త్రివిక్రమ్‌ను అల్లు అర్జున్ మోసం చేసాడా..? సడన్‌గా అట్లీ ఎలా లైన్‌లోకి వచ్చాడు..?
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా కోసం పెద్ద యుద్ధమే జరుగుతుందిప్పుడు. పుష్ప 2 తర్వాత బన్నీలో కన్ఫ్యూజన్ వచ్చిందో.. లేదంటే దర్శకులలో కన్ఫ్యూజన్ పెరిగిందో తెలియదు కానీ ఓ పట్టాన ఏ సినిమాకు ఓకే చెప్పట్లేదు ఈ హీరో.

అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా కోసం పెద్ద యుద్ధమే జరుగుతుందిప్పుడు. పుష్ప 2 తర్వాత బన్నీలో కన్ఫ్యూజన్ వచ్చిందో.. లేదంటే దర్శకులలో కన్ఫ్యూజన్ పెరిగిందో తెలియదు కానీ ఓ పట్టాన ఏ సినిమాకు ఓకే చెప్పట్లేదు ఈ హీరో. త్రివిక్రమ్ ఎప్పట్నుంచో లైన్‌లో ఉన్నా కూడా ఆయన్ని కాదని మరో దర్శకుడి వైపు అల్లు అర్జున్ అడుగులు పడుతున్నట్లు కనిపిస్తున్నాయిప్పుడు. ఇలా జరిగితే మాటల మాంత్రికుడిని నమ్మించి మోసం చేసినట్లే. ఎందుకంటే బన్నీ కోసమే ఏడాదిన్నరగా కూర్చున్నాడు త్రివిక్రమ్. గుంటూరు కారం తర్వాత ఈయనతో సినిమా చేయడానికే కథ రాసుకుంటున్నాడు. అయితే అల్లు అర్జున్ మాత్రం ముందు గురూజీకి ఓకే చెప్పినా.. ఇప్పుడు మాత్రం సారీ గురూజీ అంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.
కథ విషయంలో క్లారిటీ రాకపోవడంతో.. రిస్క్ తీసుకోడానికి రెడీగా లేడు బన్నీ. అందుకే ఇంకో ఏడాది టైమ్ తీసుకున్నా పర్లేదు కానీ మంచి స్క్రిప్ట్‌తో రమ్మంటూ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అప్పటి వరకు బన్నీ కోసమే త్రివిక్రమ్ ఆగుతాడా లేదంటే మధ్యలో మరో సినిమా చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. మరోవైపు టైమ్ దొరికింది కదా అని వెంటనే దూరిపోయాడు అట్లీ. నిజానికి చాలా రోజులుగా అల్లు అర్జున్‌తో సినిమా కోసం చూస్తున్నాడీయన. గతంలో ఓసారి బన్నీ వద్దన్నాడు.. ఆ తర్వాత అట్లీ వద్దనుకున్నాడు.. కానీ ఎన్ని చేసినా అల్లు, అట్లీ కలిసి పని చేయాలని రాసి పెట్టినట్లుంది.. అందుకే చివరికి ఈ కాంబినేషన్ ఓకే అయ్యేలా కనిపిస్తుందిప్పుడు. ఎప్రిల్‌లో ఓపెనింగ్ చేసి.. ఆగస్ట్ నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు అట్లీ. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం 200 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. మరోవైపు అట్లీ కూడా 100 కోట్లు కావాలంటున్నాడు.
ఈ ఇద్దరి పారితోషికమే 300 కోట్లు అంటే.. బడ్జెట్ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమా ఎప్పుడు మొదలు పెట్టినా.. ఏడాదిలోపే పూర్తి చేయాలనేది బన్నీ కండీషన్. అలా అయితేనే కమిట్ అవుతానంటూ చెప్పాడు అల్లు వారబ్బాయి. మరి ఈయన చెప్పిన దానికి అట్లీ ఓకే అంటాడా.. ఒకే ఏడాదిలో సినిమా పూర్తి చేస్తాడా అనేది చూడాలి. ఏదేమైనా బన్నీని నమ్మి త్రివిక్రమ్ మాత్రం బాగానే బలైపోయాడు అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయిప్పుడు. ఎంతైనా మూడు హిట్లు ఇచ్చిన దర్శకుడు కదా.. బన్నీ కూడా ఓసారి ఆలోచించాల్సింది.. ఏమంటారు..?