Devil-Review : డెవిల్ రివ్యూ.. కల్యాణ్ రామ్ మాస్ ఊచకోత..

వరుస డిజాస్టర్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటించిన మూవీ డెవిల్. కెరీర్ లో ఫస్ట్ టైమ్ స్పై థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందా ముందుగా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే బ్రిటిష్ కాలంలో ఒక రాజు కుటుంబంలో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ని ఎవరు చేశారు అనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి కళ్యాణ్ రామ్ ఆ ఇంట్లోకి వెళ్తాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 29, 2023 | 11:39 AMLast Updated on: Dec 29, 2023 | 11:42 AM

Devil Review Kalyan Ram Mass Massacre

వరుస డిజాస్టర్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటించిన మూవీ డెవిల్. కెరీర్ లో ఫస్ట్ టైమ్ స్పై థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందా ముందుగా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే బ్రిటిష్ కాలంలో ఒక రాజు కుటుంబంలో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ని ఎవరు చేశారు అనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి కళ్యాణ్ రామ్ ఆ ఇంట్లోకి వెళ్తాడు. ఆయన ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో కళ్ళు చెదిరే నిజాలు ఆయనకు తెలుస్తూ ఉంటాయి. ఇక అందులో భాగంగానే ఆ మర్డర్ కి బ్రిటిష్ సీక్రెట్ మిషిన్ కి మధ్య సంబంధం ఉందని తెలుసుకున్న అధికారులు కళ్యాణ్ రామ్ తో ఆపరేషన్ టైగర్ హంట్ మొదలు పెడతారు.

దాంతో ఆ హత్యకి బ్రిటిషర్స్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి కళ్యాణ్ రామ్ ప్రాణాలకు తెగించి ఈ మిషిన్ ని చేయడానికి గల కారణం ఏంటి..? అనేది తెలియాలంటే మీరు ఈ సినిమాని చూడాల్సిందే. పర్పామెన్స్ విషయానికి వస్తే.. డెవిల్ లో కళ్యాణ్ రామ్ కమ్మేశాడు. మాస్ ఊచకోత నెక్ట్స్ లెవల్ అనేలా ఉంది. వన్ మ్యాన్ షోలా సినిమాను నడించాడు. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు సినీ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం నార్మల్ గా సాగినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం కళ్యాణ్ రామ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కి అందరూ ఫిదా అయిపోతారు. సంయుక్త మీనన్ తనదైన రీతిలో నటించడమే కాకుండా ఈ సినిమాలో తన వంతు ప్రయత్నం చేసి సినిమా సక్సెస్ లో తను కూడా భాగమైంది.

ఇక మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా తమ పరిధిని మించకుండా సెటిల్ గా నటించి మెప్పించారు. టెక్నికల్ విషయానికి వస్తే సౌందర్య రాజన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి చాలా హైలెట్ గా నిలిచింది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్ ని ఎలివేట్ చేయడంలో చాలావరకు హెల్ప్ అయ్యాయనే చెప్పాలి. ఎడిటర్ తమ్మి రాజు అందించిన ఎడిటింగ్ కరెక్ట్ గా ఉంది. ఓవరాల్ గా గుడ్ థ్రిల్లర్ కమర్షియల్ మూవీ గా నిలిచింది డెవిల్ మూవీ. మొత్తానికి ఇయర్ ఎడింగ్ బ్లాక్ బస్టర్ మూవీతో ఎండ్ అయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.