Captain Miller Teaser: మిస్సైల్‌లా వచ్చేసిన మిల్లర్.. మరో విభిన్న చిత్రంలో ధనుష్

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ ద‌గ్గ‌రి నుంచే అంచ‌నాల్ని పెంచేసిన ఈ మూవీ.. టీజ‌ర్‌తో ఆ హైప్‌ని మ‌రింతగా పెంచేసింది. ధ‌నుష్ న‌టిస్తున్న పీరియాడ్ యాక్ష‌న్ డ్రామా కావడంతో అభిమానుల‌తో పాటు సినీ ల‌వ‌ర్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 28, 2023 | 01:13 PMLast Updated on: Jul 28, 2023 | 1:13 PM

Dhanush In A Never Seen Before Avatar Raises Expectations On The Movie

Captain Miller Teaser: విల‌క్ష‌ణ‌మైన సినిమాలు, క్యారెక్ట‌ర్ల‌తో హీరోగా ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ధనుష్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హిస్టారిక‌ల్ హై వోల్టేజ్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ `కెప్టెన్ మిల్ల‌ర్‌` నుంచి అదిరిపోయే టీజర్ వచ్చేసింది.

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ ద‌గ్గ‌రి నుంచే అంచ‌నాల్ని పెంచేసిన ఈ మూవీ.. టీజ‌ర్‌తో ఆ హైప్‌ని మ‌రింతగా పెంచేసింది. ధ‌నుష్ న‌టిస్తున్న పీరియాడ్ యాక్ష‌న్ డ్రామా కావడంతో అభిమానుల‌తో పాటు సినీ ల‌వ‌ర్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. టీజర్‌లో ధనుష్ తుపాకీ పట్టుకొని ప్రత్యర్థులపై తూటాల వర్షం కురిపించడం అదుర్స్ అనిపించింది. అసలు సిసలైన పోరాట యోధుడిగా కనిపించి అంచనాలు పెంచేశాడు. ఇక ఈ సినిమా కోసం ధనుష్ మార్చుకున్న మేకోవ‌ర్‌ నేవర్ బిఫోర్ అనే చెప్పాలి. గుబురు గడ్డంతో చేతిలో గన్ను పట్టుకుని యుద్ధ వీరుడులా కనిపించి మిస్మరైజ్ చేశాడు. ఇక గొడ్డలితో వీరవిహారం చేశాడు.

1930 కాలంలో భారత స్వాతంత్య్రానికి పూర్వం నాటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో సాగే సినిమా కావటంతో ధనుష్ డిఫరెంట్ మేకవర్లో కనిపించనున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ధ‌నుష్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో వస్తున్న ఈ మూవీలో ఒక డైలాగ్ కూడా లేకుండా టీజర్ రిలీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. టీజర్‌లో ధనుష్ యాక్షన్ ఎపిసోడ్‌ని చూసి ఫాన్స్ పూనాకాలతో ఊగిపోతున్నారు. డిసెంబ‌ర్ 15న మిసైల్‌లా థియేటర్లోకి వచ్చేస్తున్నాడు. టీజర్‌తోనే అంచనాలు పెంచిన ధనుష్ రిలీజ్ తర్వాత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.