Vijay- Rashmika : విజయ్‌-రష్మిక మళ్లీ హింట్ ఇచ్చినట్లేనా..?

విజ‌య్‌దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandana) .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. గీత గోవిందం (Geeta Govindam) సినిమాతో మంచి క్రేజ్ సంపాదించి.. హిట్ పెయిర్‌గా నిలిచారు. అలాంటి ఈ జోడీకి సిల్వర్ స్ర్కీన్ మీదనే కాదు.. బయట కూడా ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2024 | 11:25 AMLast Updated on: Mar 12, 2024 | 11:25 AM

Did Vijay Rashmika Give A Hint Again

విజ‌య్‌దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandana) .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. గీత గోవిందం (Geeta Govindam) సినిమాతో మంచి క్రేజ్ సంపాదించి.. హిట్ పెయిర్‌గా నిలిచారు. అలాంటి ఈ జోడీకి సిల్వర్ స్ర్కీన్ మీదనే కాదు.. బయట కూడా ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. విజ‌య్-ర‌ష్మిక క‌లిశారంటే చాలు కెమెరాల‌ క‌ళ్లన్నీ అటు వైపే ఉంటాయి. పైగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని… సహజీవనం చేస్తున్నారంటూ చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నప్పటికి… వారి మాటలను ఎవరూ నమ్మడం లేదు. ఈ జంట తమ లవ్‌ అఫైర్‌ని కవర్‌ చేస్తోందంటున్నారు. ఇలాంటి టైమ్‌లో విజయ్ రష్మిక మధ్యలో ఏదో కొనసాగుతోంది అనేలా.. ఇన్ స్టాగ్రామ్ పోస్టులు హింట్ ఇచ్చాయి. అయితే వీళ్లిద్దరి సీక్రెట్ లవ్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.

రీసెంట్ గా విజయ్ దేవరకొండ తన బ్రాండ్ రౌడీ వేర్ ను ప్రమోట్ చేస్తూ ఒక వీడియో విడుదల చేశాడు. అందులో అతను ఒక క్యాప్ కూడా పెట్టుకున్నాడు.. అటు.. రష్మిక కూడా మహిళా సాధికారిక కోసం పెట్టిన ఒక పోస్ట్‌లో అదే రకమైన క్యాప్ పెట్టుకుంది. ఈ రెండు ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.. ఈ ఇద్దరు ఒకే తరహాలో క్యాప్ పెట్టుకొని తమ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందంటూ హింట్ ఇస్తున్నారంటున్నారు నెటిజన్లు.. అయితే ఎప్పటిలాగానే ఈ జోడీ తమపై వస్తున్న వార్తలపై రియాక్ట్ కాకుండా తమ పని తాము కామ్‌గా చేసుకుంటున్నారు. అయితే ఈ ఫొటోలు చూసిన వీళ్లిద్దరి కామన్ ఫ్యాన్స్ మాత్రం తెగ సందడి చేస్తున్నారు. వీరిని జంటగా చూడాలని… పెళ్లి చేసుకోవాలని బలంగా కోరుకొనే ఈ అభిమానులు.. ఈ ఫొటోలను వైరల్‌ చేస్తున్నారు. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లితో ఒక్కటి కావాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక తమ కెరీర్‌లో దూసుకుపోయేలా ప్లాన్స్ చేస్తున్నారు. ‘పుష్ప: ది రైజ్’ సినిమా తర్వాత రష్మికాకు హిందీ సినిమాల్లో అవకాశాలు క్యూకట్టాయి.. రష్మిక పుష్ప 2 సినిమాతో పాటు ధనుష్ కుబేర సినిమా చేస్తోంది. మరొక రెండు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులు సైతం ఈ నేషనల్ క్రష్‌ చేతిలో ఉన్నాయి. అటు.. విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమాతో పాటు గౌతమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే మరో రెండు సినిమాల కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాగా.. వీరిద్దరి కాంబోలో మరో సినిమా చూడాలి అని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.