవుడ్ కింగ్ ఖాన్… షారూఖ్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. దాదాపు 15 నిమిషాలు ఉండే అతని రోల్ కోసం గ్రాండ్ గా ప్లాన్ చేసాడు డైరెక్టర్. ఆ 15 నిమిషాలు కూడా పవర్ ఫుల్ గా ఉండేలా డిజైన్ చేసుకుని షూట్ స్టార్ట్ చేసారు.
ఇప్పటికే ఈ షూట్ ను స్టార్ట్ చేసారని… ఎన్టీఆర్ తో ఒక చేజింగ్ సీన్ లో షారుఖ్ ఉంటాడు అని… ఆ సీన్ ఎన్టీఆర్ కు షారుఖ్ మధ్య ఫేస్ టూ ఫేస్ యాక్షన్ సీన్ ఉండేలా ప్లాన్ చేసారట. ఈ న్యూస్ తో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. ఇది రా మా రేంజ్ అంటూ రామ్ చరణ్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయితే మాత్రం ఎన్టీఆర్ కు తిరుగు ఉండదు. ఇక సినిమా టైటిల్ ని తెలుగులో యుద్ద భూమిగా మార్చాలని ఎన్టీఆర్ డిమాండ్ చేసినట్టు సమాచారం.