Malaika and Arjun Kapoor: మలైకా అరోరా.. అర్జు కపూర్ విడిపోయారా..?
'గట్టిగా కోరుకో.. అయిపోతుంది'. ఓ సినిమాలోని డైలాగ్ ఇది. చాలా మంది బలంగా కోరుకున్నట్టున్నారు. ఈ ఇద్దరు లవర్స్ విడిపోయారు. లవర్స్ అనడం కూడా వాళ్లకు ఇష్టం లేదట. లవ్ బ్రేకప్ కంటే.. డేటింగ్ బ్రేకప్ అనడమే కరెక్టా?

Did Malaika and Arjun Kapoor break up.. What is the reason behind unfollowing their family members on Insta..
‘గట్టిగా కోరుకో.. అయిపోతుంది’. ఓ సినిమాలోని డైలాగ్ ఇది. చాలా మంది బలంగా కోరుకున్నట్టున్నారు. ఈ ఇద్దరు లవర్స్ విడిపోయారు. లవర్స్ అనడం కూడా వాళ్లకు ఇష్టం లేదట. లవ్ బ్రేకప్ కంటే.. డేటింగ్ బ్రేకప్ అనడమే కరెక్టా? మలైకా అరోరా.. అర్జున్ కపూర్‌ది లవ్‌స్టోరీ అయినా.. ఎఫైర్ అయినా.. ఏదైనా కానీ.. చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. అందరి బాధ అర్జున్ కపూర్ గురించే. సల్మాన్ తమ్ముడు అర్భాజ్‌ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని 19 ఏళ్ల తర్వాత డివోర్స్ తీసుకున్నారు. వీళ్లిద్దరినీ కలపాలని సల్మాన్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో అర్జున్‌కపూర్‌తో ఎంత కాలం వుంటుందన్న గుసగుసలు వినిపించాయి.
వచ్చే అక్టోబర్‌కు మలైకాకు 50 ఏళ్లు నిండుతాయి. అర్జున్ కపూర్‌కు 37 ఏళ్లు. 13 ఏళ్ల గ్యాప్ వుంది. తొమ్మిదేళ్లుగా కలిసి జీవిస్తున్నారేగానీ.. వీళ్లద్దరి మధ్య పెళ్లి ఊసు రాలేదు. వీళ్లిద్దరి ఎఫైర్ ఒకట్రెండేళ్లకే బ్రేక్ పడక తప్పదని చాలామంది ఊహించారు. అయితే.. తొమ్మిదేళ్లు కలిసి వుంటారని ఊహించలేదు. ఇన్నేళ్ల సహజీవనం వాళ్లకు షాక్ ఇచ్చింది.
మలైకా.. అర్జున్ కపూర్ బ్రేకప్ వార్త ఈమధ్య బాగా వినిస్తోంది. వీళ్లిద్దరి మధ్య వున్నది ప్రేమ అయితే ఖండిస్తారు. కానీ.. వీళ్ల మధ్య డేటింగ్ నడుస్తోంది. బ్రేకప్ వార్తను ఖండిస్తారని ఎవరూ అనుకోరు కూడా. అయితే.. మలైకా తన ఇన్‌స్టా నుంచి అర్జున్ కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ జాన్వి, ఖుషీ కపూర్‌ను అన్‌ఫాలో చేసింది. ఈలెక్కన బ్రేకప్ న్యూస్ గాసిస్ కాదని తేలిపోయింది.
మలైకా, అర్జున్ కపూర్ బ్రేకప్‌కు కుషా కపిల కారణమంటూ కొత్త న్యూస్ బైటకొచ్చింది. జాన్వి కపూర్ ఫ్రెండ్, మోడల్ కమ్ యాక్టర్ కుషా కపిలకు అర్జున్ దగ్గరకావడంతో మలైకాకు నచ్చలేదని.. దీంతో బ్రేకప్ చెప్పేసిందన్న కథనాలు పుట్టుకొచ్చాయి. 2017లో సాఫ్ట్‌వేర్‌ను పెళ్లి చేసుకుని.. ఈ ఏడాది బ్రేకప్ చెప్పిన కపిల, అర్జున్ లవ్‌లో వున్నారంటూ బాలీవుడ్ మీడియా పేర్కొంది. రీసెంట్‌గా కపిల స్పందిస్తూ.. అర్జున్‌కపూర్‌తో డేటింగ్ వార్తలను ఖండించింది.