ఇన్స్టాగ్రాంలో దేవర కొత్త రికార్డ్, మెటా దుమ్ము దులిపిందిగా

దేవర రిలీజ్ కు దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సినిమాకు క్రేజ్ ఓ రేంజ్ లో వస్తోంది. సినిమా పాటలు బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. సినిమాలో ఎన్టీఆర్ లుక్ తో పాటుగా జాన్వీ కపూర్ లుక్ కూడా బాగా నచ్చింది జనాలకు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 15, 2024 | 03:56 PMLast Updated on: Sep 15, 2024 | 3:56 PM

Devaras New Record On Instagram

దేవర రిలీజ్ కు దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సినిమాకు క్రేజ్ ఓ రేంజ్ లో వస్తోంది. సినిమా పాటలు బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. సినిమాలో ఎన్టీఆర్ లుక్ తో పాటుగా జాన్వీ కపూర్ లుక్ కూడా బాగా నచ్చింది జనాలకు. జాన్వీ కపూర్ నటన ఎలా ఉంటుందో అనే భయం కూడా ఫ్యాన్స్ లో ఉంది. ఆమె డాన్స్ తో ఇబ్బంది లేకపోయినా నటన విషయంలోనే చిత్ర యూనిట్ కూడా ఆందోళనగా ఉందనే వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో.

ఇక దేవర సినిమా ఈ నెల 27 న విడుదల కానుండటంతో సినిమా ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో చేస్తోంది చిత్ర యూనిట్. సినిమాను బాలీవుడ్ లో కూడా భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక విదేశాల్లో సినిమాకు భారీ హైప్ వస్తోంది. అమెరికాలో అయితే ఏకంగా 40 వేలకు పైగా టికెట్ లు విడుదలకు ముందే అమ్ముడు కావడం సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతుంది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఇన్స్టాగ్రాం లో రీల్స్ విషయంలో కూడా దేవర ఓ రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. అసలు ఏంటీ ఆ రికార్డ్ అనేది చూద్దాం.

దేవర సినిమాలో పాటలు, ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వచ్చిన రీల్స్ గాని, సినిమా డైలాగ్స్ తో వచ్చిన రీల్స్ గాని 1 మిలియన్ దాటాయి. ఇందులో చుట్టమల్లె పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. ఇలా దేవర రీల్స్ ఇన్స్టాగ్రాంలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. దేవర హ్యాష్ ట్యాగ్ తో ఈ రీల్స్ చేస్తున్నారు జనాలు. దీనిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాట్సాప్ గ్రూప్స్ లో వైరల్ చేస్తున్నారు. విడుదలకు ముందే ఇన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంటున్న దేవర విడుదలై హిట్ అయితే ఏ రేంజ్ లో ఉంటుందా అని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటుగా కొరటాల శివ భారీగా ఆశాలుపెట్టుకున్నారు.