ట్రోల్ చేసినోళ్లకి అర్ధమైందా..? లుక్కు అదిరింది..!

ఎన్టీఆర్ మొన్న ఓ యాడ్ లో బాలేడంటూ చాలా మంది కామెంట్ చేశారు. తన హేయిర్ స్టైల్ మీద తెగ ట్రోలింగ్ నడిపారు. ఏకంగా వారం రోజుల పాటు ఈ తంతు జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2025 | 08:20 PMLast Updated on: Mar 12, 2025 | 8:20 PM

Did The Trolls Understand The Look Is Amazing

ఎన్టీఆర్ మొన్న ఓ యాడ్ లో బాలేడంటూ చాలా మంది కామెంట్ చేశారు. తన హేయిర్ స్టైల్ మీద తెగ ట్రోలింగ్ నడిపారు. ఏకంగా వారం రోజుల పాటు ఈ తంతు జరిగింది. కట్ చేస్తే ముంబై ఏయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ లుక్ రివీలైంది. అల్ ట్రా పోష్ లుక్ లో షాకిచ్చాడు ఎన్టీఆర్. సో తను యాడ్ లో ఎందుకు అలాంటి హేయిర్ స్టైల్ ని ఫాలో అయ్యాడో ఇప్పుడు కన్ఫామ్ అయ్యింది. వార్ 2 సాంగ్ లో తన లుక్ షాకింగ్ గా ఉంటుందట. అది కనిపించకుండా ఉండేందుకే, తన లుక్ రివీల్ కాకుండా ఉండేలా ఓ డమ్మీ లుక్ లో కనిపించాడు. యాడ్ కంటే సినిమా పెద్దది… సో తన హేయిర్ స్టైల్ ని టెంపరరీగా మార్చి అసలు లుక్ ని రివీల్ కాకుండా చేశాడు తారక… అది ఇప్పుడు ముంబై ఏయిర్ పోర్టులో తన లుక్ తో తేలింది. తన మీద జరిగిన ట్రోలింగ్ కి తన కొత్త లుక్కే సమాధానంగా మారింది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మొన్నటికి మొన్న ఓ యాడ్ లో మరీ జుట్టుని అదిమి దువ్వినట్టు, ఓ హేయిర్ స్టైల్ లో కనిపించాడు. ఎప్పుడో తీసిన యాడ్ కూడా కాదది, రీసెంట్ గానే తీసినట్టు తెలుస్తోంది. కాని అందులో గెడ్డంతో బానే ఉన్న తారక్, జుట్టు స్టైలే బాలేదని ట్రోలింగ్ చేశారు. కాకపోతే వార్ 2 తోపాటు డ్రాగన్ లో తన లుక్ రివీల్ కాకూడదనే, తారక్ ఆ యాడ్ లో అలా కనిపించాడని ప్రచారం జరిగింది.కట్ చేస్తే అదిప్పుడు నిజమని తేలింది. కారణం ముంబైలో అల్ ట్రా పోష్ లుక్ లో తారక్ కనిపించటం. గెడ్డం తక్కువగా, మీసం కూడా ట్రిమ్ చేసి మాడ్రన్ హేయిర్ స్టైల్ తో కనిపించాడు తారక్. అయితే వార్ 2 సాంగ్ కోసం తన లుక్ ని ఇంకాస్త స్టైలిష్ గా మార్చుకున్న తారక్, కాస్త జుట్టు పెంచాల్సి వచ్చింది.

అది యాడ్ లో రివీల్ అయితే వార్ 2లో సర్ ప్రైజ్ కి ఛాన్స్ ఉండదనే, ఇలా జుట్టుని వొత్తిపట్టినట్టు దువ్వారు. గెడ్డం కూడా పెంచటంతో, ఇలావెరైటీ లుక్ లో కనిపించాడు తారక్. ఏదేమైనా ముంబై ఏయిర్ పోర్ట్ లో తన అసలు హేయిర్ స్టైల్ బయట పడింది. మరి ఇక్కడ తన లుక్ లీక్ అయ్యాక, వార్ 2లో ఇంకా సర్ ప్రైజ్ ఏముందనే డౌట్ రావచ్చు..అక్కడే ట్విస్ట్ ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 సాంగ్ లో మాత్రం క్లీన్ షేవ్ తో కనిపిస్తాడట. మీసాలు లేకుండా తను ఏ మూవీలో కనిపించలేదు. బ్రుందావనం, ఊసరవెళ్లి ఇలా చాలా సినిమాల్లో మీసాలు, గెడ్డం ట్రిమ్ చేశాడు. అలా కనిపించాడు కాని ఎన్నడూ మీసం, గెడ్డం పూర్తిగా క్లీన్ షేవ్ చేసి కనిపించలేదు..కాబట్టే ముంబై ఏయిర్ పోర్ట్ లో తను మీడియాకి చిక్కినా తన లుక్ రివీలైనా ఇబ్బంది లేదు. సో యాడ్ లో తన జుట్టు అలా ఉండటానికి, ముంబై ఏయిర్ పోర్ట్ లో స్టైలిష్ లుక్ కనిపించినా ఇబ్బంది లేదనటానికి రీజన్ ఇది…