బ్రిటన్ గడ్డపై దేవర సరికొత్త రికార్డ్, తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ ఒక్కడే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా విడుదలకు ముందే రికార్డులను సముద్రంలో కలుపుకుంటూ పోతుంది. ఒక్కో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంటూ దేవర దుమ్ము రేపుతున్నాడు. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ దేవర... సునామీ సృష్టిస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 18, 2024 | 03:16 PMLast Updated on: Sep 18, 2024 | 3:16 PM

Devaras New Record On British Soil Ntr Is The Only One In The History Of Telugu Cinema

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా విడుదలకు ముందే రికార్డులను సముద్రంలో కలుపుకుంటూ పోతుంది. ఒక్కో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంటూ దేవర దుమ్ము రేపుతున్నాడు. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ దేవర… సునామీ సృష్టిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు నాకు లెక్క కాదు నా గురి హాలీవుడ్ అంటూ దేవర తన ఖాతాలో రికార్డులు వేసుకుపోతున్నాడు. అమెరికాలో విడుదలకు ముందే రెండు మిలియన్ వసూళ్లు సాధించే దిశగా దేవర వెళ్తోంది.

ఇంకో 9 రోజుల్లో విడుదల కానున్న దేవర సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి జనాల్లో. ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేస్తున్న చిత్ర యూనిట్… విదేశాల్లో వస్తున్న బజ్ చూసి పొంగిపోతుంది. యూరప్ ఖండం మొదలుకుని… ఉత్తర అమెరికా వరకు దేవర హవా నడుస్తోంది. హాలీవుడ్ లో కూడా ఇప్పుడు దేవర పేరు వినపడుతోంది. ఇక సినిమా ట్రైలర్ తర్వాత కాస్త నెగటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత మాత్రం దేవర స్పీడ్ చూసిన జనాలకు మైండ్ పోతుంది. ఇప్పుడు యూకేలో సరికొత్త రికార్డుని దేవర తన ఖాతాలో వేసుకున్నాడు.

యునైటెడ్ కింగ్డమ్ లో డాల్బీ అట్మాస్ లో ప్రదర్శించే తొలి తెలుగు సినిమాగా దేవర నిలిచింది. ఇప్పటి వరకు యూకేలో ఎన్నో తెలుగు సినిమాలు విడుదలైనా దేవర ఒక్కటే ఇలా ప్లే కానుంది. దీనితో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. యూకేలో మన తెలుగు సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు దేవర సినిమాతో ఆ క్రేజ్ భారీగా పెరిగింది అనే చెప్పాలి. ఇక విడుదల తర్వాత వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటికే అమెరికాలో సలార్ సినిమా రికార్డులను తన ఖాతాలో వేసుకునే అవకాశం దేవర ముందు ఉంది.