మాటల తూటాతో బాంబ్ పేల్చాడు… వైల్డ్ ఫైర్ అనుకుంటే మిస్ ఫైర్..
పుష్ప 2 ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నారు. కానీ రిలీజ్ లోపే దేవిశ్రీ ప్రసాద్ పేల్చిన మాటల తూటాలతో మ్యాటర్ మిస్ ఫైర్ అయ్యేలా ఉంది. బేసిగ్గానే సౌత్ హీరోల ఇష్యూస్ దొరికితే ట్రోలింగ్ తో ఆటాడుకోవాలనకునే, యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ కి కావాల్సినంత సరకు దొరికినట్టైంది.
పుష్ప 2 ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నారు. కానీ రిలీజ్ లోపే దేవిశ్రీ ప్రసాద్ పేల్చిన మాటల తూటాలతో మ్యాటర్ మిస్ ఫైర్ అయ్యేలా ఉంది. బేసిగ్గానే సౌత్ హీరోల ఇష్యూస్ దొరికితే ట్రోలింగ్ తో ఆటాడుకోవాలనకునే, యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ కి కావాల్సినంత సరకు దొరికినట్టైంది. పుష్ఫ 2 రిలీజ్ కిముందే వందలకోట్లు రాబట్టిందనే ప్రచారాన్ని, ఈసారి పుష్పరాజ్ తగ్గాల్సి వస్తుందా అన్న నెగెటీవ్ ప్రచారమే డామినేట్ చేస్తోంది. ఒక వైపు కిస్సిక్ సాంగ్ మీద పబ్లిక్ టాక్ వీకైపోతోంది. కాని మిగతా పాటలు, ట్రైలర్ బీజీఎం పేలాయి… విచిత్రం ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ ని ట్రోలర్స్ పొగుడుతున్నారు… పుష్ప2 టీంకి కౌంటర్స్ పెంచారు.. ఇదో విచిత్రమైన పరిస్థితి… ఇదే కొనసాగితే, పుష్ప2 వైల్డ్ ఫర్ కాదు మిస్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది… ఆల్రెడీ సౌత్ లో ట్రోలింగ్ పెరిగింది. నార్త్ ఇండియాలో ట్రోలింగ్ షాక్ ఇస్తోంది.. ఇంతకి ఏంజరుగబోతోంది?
దేవిశ్రీ మాటల తూటాలు పేల్చాడు. పుష్ప 2 విషయంలో నిర్మాతలకు, దేవకి మధ్య వార్ నడుస్తోందన్న ప్రచారాన్ని నిజం చేస్తూ, చెన్నై ఈవెంట్ లో వివాదానికి వెల్ కమ్ చెప్పాడు. పుష్ప2 ని ట్రోల్ చేసే యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ కి కావాల్సినంత కంటెంట్ ఇచ్చిపడేశాడు
సాంగ్స్ లేటుగా ఇస్తానని, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లేట్ గా ఇస్తానంటారు.. లేటుగా వచ్చానంటారు. కాని నన్ను లేటు చేసేలా బయట సిబ్బంది అడ్డుకుంటారు.. ఇలా తను ఈవెంట్ లోపేల్చిన మాటల తూటాలు, మెల్లిగా గ్రానైడ్లుగా, మారాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ తో ఆటోంబాంబులా అవే మాటల తూటాలు మళ్లీ మళ్లీ పేలుతున్నాయి
అసలే పుష్ప 2 రిలీజ్ వాయిదా పడుతుందేమో, డిసెంబర్ 5 కి డౌటే అంటూ బాలీవుడ్ లో సౌత్ హీరోలని వ్యతిరేకించేబ్యాచ్ నెగెటీవ్ కామెంట్స్ చేసింది. పవన్ ఫ్యాన్స్, మహేశ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా బన్నీ అంటే మండిపోయున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ దేవర రిలీజ్ టైంలో సోషల్ మీడియలో చేసిన అతే అందుక్కారణం అంటున్నారు
వైసీపీకి సపోర్ట్ చేసి జనసేన, టీడీపీ బ్యాచ్ కి మండేలా ప్రవర్తించిన బన్నీ, తర్వాత సోసల్ మీడియాలో మెగాఫ్యాన్స్ కి, అల్లు ఆర్మీకి జరిగిన వార్ ఇవన్నీ పుష్ప 2 మీద వాళ్లంతా ఫైర్ అయ్యేలా చేస్తోంది.. ఇలాంటి టైంలో దేవి శ్రీ ప్రసాద్ సీన్ లోకి వచ్చి, పుష్ప2 నిర్మాతలకు పరోక్ష చురుకులతో ఇచ్చిపడేశాడు
బన్నీకి సపోర్ట్ చేస్తూనే నిర్మాతలను వేసుకున్నట్టుగా దేవి శ్రీ ప్రసాద్ మాటలున్నా… అది అల్లు అర్జున్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే హీరోకి తెలియకుండా, తన పర్మీషన్ లేకుండా పుష్ప2 బ్యాగ్రౌండ్ స్కోర్ ని మరొకరితో కంపోజ్ చేయించాలనుకోరు… తమన్న అండ్ కోకి రంగంలోకి దింపరు. అదే ఈ పుష్ప కుంపటికి కారణమైంది. మరి సినిమా అంటేనే సెంటిమెంట్స్ ఎక్కువుంటాయి. మరి దేవి శ్రీ ఎటాక్ ని నెగెటీవ్ శకునంగా ఫీలౌతారో, లేదంటే దేవి శ్రీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నే ఉంచి, పుష్ప2 కాంట్రవర్సీని కూల్ చేస్తారో డిసెంబర్ 5 కి తేలబోతోంది. విచిత్రం ఏంటంటే దేవిశ్రీ తెలుగులో చెప్పిన డైలాగ్స్ ని హిందీ లో డబ్ చేసిన మరీ బీటౌన్ యాంటీ బ్యాచ్ పుష్ప2 ని ట్రోల్ చేస్తోంది. ఇది ఇక్కడ సైడ్ ఎఫెక్ట్..