Pushpa 2 : ‘పుష్ప2’లో దేవిశ్రీ

మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ పుష్ప2ని అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 16, 2024 | 11:15 AMLast Updated on: May 16, 2024 | 11:15 AM

Devisree In Pushpa 2

 

 

 

మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ పుష్ప2ని అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. పాన్ ఇండియా లెవల్లో వెయ్యి కోట్లు టార్గెట్‌గా వస్తున్న ఈ సినిమాలో.. పాన్ ఇండియా స్టార్ క్యాస్టింగ్‌ని తీసుకున్నట్టుగా ఇప్పటికే టాక్ ఉంది. బాలీవుడ్ నుంచి స్టార్ హీరో క్యామియో, స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే.. ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజ్‌లు కూడా ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్.

లేటెస్ట్‌గా ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ తెరంగేట్రం కూడా ఉంటుందని తెలుస్తోంది. కొద్ది నిమిషాల పాటు ఉండే ఒక కీలక పాత్రలో దేవిశ్రీ ప్రసాద్‌ని చూపించబోతున్నాడట సుకుమార్. గత కొన్నాళ్లుగా దేవికి కూడా నటన మీద ఆసక్తి ఉందని వార్తలు వస్తునే ఉన్నాయి. ఆ మధ్య హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడని రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే.. సుకుమార్ ఇచ్చిన ఆఫర్‌ని కాదనకుండా పుష్ప2లో నటించేందుకు ఓకే చెప్పాడట దేవి. మామూలుగా అయితే, దేవిశ్రీ ప్రసాద్‌ని మ్యూజిక్ వీడియోల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ ఇప్పుడు పుష్ప2లో క్యామియే అనే న్యూస్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఇక పుష్ప పార్ట్ 1కి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చిన దేవి.. పార్ట్ 2 కోసం అంతకుమించిన మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప.. పుష్ప సాంగ్‌కు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. రెండో పాట పనులు మొదలైనట్టుగా తెలుస్తోంది. ఈసారి పక్కా మెలోడీ సాంగ్‌ రిలీజ్ చేయబోతున్నారట. పుష్పరాజ్, శ్రీవల్లి పై వచ్చే ఈ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలవడం గ్యారెంటీ అంటున్నారు