ఆ ఇల్లు మనోజ్ కే, మంచు లక్ష్మీ క్లారిటీ, విష్ణును టార్గెట్ చేసిందా…?
మంచు కుటుంబంలో వివాదాలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. గత ఆదివారం నుంచి జరుగుతున్న పరిణామాలతో అసలు ఏం జరుగుతుంది అనేది స్పష్టత రావడం లేదు. అసలు గొడవ ఆస్తులు కోసమా ఆధిపత్య పోరాటమా అనే దానిపై కూడా స్పష్టత లేదు.
మంచు కుటుంబంలో వివాదాలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. గత ఆదివారం నుంచి జరుగుతున్న పరిణామాలతో అసలు ఏం జరుగుతుంది అనేది స్పష్టత రావడం లేదు. అసలు గొడవ ఆస్తులు కోసమా ఆధిపత్య పోరాటమా అనే దానిపై కూడా స్పష్టత లేదు. మంచు కుటుంబ సన్నిహితులు మాత్రం ఇది కచ్చితంగా ఆస్తులు గొడవే అని అంటుంటే మంచు మనోజ్ మాత్రం ఆస్తులు గురించి కాదని స్పష్టంగా చెప్తున్నాడు. ఇక ఇప్పుడు మోహన్ బాబు, మంచు విష్ణు లకు రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇచ్చిన వార్నింగ్ కూడా సంచలమవుతోంది.
ఆ తర్వాత మంచు మనోజ్ తాము సమస్యలను కూర్చుని పరిష్కరించుకుంటామని చెప్పే ప్రయత్నం చేశాడు. అసలు తమ కుటుంబాల్లో ఇలాంటి గొడవలు జరగడానికి కారణం తన అన్న మంచు విష్ణు అని మనోజ్ పదేపదే చెప్తూ వస్తున్నాడు. బుధవారం కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. అయితే ఇప్పుడు మంచు లక్ష్మి ఎక్కడుంది ఏం చేస్తుంది అనేదానిపై మాత్రం స్పష్టత రావటం లేదు. మంచు లక్ష్మి… మోహన్ బాబు ఫోన్ చేసినా సరే ఆన్సర్ చేయడం లేదని మంచు మనోజ్ ఫోన్ చేసినా సరే ఆన్సర్ లేదని టాక్.
కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె యాక్టివ్ గా కనబడుతోంది. దీంతో అసలు ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థం కావటం లేదు, మంచు విష్ణు కి ఆమె కూడా వ్యతిరేకంగానే ఉంది అనే ప్రచారం గత రెండు రోజులుగా జరగటం మొదలైంది. భూమా మౌనికతో కూడా ఆమె సన్నిహితంగానే ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికే ఫిలింనగర్ లో ఉన్న ఇంటిని మంచు లక్ష్మి కి మోహన్ బాబు రాసిచ్చారు. ఇప్పుడు మరో ఇంటి కోసం పోరాటం జరుగుతోంది. ఆ ఇంటిని ఎలాగైనా సరే మంచు మనోజ్ కు ఇవ్వాల్సిందేనని మంచు లక్ష్మి పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది.
తిరుపతిలో ఉన్న ఆస్తులన్నీ దాదాపుగా మంచు విష్ణు లాక్కున్నాడని ఇప్పుడు ఇంటిని కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడని ఆమె సీరియస్ గా ఉందని అంటున్నాయి సినీ వర్గాలు. అయితే ఈ విషయంలో మోహన్ బాబు కరెక్ట్ గానే ఉన్నా మంచు విష్ణు మాత్రం ఆయనను తప్పుదోవ పట్టించారు అనేది మనోజ్ వాదన. దీంతో ఈ వ్యవహారం ఏ మలుపులు తిరగబోతుంది అనేది ఆసక్తికర పరిణామంగా మారింది. నిన్న వ్యూహాత్మంగా మంచు మనోజ్ మీడియా సమావేశాన్ని క్యాన్సిల్ చేయడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యవర్తులు ఎంటర్ కావడంతోనే ఆ మీడియా సమావేశం క్యాన్సిల్ అయింది అంటున్నాయి మోహన్ బాబు కుటుంబ సన్నిహిత వర్గాలు.