NTR-Devara : ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత దేవర సునామి

అర్జునుడి పాశుపతాస్త్రానికి ఎంతటి శక్తీ ఉందో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకి అంతే శక్తీ ఉంది. నటనకి సంబంధించిన అన్ని యాంగిల్స్ లోను అధ్భుతంగా నటించగలడు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 27, 2024 | 05:45 PMLast Updated on: May 27, 2024 | 5:45 PM

Dewara Tsunami After Election Result

అర్జునుడి పాశుపతాస్త్రానికి ఎంతటి శక్తీ ఉందో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకి అంతే శక్తీ ఉంది. నటనకి సంబంధించిన అన్ని యాంగిల్స్ లోను అధ్భుతంగా నటించగలడు. కెమెరా కూడా ఎన్టీఆర్ నటనకి మైమరిచిపోతుందని ఆయనతో పని చేసిన చాలా మంది దర్శకులు చెప్తారు. ఆర్ఆర్ఆర్ లోని కొమరం భీముడో పాటనే అందుకు ఉదాహరణ. లేటెస్ట్ గా దేవర తో ముస్తాబవుతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ అభిమానుల్లో అమితోత్సాహాన్ని కలిగిస్తుంది.

దేవర షూటింగ్ కి మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా ప్రస్తుతం కంటిన్యూగా సాగుతుంది. లేటెస్ట్ గా ఒక భారీ సెట్ ని వేశారు. క్లైమాక్స్ సీన్ కోసమే సెట్ వేశారనే ప్రచారం జరుగుతుంది. ఇండియన్ సినిమా హిస్టరీ లోనే దేవర లాంటి భారీ క్లైమాక్స్ సెట్ ఇంకోటి లేదనే ప్రచారం ఫిలిం సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది. అందులో ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్ ల మధ్య క్రేజీ ఫైట్ సీక్వెన్సెస్ ను ప్లాన్ చేస్తున్నారని టాక్.

ఇక ఆర్ఆర్ఆర్ వచ్చిన రెండేళ్ళకి ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవర పై ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ప్రేక్షకుల్లో కూడా జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ ,కొరటాల శివ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర ద్వారా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకి పరిచయం అవుతుంది. ఆ ఇద్దరి ఫెయిర్ సిల్వర్ స్క్రీన్ మీద ఎన్ని మ్యాజిక్ లు చేస్తుందో చూడాలి. అక్టోబర్ పది విడుదల కాబోతుంది. ఇటీవల వచ్చిన ఫస్ట్ సాంగ్ అయితే యూట్యూబ్ లో రికార్డులు సృష్టించే పనిలో ఉంది.అనిరుద్ సంగీత దర్శకుడు. ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత దేవర సునామి రెండు తెలుగు రాష్ట్రాల్లో పక్కా.