Devi Sri Prasad: డీఎస్పీకి మంచి రోజులొచ్చాయా.. క్యూ కడుతున్న భారీ ఆఫర్లు..
త్రివిక్రమ్‌తోపాటు చాలామంది దేవిశ్రీకి దూరంగా జరిగారు. ఇలా బ్యాడ్ టైం బాదేస్తోందనుకున్న టైంలో, మళ్లీ దేవిశ్రీ మ్యాజిక్ వర్కవుట్ అయ్యేలా ఉంది. కారణం కూడా తమనే. మొన్న భగవంత్ కేసరి పాటలు పేలలేదు. గుంటూరు కారం మసాలా పాట తూటాలా పేలలేదు.
Devi Sri Prasad: పుష్ప (PUSHPA) పాటలతో తూటాలు పేల్చిన దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)కు తర్వాత అడ్రస్ లేదు. తనపనిని పట్టించుకున్నవాళ్లు లేరు. ఎటు చూసినా, ఎటు విన్నా తమన్ పాటలే.. అలా వైకుంఠపురంలో, భీమ్లానాయక్, అఖండ ఇలా తమన్ (SS THAMAN) పాటలతోనే సౌత్ ఊగింది. త్రివిక్రమ్‌తోపాటు చాలామంది దేవిశ్రీకి దూరంగా జరిగారు. ఇలా బ్యాడ్ టైం బాదేస్తోందనుకున్న టైంలో, మళ్లీ దేవిశ్రీ మ్యాజిక్ వర్కవుట్ అయ్యేలా ఉంది. కారణం కూడా తమనే.
Salaar: ట్రైలర్ రెడీ.. కేరళ రైట్స్ దక్కించుకున్న సలార్ విలన్..
మొన్న భగవంత్ కేసరి పాటలు పేలలేదు. గుంటూరు కారం మసాలా పాట తూటాలా పేలలేదు. ఏదో మహేశ్ ఫ్యాన్స్ కనీసం ఏదో ఒక అప్ డేట్ వచ్చిందని సంతోషపడి సర్దుకుపోతున్నారే కాని, తమన్ మ్యూజిక్‌లో ఈమధ్య మ్యాజిక్ తగ్గింది. దానికి మించి కథను బట్టే మ్యూజిక్ వస్తుందన్న తన స్టేట్ మెంట్ తనలో బలహీనతని బయటపెట్టిందన్నారు. ఏదేమైనా తమన్ సాంగ్స్ ఓ వైపు ఫ్లాపవుతున్నాయి. మరోవైపు పుష్ప 2, ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ దేవిశ్రీ ఎకౌంట్‌లో ఎలాగూ సుకుమార్, హరీష్ శంకర్ సినిమాలున్నాయి. ఇప్పడు చిరు మూవీతో పాటు సల్మాన్ ఆఫర్ రావటం, హృతిక్ కొత్త ప్రాజెక్ట్ దేవిశ్రీ ఎకౌంట్‌లో పడటం మంచి ఎచీవ్ మెంట్లే. ఇక సుకుమార్‌తో రామ్ చరణ్ చేయబోయే మూవీ కూడా దేవిశ్రీ ఎకౌంట్‌లోనే ఉంటుంది.
Rashmika Mandanna: శ్రీవల్లి రియాక్షన్.. డీప్ ఫేక్ వీడియోపై రష్మిక ఎమోషనల్ పోస్ట్..
ఇలా తన గురువుల సినిమాలు, వీటికి తోడు పెద్ద హీరోల మూవీలు దేవిశ్రీకి దక్కడం ఒక ఎత్తైతే, తమన్ మ్యూజిక్ రొటీన్ అన్న కామెంట్ పెరగటం మరో ఎత్తు. ఉప్పెనతో మ్యూజికల్ హిట్ ఇచ్చినా కాని బుచ్చిబాబు మాత్రం చరణ్‌తో ప్లాన్ చేసిన సినిమాకు రెహమాన్‌నే తీసుకున్నాడు. కాని చరణ్‌తో ప్లాన్ చేసిన మూవీకి దేవినే కంటిన్యూ చేస్తున్నాడు లెక్కల మాస్టారు.