సల్మాన్ ఖాన్ ను నమ్మించి మోసం చేశారా.. ఈ దారుణమైన పరిస్థితికి కారణం ఏంటి..?
ఎలాంటి వాడు ఎలా అయిపోయాడ్రా..! తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను చూసి ఇవే అంటున్నారు అభిమానులు. ఒకప్పుడు ఆయన సినిమా వచ్చిందంటే పూనకాలు వచ్చినట్టు బాక్సాఫీస్ ఊగిపోయేది.

ఎలాంటి వాడు ఎలా అయిపోయాడ్రా..! తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను చూసి ఇవే అంటున్నారు అభిమానులు. ఒకప్పుడు ఆయన సినిమా వచ్చిందంటే పూనకాలు వచ్చినట్టు బాక్సాఫీస్ ఊగిపోయేది. సినిమా ఎలా ఉన్నా కూడా రికార్డులు మాత్రం ఖచ్చితంగా వచ్చేవి. విడుదలైన మూడు రోజుల్లోనే 100 కోట్లు, 200 కోట్లు వసూలు చేసేది ఆయన సినిమాలు. కానీ ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. 100 కోట్లు పక్కన పెట్టు.. ముందు సినిమాకు ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా వెనక్కి వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా విడుదలైన సికిందర్ సినిమాకు ఇప్పటివరకు కనీసం 100 కోట్ల కలెక్షన్ కూడా రాలేదు. సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ కు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. సమస్య ఎక్కడుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకో తెలియదు కానీ ముందు నుంచే సికిందర్ సినిమా మీద ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. సల్మాన్ కు ఎంతో ఇష్టమైన.. బాగా కలిసి వచ్చిన రంజాన్ పండక్కి వచ్చినా కూడా కలెక్షన్స్ రాలేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది.
రెండేళ్ల కింద ఈద్ సందర్భంగా వచ్చిన కిసికా భాయి కీసికా జాన్ కూడా డిజాస్టర్ అయింది. రెండు సార్లు పండక్కి వచ్చి ఎలాంటి మ్యాజిక్ చేయకుండానే వెనక్కి వెళ్ళిపోయాడు సల్మాన్ ఖాన్. ఒకప్పుడు ఈయన సినిమా రంజాన్ కు వస్తుంది అంటే రికార్డులు షేక్ అయిపోయేవి. వచ్చిన ప్రతిసారి కొత్త రికార్డులు క్రియేట్ చేసేవాడు కండల వీరుడు. ఇప్పుడు కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు కాకపోతే.. అవి ఫ్లాపుల పరంగా. సల్మాన్ లాంటి స్టార్ హీరో సినిమాకు కనీసం 100 కోట్ల కలెక్షన్ రాలేదు అనేదానికంటే దారుణమైన అవమానం మరొకటి లేదు. ఈ సినిమా ఫ్లాప్ కంటే సల్మాన్ ఖాన్ ను మరొకటి బాగా ఇబ్బంది పెడుతుంది. తను బాలీవుడ్లో అందరి సినిమాలకు సపోర్ట్ చేస్తాను కానీ.. తన సినిమా వచ్చినప్పుడు ఎవరు తనకు సపోర్ట్ చేయట్లేదు అనే బాధ ఆయనలో ఎక్కువగా కనిపిస్తుంది. తను స్టార్ హీరో కాబట్టి ఎవరి సపోర్ట్ అవసరం లేదు అని అందరూ అనుకుంటున్నారని.. కానీ కచ్చితంగా తనకు కూడా సపోర్ట్ కావాల్సిందే అంటూ ఈ మధ్య ఓ కామెంట్ చేశాడు సల్మాన్. దీన్ని బట్టి ఆయన బాలీవుడ్ లో ఒంటరి అయిపోయాడు అనే విషయం అర్థం అవుతుంది.
ఇదంతా చూస్తుంటే బాలీవుడ్ లో సల్మాన్ పని అయిపోయిందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. తనకు ఎంతో కలిసి వచ్చిన దక్షిణాది దర్శకులతో పనిచేసిన కూడా బాక్సాఫీస్ దగ్గర పని జరగడం లేదు. ఆ మధ్య ప్రభుదేవా.. తాజాగా మురుగుదాస్ ఇద్దరు ఆయనకు సక్సెస్ ఇవ్వలేకపోయారు. సల్మాన్ మార్కెట్ ఒకప్పట్లా ఇప్పుడు లేదు.. ఆయన ఒక్కడికే కాదు అమీర్ ఖాన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అప్పట్లో ఈయన సినిమా వస్తే ఇండస్ట్రీ హిట్ కొట్టేది.. కానీ ఇప్పుడు వచ్చినట్టు కూడా ఆడియన్స్ కు ఐడియా ఉండట్లేదు. ప్రేక్షకులు అప్డేట్ అవుతున్న వాళ్లు మాత్రం అక్కడే ఆగిపోవడంతో.. వాళ్ల సినిమాలు కూడా అంతే దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి. ఈ విషయంలో సల్మాన్ ఖాన్ తనను తాను బాగా అప్డేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. త్వరలోనే ఈయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. పూర్తిస్థాయి మాస్ మసాలా ఎంటర్టైనర్ ఇది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాల నిర్మించబోతున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.