బాక్సాఫీస్ తో 1000 కోట్ల చెడుగుడు… వరల్డ్ వైడ్ మైల్ స్టోన్…
దేవర అంచనాలకు తగ్గట్టే 6 రోజుల్లో 400 కోట్లు, ఏడో రోజు 80 కోట్ల వసూళ్లతో మొత్తంగా 480 కోట్లు రాబట్టాడు. కాని ఇదే బాలీవుడ్ సినీ జనానాల అంచనాలకు అర్ధం కావట్లేదు. ఓపెనింగ్స్ అదిరాయి కాని, రివ్యూలు నెగెటీవ్ గా వచ్చాయి కాబ్టటి, దేవర పనైపోయిందని రెండో రోజు పైశాచిక ఆనందం పొందరు.
దేవర అంచనాలకు తగ్గట్టే 6 రోజుల్లో 400 కోట్లు, ఏడో రోజు 80 కోట్ల వసూళ్లతో మొత్తంగా 480 కోట్లు రాబట్టాడు. కాని ఇదే బాలీవుడ్ సినీ జనానాల అంచనాలకు అర్ధం కావట్లేదు. ఓపెనింగ్స్ అదిరాయి కాని, రివ్యూలు నెగెటీవ్ గా వచ్చాయి కాబ్టటి, దేవర పనైపోయిందని రెండో రోజు పైశాచిక ఆనందం పొందరు. కాని తెలుగులో కంటే హిందీలో దేవరకి ఊరమాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తేలటంతో హిందీ బ్యాచ్ కి అదే అర్ధం కావట్లేదు. రోజు రోజుకి ఎన్టీఆర్ ఏమాత్రం కనికరం లేకుండా బాక్సాఫీస్ తో చెడుగుడు ఆడుకుంటున్నాడు. శనివారం మొదటి ఆటకల్లా ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లో చేరుతుంది. అంటే వచ్చే శనివారం, అంటే దసరాకే వెయ్యికోట్ల పండగ కన్ఫామ్ అవుతోంది. విచిత్రం ఏంటంటే, తెలుగు, హిందీ వర్షన్ల తో పోలిస్తే, తమిళ, మలయాళ వర్షన్ జోరు తగ్గిందన్నారు. కాని అక్కడ నిదానంగా లెక్కలు పెరిగిపోతున్నాయి. మలయాళం సంగతేమోకాని, కోలీవుడ్ లో దేవర దరువు విడుదలైన వన్ వీక్ తర్వా మొదలైనట్టే కనిపిస్తోంది. యూఎస్ లో మాత్రం వార్ వన్ సైడ్ అయిపోయింది..
దేవర ఆరు రోజుల్లో 400 కోట్ల వసూల్లు రాబట్టి, ఏడోరోజు ఏకంగా 80 కోట్లు కలెక్ట్ చేసింది. మరో 20కోట్లు వస్తే 500 కోట్ల క్లబ్ లోచేరినట్టే.అంటే శనివారం వసూళ్లతో దేవర 1000 కోట్ల జర్నీ సగం వరకు పూర్తైనట్టే… ఇక మిగతా 5 వందల కోట్లు వారం రోజుల్లో అంటే దసరాకు ముందే వచ్చేలా ఉంది. లేదంటే దసరారోజే ఈ రికార్డు క్రియేట్ అయ్యేలా ఉంది
ఇక దేవర యూఎస్ వసూళ్లు లెక్కేస్తే 5.5 మిలియన్లు అన్నారు. కాని ఇది 4 రోజుల వసూళ్లే… ఇక అన్ని యూఎస్ లో అన్ని భాషల్లో వసూలైన లెక్కలు చూస్తే, దాదాపు 9 మిలియన్లని తేలుతోంది. అంటే ఆల్ మోసట్ 70 కోట్లు అంటే, రోజుకి కనీసం 8 నుంచి 10 కోట్ల వసూళ్లు రాబట్టినట్టే… ఇది కూడా కల్కీ తో పోలిస్తే రికార్డే..
సినిమా ఏదైనా విడుదలైతే, ఇప్పుడు ఓవర్ సీస్ వసూళ్లలానే ఎప్పుడూ నైజాం కలెక్సన్స్ హాట్ టాపికే అవుతుంది. సో తెలంగాణలో దేవర వసూళ్లు లెక్కేస్తే, వారం రోజుల్లో 42 కోట్ల షేర్ ని రాబట్టింది. గ్రాస్ లెక్కలేస్తే ఇది 90 కోట్ల పైమాటే… నైజాం, ఆంధ్రా, నార్త్ ఇండియాలోనే దేవర దరువు మతిపోగొడుతోందని అన్నారు. కాని ఇప్పుడిప్పుడే, కర్ణాటకా, తమిళ నాడులో దేవర దుమ్మదులపటం మొదలైంది
కర్ణాటకలో రోజుకి కోటి మాత్రమే వసూళ్ చేసిన ఏరియాల్లో ఇప్పుడు ఏకంగా రోజుకి 5 కోట్లొస్తున్నాయి. తమిల నాడులో 50 లక్షల వసూళ్లు కాస్త 2 కోట్లకు చేరాయి. అంటే రోజుకి 50 లక్షల బదులు, రెండు కోట్లు అంటే నాలుుగ రెట్లు వసూళ్ల వరద పెరిగింది.
దీన్ని బట్టి చూస్తే, దేవర మీద జరిగిన నెగెటీవ్ ప్రచారం, తమిళ నాడు, కర్ణాటక మార్కెట్ల మీద ప్రభావం చూపించినట్టే కనిపిస్తోంది. లక్కీగా తెలుగు రాష్ట్రాల్లో, నార్త్ ఇండియాలో దేవర వసూళ్లు సునామీ క్రియేట్ చేయటం వల్లే, ఇప్పుడు దేవర అసలు టాక్ కిక్ ఇస్తోంది. కనికరం లేకుండా బాక్సాఫీస్ ని పీన్ పీస్ చేస్తున్నాడు దేవర..
రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ లేడు.. దేవరలో మల్టీ స్టారర్ అనిపించేలా ఇద్దరు హీరోలు లేరు. శ్రీదేవి కూతురు జాన్వీ ఉన్నా తన స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ.. ఇక అనిరుద్ ఇచ్చిన పాటల్లో మ్యూజిక్ కంటే, ఎన్టీఆర్ డాన్స్ మ్యాజిక్కే ఎక్కువ వర్కవుట్ అయ్యింది. సింపుల్ గాచెప్పాలంటే ఇది ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో… సోలోగా వచ్చి వెయ్యికోట్లు రాబట్టేలా ఉండటంతో, మరో రెబల్ స్టార్ అంటున్నారు. ప్రభాస్ తర్వాత ఇలా సోలోగా తానేంటో ప్రూవ్ చేసుకున్న పాన్ ఇండియా స్టార్ అనేస్తున్నారు. విచిత్రం ఏంటంటే పాన్ ఇండియా లెవల్లో సోలోగా వచ్చి ఇలా తనని తాను ప్రూవ్ చేసుకున్న ఇద్దరు స్టార్లు తెలుగు హీరోలే…