Samantha: విడాకుల తరువాత సమంతకి ఇన్ని కష్టాలా?
డివోర్స్ తర్వాత సమంతకు అన్నీ కష్టాలే. ఎంచక్కా నాలుగు పాటలు.. పది సీన్స్‌తో సరదాగా నటించేసి కోట్లు వెనకేసుకునేది. ప్రస్తుతం యాక్షన్ సీన్స్‌లో నటిస్తూ... దెబ్బలు తింటోంది.
డివోర్స్ తర్వాత సమంతకు అన్నీ కష్టాలే. ఎంచక్కా నాలుగు పాటలు.. పది సీన్స్‌తో సరదాగా నటించేసి కోట్లు వెనకేసుకునేది. ప్రస్తుతం యాక్షన్ సీన్స్‌లో నటిస్తూ… దెబ్బలు తింటోంది. ఆరోగ్య సమస్యలు చాలవన్నట్టు.. రీసెంట్గా షూటింగ్లో గాయపడింది సామ్. సమంతకే ఇలా ఎందుకు జరగుతోందంటూ.. ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
డివోర్స్ ముందు వరకు సామ్ పెద్దగా కష్టపడలేదు. తనదైన పెర్ఫార్మెన్స్తో కళ్లతో భావాలు పలికిస్తూ మాయ చేసింది. ఈజీగా స్టార్డమ్ వచ్చేసింది. తక్కువ టైంలో ఎక్కువమంది స్టార్స్‌ను చుట్టేసింది. ఈ వైభోగంగా ప్రస్తుతం కనిపించడం లేదు. డివోర్స్ తర్వాత పెర్పార్మెన్స్కే ప్రాధాన్యమిస్తూ.. రిస్కులు చేస్తోంది.
సామ్ రెండేళ్లుగా యాక్షన్ సీన్స్ వున్న సినిమాలు.. వెబ్ సిరీస్‌లే ఎంచుకుంటోంది. యశోద సినిమాలో డూప్ లేకుండా ఫైట్స్ చేసింది. తొలి వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మేన్2లో యాక్షన్ సీన్స్‌తో ఇంప్రెస్ చేసింది. రెండో హిందీ వెబ్ సిరీస్ ‘సిటాడెట్’లో కూడా భారీ యాక్షన్ సీన్స్ వున్నాయి. దీని కోసం ఆమధ్య ట్రైనింగ్ కూడా తీసుకుంది. అయినా.. నటించేటప్పుడు చేతికి గాయాలు అయ్యాయి. చేతికి దెబ్బలు తగిలిన స్టిల్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది సామ్.
సమంతకు కష్టాలు కొత్తేమీ కాదు. పిజికల్‌గా .. మెంటల్‌గా ఎన్నో ఆటుపోటులు చూసింది. ఎంతో ధైర్యవంతురాలు కాబట్టే.. అరుదైన వ్యాధి ‘మయోసైటిస్’ నుంచి కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొంటోంది. వెబ్ సిరీస్ కోసం.. హార్స్ రైడింగ్‌లో ట్రైనప్ అయింది కూడా. గతంలో మాదిరి నాలుగు పాటలు పది సీన్స్‌తో కాకుండా.. ఫైటింగ్స్.. గాయాలతో సామ్ కెరీర్ నడిపిస్తోంది సామ్.