బన్నీ ఇంటికి ప్రభాస్ వచ్చాడా…? అసలు నిజం ఏంటి…?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తర్వాత టాలీవుడ్ ఒకసారిగా షేక్ అయిపోయింది. సినిమా ప్రముఖులందరూ అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక జనాలు కూడా గత శనివారం ఒకరకంగా షాక్ లోనే ఉండిపోయారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తర్వాత టాలీవుడ్ ఒకసారిగా షేక్ అయిపోయింది. సినిమా ప్రముఖులందరూ అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక జనాలు కూడా గత శనివారం ఒకరకంగా షాక్ లోనే ఉండిపోయారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం అలాగే ఆయన ఒక రాత్రి జైల్లో గడపటం ఇవన్నీ కూడా సంచలనమయ్యాయి. నేషనల్ మీడియా కూడా ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ అయిన అల్లు అర్జున్ కు ఈ పరిస్థితి రావడం చాలామంది జీర్ణించుకోలేకపోయారు అనే మాట అక్షరాల నిజం.
దీనితోనే అల్లు అర్జున్ ఇంటికి చాలా మంది సినిమా పెద్దలు క్యూ కట్టారు. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళలేదు. అల్లు అర్జున్ కు ప్రభాస్ ఫోన్ చేసినట్లు కూడా ఎక్కడ వార్తలు రాలేదు. అంత హడావుడిలో జనాలు కూడా ఈ అంశంపై అసలు ఫోకస్ కూడా పెట్టలేదు. రామ్ చరణ్ కు ప్రభాస్ చాలా క్లోజ్ గా ఉంటాడు. వాళ్ళిద్దరికీ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అయితే అల్లు అర్జున్ కు ప్రభాస్ కు మధ్య గ్యాప్ ఏమైనా ఉందా… లేకపోతే ప్రభాస్ రియాక్ట్ కాకపోవడం వెనక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది.
అయితే తాజాగా ప్రభాస్ తన కాలు బెణికిందని అందుకే తాను కల్కి సినిమా జపాన్ ప్రమోషన్స్ కు కూడా వెళ్లడం లేదని ప్రకటించాడు. అయితే షూటింగ్ సందర్భంగా ఎక్కడైనా ఉన్నాడా లేకపోతే హైదరాబాదులోనే ఉండి కావాలని వెళ్లలేదా అనేది చాలామందికి అర్థం కావడం లేదు. అయితే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులకు ప్రభాస్ అభిమానులకు పుష్ప సినిమా తర్వాత పెద్ద గొడవే జరిగింది. ప్రభాస్ రికార్డులను పుష్ప సినిమా బద్దలు కొట్టడం రెబల్ స్టార్ ఫ్యాన్స్ కోసం ఏమాత్రం నచ్చలేదని అంటారు కొంతమంది.
అందుకే వీళ్ళ మధ్య సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. అసలు పుష్పా సినిమా రికార్డులన్నీ ఫేక్ అని కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. బాహుబలి సినిమా రికార్డులను కూడా పుష్ప సినిమా బ్రేక్ చేసే ఛాన్స్ కనబడుతోంది. దీనితోనే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఏది ఏమైనా అంతమంది అల్లు అర్జున్ ఇంటికి వెళ్తే ప్రభాస్ వెళ్లకపోవడం అసలు కనీసం ఆయన ఫోన్ చేశారు అనే వార్తలు కూడా రాకపోవడం చూసి చాలా మంది అసలు ఏం జరుగుతుంది టాలీవుడ్ లో అంటూ షాక్ అవుతున్నారు అయితే ప్రభాస్ ప్రస్తుతం హైదరాబాదులోనే షూటింగ్ చేస్తున్నాడని టాక్. మీడియాలో మాత్రం ప్రభాస్ వెళ్తున్నాడని ప్రచారం జరిగింది. యేవో ఫోటోలు బయటకు వచ్చాయి కాని… అవి అప్పటివి కాదని టాక్.