మెహర్ రమేష్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అని మీకు తెలుసా.. ఏంటి నమ్మరా.. సాక్ష్యాలు చూపిస్తా..!

మెహర్ రమేష్ ఏంటి.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఏంటి? అసలు ఈ రెండు పదాలకు ఎక్కడ సింక్ అవ్వట్లేదు అనుకుంటున్నారు కదా..! పాపం ఏం చేస్తాం ఇండ‌స్ట్రీలో కొంద‌రు ద‌ర్శ‌కుల‌కు ఏం చేసినా కాలం క‌లిసిరాదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 28, 2025 | 11:53 AMLast Updated on: Feb 28, 2025 | 11:53 AM

Did You Know Mehr Ramesh Is A Blockbuster Director

మెహర్ రమేష్ ఏంటి.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఏంటి? అసలు ఈ రెండు పదాలకు ఎక్కడ సింక్ అవ్వట్లేదు అనుకుంటున్నారు కదా..! పాపం ఏం చేస్తాం ఇండ‌స్ట్రీలో కొంద‌రు ద‌ర్శ‌కుల‌కు ఏం చేసినా కాలం క‌లిసిరాదు. అలాంటి వాళ్ళ‌లో మెహ‌ర్ ర‌మేష్ అంద‌రికంటే ముందుంటాడు. ఈయ‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాలు మ‌రే ద‌ర్శ‌కుడికి రాలేదు. ఒక్క‌టంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ వ‌చ్చిన 5 సినిమాలు 5 డిజాస్ట‌ర్లుగా మ‌లిచాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు ఈ పేరు వింటేనే నిర్మాత‌లు హీరోలు వ‌ణికిపోతున్నారు. కంత్రి.. బిల్లా.. శ‌క్తి.. షాడో.. భోళా శంకర్.. ఇలా ఒక‌దాన్ని మించి మ‌రో సినిమాలు ఇచ్చాడు మెహ‌ర్ ర‌మేష్. అందుకే మెహర్ పేరు సినిమాల్లో కంటే ఎక్కువగా ట్రోలింగ్ లో వినిపిస్తూ ఉంటుంది. ఎవరైనా హీరో మెహర్ రమేష్ తో సినిమా చేస్తున్నాడు అంటే అయ్యో పాపం అనుకునే స్టేజ్ కి దిగజారిపోయాడు ఆయన.

తెలుగు ఇండస్ట్రీలో డిజాస్టర్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన మెహర్ రమేష్ కూడా కొన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు అంటే మీరు నమ్మగలరా..? క‌న్న‌డ‌లో మెహర్ రమేష్ అంటే బ్లాక్ బస్టర్ సినిమాలకు పెట్టింది పేరు. మనోడు టేకింగ్ మేకింగ్ తెలుగులో నచ్చలేదు కానీ కర్ణాటకలో మాత్రం ఖతర్నాక్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఒక్కడు సినిమాలో రీమేక్ చేసి అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మెహర్ రమేష్. అంతేకాదు తెలుగులో ఫ్లాప్ అయినా ఆంధ్రావాలా సినిమాను కన్నడలో వీర కన్నడిగా పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఈ రెండు సినిమాల్లోనూ దివంగత పునీత్ రాజ్ కుమార్ హీరో.

కన్నడిగులు మెహర్ రమేష్ టాలెంట్ గుర్తించారు కానీ మన దగ్గర మాత్రం ఎందుకో పూర్తిగా ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయాడు ఈ దర్శకుడు. భోళా శంకర్ వచ్చి రెండేళ్లయిన ఇప్ప‌టికీ మ‌రో ఆఫ‌ర్ రాలేదు. దాంతో ఇప్పుడు ఈయ‌న ఏం చేస్తున్నాడు..? ఇవ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లే. కానీ మెహ‌ర్ ఎవ‌రి సినిమాకు ప‌ని చేస్తున్నాడో తెలిస్తే షాక్ అయిపోతారు. ఈయ‌న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేస్తున్నాడు. అంతేకాదు.. కొంద‌రు ద‌ర్శ‌కులు మెహ‌ర్ పై ఉన్న న‌మ్మ‌కంతో ఆయ‌న‌కే కొన్ని యాక్ష‌న్ సీక్వెన్సులు తెర‌కెక్కించాలంటూ బాధ్య‌త అప్ప‌చెబుతున్నారు. అంతేకాదు యాడ్స్ కూడా చేస్తున్నాడు. ఫుల్ సినిమా అయితే తీయలేడేమో గాని యాక్షన్స్ అన్ని విషయాలు మాత్రం అదిరిపోయేలా తీస్తాడు అనే పేరు మెహర్ రమేష్ కు ఉంది. దాన్నే ఇప్పుడు మన దర్శకులు వాడుకుంటున్నారు.