Devi Sri Prasad: మరదల్ని పెళ్లాడనున్న డీఎస్పీ ?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోస్‌తో సమానంగా క్రేజ్ ఉన్న ఒకేఒక్క మ్యూజిక్ డైరెక్టర్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడంటే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి కానీ.. ఒకప్పుడు డీఎస్పీదే హవా. బొమ్మరిల్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవీ.. ఆ సినిమా తరువాత కెరీర్‌లో దూసుకుపోయాడు.
వరుస మ్యూజికల్ హిట్స్ ఇస్తూ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. డీఎస్సీ మ్యూజిక్ చేస్తున్నాడంటే ఆ సినిమా ఫ్లాపైనా సాంగ్స్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసివి. ఇక ఆడియో ఫంక్షన్స్‌లో కూడా డీఎస్సీ చేసే హడావిడి మామూలుగా ఉండదు. తన బ్యాండ్‌తో ఆడియన్స్ ఉర్రూతలూగితస్తాడు. ఈవెంట్ మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాడు. ఇలా తనకంటూ ఓ క్రేజ్, ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న డీఎస్పీ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్టు తెలుస్తోంది. తమ దూరపు బంధువుతో డీఎస్పీ పెళ్లి జరగబోతోందట.
డీఎస్పీకి ఆ అమ్మాయి వరుసకు మరదలు అవుతుందట. వాళ్లిద్దరికీ ఏజ్‌గ్యాప్ కాస్త ఎక్కువగానే ఉన్నా.. ఇద్దరి ఫ్యామిలీస్ ఇప్పటికే వీళ్ల పెళ్లి గురించి డెసిషన్ తీసుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని ఆఫీషియల్‌గా కూడా ఎనౌన్స్ చేస్తారని అంటున్నారు. అప్పట్లో డీఎస్పీ గురించి ఇలాగే చాలా రూమర్స్ వచ్చాయి. ఓ స్టార్ హీరోయిన్‌తో దేవీ లవ్‌లో ఉన్నాడని.. త్వరలోనే వాళ్లు పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్ టాలీవుడ్ స్ట్రీట్స్‌లో చక్కర్లు కొట్టాయి. కానీ తరువాత అవేమీ నిజం కాదని తేలింది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న అమ్మాయి మాత్రం సెలబ్రెటీ కాదు. డీఎస్పీ మరదలే అంటున్నారు. ఈ న్యూస్ తెలిసిన డీఎస్పీ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.