Devara : దేవ‌ర వాయిదా త‌ప్ప‌దా..?

భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతున్న మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా (Pan Indian) మూవీల్లో దేవర ఒక‌టి.. రెండు భాగాలుగా తెరకెక్కున్న ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ శర వేగంగా తెరకెక్కిస్తున్నాడు. జూనియ‌ర్ - కొర‌టాల‌ది (Jr. NTR, Koratala Siva) క్రేజీ కాంబో కావ‌డంతో దేవర మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే బయటకు వచ్చిన జూనియర్ లుక్, గ్లింప్స్‌ ఈ మూవీపై మరింత హైప్‌ను పెంచేశాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 16, 2024 | 10:07 AMLast Updated on: Feb 16, 2024 | 10:07 AM

Devaras Postponement Is Wrong

భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతున్న మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా (Pan Indian) మూవీల్లో దేవర ఒక‌టి.. రెండు భాగాలుగా తెరకెక్కున్న ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ శర వేగంగా తెరకెక్కిస్తున్నాడు. జూనియ‌ర్ – కొర‌టాల‌ది (Jr. NTR, Koratala Siva) క్రేజీ కాంబో కావ‌డంతో దేవర మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే బయటకు వచ్చిన జూనియర్ లుక్, గ్లింప్స్‌ ఈ మూవీపై మరింత హైప్‌ను పెంచేశాయి. కాగా.. ఈ మూవీ రిలీజ్‌పై వ‌స్తున్న వార్త‌లు ఫ్యాన్స్‌ను గంద‌ర‌గోళంలో ప‌డేస్తున్నాయి. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే దేవర రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉన్న‌ట్లు ఇప్పుడు మ‌రోసారి లేటెస్ట్ న్యూస్ ఫిల్మ్‌న‌గ‌ర్‌ (Filmnagar) లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

దాదాపుగా ఇప్పటికే షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి రీసెంట్‌గా కొంచెం గ్యాప్ తీసుకున్నారు మేకర్స్.. ఇక ఈ గ్యాప్ తర్వాత అయితే ఈ మార్చి 14 నుంచి మేకర్స్ కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తున్నట్టుగా ఇటీవ‌ల అప్‌డేట్ వ‌చ్చింది. ఇక.. ఈ మూవీ నుంచి కేవలం సాంగ్స్ షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయ‌ని.. అనుకున్న డేట్‌కే దేవ‌ర రిలీజ్ ఉంటుంద‌ని అన్నారు. అయితే.. దేవ‌ర మూవీ అనుకున్న డేట్‌కి వ‌చ్చే అవ‌కాశం లేద‌న్న న్యూస్ ఫ్యాన్స్‌ను టెన్ష‌న్ పెడుతోంది. ప్ర‌మోష‌న్స‌న్‌లో భాగంగా దేవ‌ర మూవీ రిలీజ్ లేట్ అయ్యే అవ‌కాశ‌ముంద‌న్న‌ది టాలీవుడ్ (Tollywood) వ‌ర్గాల్లో గ‌ట్టిగా వినిపిస్తోన్న మాట‌..

దేవ‌రతో బాక్సాఫీస్ బ‌ద్ద‌ల‌య్యే హిట్ కొట్టాల‌ని జూనియ‌ర్- కొర‌టాల గ‌ట్టిగా ఫిక్స‌య్యార‌ట‌.. ఈ క్రమంలోనే రిలీజ్ అయిన గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి.. 79 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో.. అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది.. జూనియర్ నట విశ్వరూపాన్ని చూపించింది..
దీంతో.. దేవర (Devara) ప్రమోషన్స్ కోసం టీమ్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. హీరో ఎన్టీఆర్ ఈ భారీ పాన్ ఇండియన్ మూవీని ప్రమోట్ చేయడం కోసం అనేక ప్రాంతాల్లో పర్యటించనున్నారని, వీలైనంత ఎక్కువగా తమ మూవీని ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి చేరువ చేయాలనేది టీమ్ ఆలోచనట.. మ‌రి ఈ వార్త‌ల్లో నిజానిజాలెంతో తెలియాలంటే మూవీ టీమ్ నుంచి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే.